▪ ‘ఆల్ఫాలీట్’ వేడుకలో సోనూ సూద్ తో కలిసి సందడి చేసిన మిస్ ఇండియా మానస
హైదరాబాద్: భారతదేశంలో అత్యంత పారదర్శకమైన, ల్యాబ్-పరీక్షించిన, అమెరికా ప్రమాణాలకు అనుగుణంగా నాణ్యమైన హెల్త్ సప్లిమెంట్లను అందించాలనే లక్ష్యంతో ‘ఆల్ఫాలీట్’ (Alphlete) బ్రాండ్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. నగరంలోని ట్రైడెంట్ హోటల్‌లో జరిగిన ఈ గ్రాండ్ లాంచ్ వేడుకలో ‘ఇండియన్ రియల్ హీరో’ సోనూ సూద్ ముఖ్య అతిథిగా పాల్గొని, ‘ఆల్ఫాలీట్’ బ్రాండ్‌ను ఆవిష్కరించారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సోనూసూద్ తో పాటు మిస్ ఇండియా మానస ముఖ్య అతిథులుగా హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. “Authentic – Exclusive – Performance” అనే నినాదంతో ప్రజల ముందుకు వచ్చిన ఆల్ఫాలీట్, ఆరోగ్యాన్ని ప్రోత్సహించే అత్యుత్తమ సప్లిమెంట్లను అందించడమే తమ లక్ష్యమని స్పష్టం చేసింది.
ఈ సందర్భంగా సోనూసూద్ మాట్లాడుతూ..
“ఆల్ఫాలీట్ వంటి ఒక అద్భుతమైన బ్రాండ్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా ఫౌండర్లు సురేష్ శుక్లా, శ్రవణ్ ఘంటలకు నా హృదయపూర్వక అభినందనలు.
ఈ రోజుల్లో యువత ఫిట్‌నెస్‌పై ఎంతో శ్రద్ధ చూపుతోంది. అయితే, మార్కెట్లో కల్తీ సప్లిమెంట్ల బెడద కూడా అదే స్థాయిలో పెరిగింది. ఇది ఎంతో ఆందోళన కలిగించే విషయం. సరైన సప్లిమెంట్స్ తీసుకోకపోతే ఆరోగ్యానికి మేలు జరగకపోగా, తీవ్రమైన హాని కలిగే ప్రమాదం ఉంది.
ఇలాంటి సమయంలో, పూర్తి పారదర్శకతతో, ల్యాబ్-టెస్టులు చేసి, అమెరికా ప్రమాణాలతో నాణ్యమైన ఉత్పత్తులను అందించాలనే ఆల్ఫాలీట్ సంకల్పం ప్రశంసనీయం. ఫిట్‌నెస్‌లో సప్లిమెంట్లు కీలక పాత్ర పోషిస్తాయి, కానీ సరైనవి ఎంచుకోవడం అంతకంటే ముఖ్యం. ఆల్ఫాలీట్ నాణ్యత విషయంలో తీసుకుంటున్న శ్రద్ధ, వినియోగదారుల పట్ల వారికున్న బాధ్యతను తెలియజేస్తుంది.
ఫిట్‌నెస్ ఔత్సాహికులు, యువత సరైన సమాచారంతో, నమ్మకమైన బ్రాండ్లను ఎంచుకోవాలి. ఆల్ఫాలీట్ ఆ నమ్మకాన్ని నిలబెడుతుందని నేను విశ్వసిస్తున్నాను. ఈ బ్రాండ్ విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను,” అని అన్నారు.
భారత మార్కెట్‌లో నమ్మకాన్ని నింపడమే లక్ష్యం – సురేష్ శుక్లా, ఫౌండర్ & సీఈఓ
ఈ సందర్భంగా ఆల్ఫాలీట్ ఫౌండర్ & సీఈఓ సురేష్ శుక్లా మాట్లాడుతూ, “భారతదేశ సప్లిమెంట్ మార్కెట్‌లో విశ్వసనీయత, పారదర్శకత కొరవడింది, ఈ లోటును పూడ్చేందుకే ఆల్ఫాలీట్‌ను స్థాపించాం. అమెరికాలో ఎంబీఏ పూర్తి చేసి, ఫిట్‌నెస్, బాడీబిల్డింగ్‌పై ఉన్న మక్కువతో, భారతీయ వినియోగదారులకు 100% అసలైన, క్యూఆర్-కోడ్ వెరిఫైడ్, యూఎస్ ప్రమాణాలతో కూడిన ల్యాబ్-టెస్టెడ్ సప్లిమెంట్లను అందించాలనే లక్ష్యంతో ఈ బ్రాండ్‌ను ప్రారంభించాం” అని వివరించారు.
ఇది కేవలం వ్యాపారం కాదు, ఒక ఉద్యమం – శ్రవణ్ ఘంట , – కో-ఫౌండర్ & సీఎఫ్ఓ
ఆల్ఫాలీట్ కో-ఫౌండర్, సీఎఫ్ఓ శ్రవణ్ ఘంట మాట్లాడుతూ, “సురేష్ శుక్లా ఆలోచన, ఆశయం నచ్చి ఈ ప్రయాణంలో భాగస్వామి అయ్యాను. నాణ్యత విషయంలో రాజీలేని, సమాజ శ్రేయస్సును కాంక్షించే నమ్మకమైన బ్రాండ్‌ను నిర్మించడమే మా ధ్యేయం. ఆల్ఫాలీట్ కేవలం వ్యాపారం మాత్రమే కాదు, ప్రజల ఆరోగ్యానికి, సాధికారతకు పాటుపడే ఒక ఉద్యమం” అని పేర్కొన్నారు.
పూర్తిగా ల్యాబ్ పరీక్షలు నిర్వహించిన తర్వాతే తమ ఉత్పత్తులు మార్కెట్లోకి వస్తాయని, నాణ్యతలో అమెరికా ప్రమాణాలను పాటిస్తామని నిర్వాహకులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమం ఎంతో ఉత్సాహభరితమైన వాతావరణంలో జరిగింది. పలువురు ఫిట్‌నెస్ నిపుణులు, హెల్త్ ఇన్‌ఫ్లుయెన్సర్లు, మీడియా ప్రతినిధులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ లాంచ్ ఈవెంట్‌కు సంబంధించిన విశేషాలు సోషల్ మీడియాలో #iamalphalete అనే హ్యాష్‌ట్యాగ్‌తో వైరల్ అవుతున్నాయి.
v‘మా రాముడు అందరివాడు’ దమ్మున్న సినిమా : హీరో శ్రీరామ్ ‘మా రాముడు అందరివాడు’ చిత్రంలోని ఫాదర్ అండ్ సన్…
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…