క్రిస్మ‌స్ బ‌రిలో వృష‌భ‌… అత్య‌ద్భుత‌మైన సినిమాటిక్ ఎక్స్‌పీరియ‌న్స్‌కి అంతా రెడీ!

ప్ర‌పంచ‌వ్యాప్తంగా అంద‌రూ ఎదురుచూస్తున్న వృష‌భ రిలీజ్ డేట్‌ని క‌న్‌ఫ‌ర్మ్ చేశారు మేక‌ర్స్. ఈ ఏడాది క్రిస్మ‌స్ కానుక‌గా డిసెంబ‌ర్ 25న ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఇంత‌కుమునుపెన్న‌డూ ప్రేక్ష‌కులు ఆస్వాదించ‌ని విజువ‌ల్స్ తో అత్య‌ద్భుతంగా సిద్ధ‌మ‌వుతోంది వృష‌భ‌.
తండ్రీ కొడుకుల మ‌ధ్య అంద‌మైన, గాఢ‌మైన అనుబంధాన్ని ఆవిష్క‌రిస్తూ, ప్రేమ‌, విధి, ద్వేషం వంటి ఎమోష‌న్స్ ని స‌మ‌ర్థ‌వంతంగా డీల్ చేసిన సినిమా వృష‌భ‌. నంద‌కిశోర్ ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం ప్రేక్ష‌కుల‌ను క‌ట్టిప‌డేస్తుంది.

అత్యంత భారీ వ్య‌యంతో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. గ్రాండ్ విజువ‌ల్ ఎఫెక్ట్స్, ప్ర‌తి చిన్న విష‌యాన్నీ జాగ్ర‌త్త‌గా డీల్ చేయాల్సిన పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌కు ఎక్కువ స‌మ‌యాన్ని కేటాయించారు మేక‌ర్స్. క్వాలిటీ విష‌యంలో మేం ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాలేదు. సినిమా ల‌వ‌ర్స్ కి ది బెస్ట్ సినిమాటిక్ ఎక్స్ పీరియ‌న్స్ ఇవ్వాల‌న్న‌దే మా నిబ‌ద్ధ‌త‌. అందుకే సినిమాను క్రిస్మ‌స్ బ‌రిలో తీసుకొస్తున్నాం. ప‌ర్ఫెక్ట్ ఫెస్టివ‌ల్ గిఫ్ట్ అవుతుంది. విశ్వ‌వ్యాప్తంగా ఉన్న లాల్ ఏట్ట‌న్ అభిమానుల‌కు, మూవీ ల‌వర్స్ కి క‌న్నుల‌పండువ‌గా ఉంటుంది అని చెప్పారు మేక‌ర్స్.
క్రిస్మ‌స్ బ‌రిలో గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నామ‌నే విష‌యాన్ని మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల చేసి అనౌన్స్ చేశారు నిర్మాత‌లు.

మోహ‌న్‌లాల్‌, స‌మ‌ర్జిత్ లంకేష్‌, రాగిణి ద్వివేది, న‌య‌న్ సారిక‌, అజ‌య్‌, నేహా స‌క్సేనా ఈ సినిమాలో కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. శామ్ సీయ‌స్ సంగీతం అందిస్తున్నారు. అకాడెమీ అవార్డ్ విన్న‌ర్ ర‌సూల్ పూకుట్టి సౌండ్ డిజైన్ చేస్తున్నారు. ఎస్ ఆర్ కె, జ‌నార్ద‌న్ మ‌హ‌ర్షి, కార్తిక్ డైలాగులు అందిస్తున్నారు. పీట‌ర్ హెయిన్స్, స్టంట్ శివ‌, గ‌ణేష్‌, నిఖిల్ హై ఆక్టేన్ యాక్ష‌న్‌ని కొరియోగ్ర‌ఫీ చేశారు.

క‌నెక్ట్ మీడియా, బాలాజీ టెలిఫిల్మ్స్, అభిషేక్.య‌స్‌ స‌మ‌ర్పిస్తున్నారు. వ్యాస్ స్టూడియోస్ నిర్మిస్తోంది. శోభా క‌పూర్‌, ఏక్తా ఆర్ క‌పూర్‌, సి.కె.ప‌ద్మ‌కుమార్‌, వ‌రుణ్ మాథుర్‌, సౌర‌భ్ మిశ్రా, అభిషేక్ ఎస్ వ్యాస్‌, ప్ర‌వీర్ సింగ్‌, విశాల్ గుర్ణ‌ని, జుహి ప‌రేఖ్ మెహ‌తా నిర్మిస్తున్నారు. విమ‌ల్ ల‌హోటి స‌హ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

యాక్ష‌న్‌, ఎమోష‌న్‌, విజువ‌ల్ గ్రాండియ‌ర్ క‌ల‌గ‌లిసిన అత్య‌ద్భుత‌మైన ఎపిక్ సినిమాటిక్ జ‌ర్నీగా వృష‌భ‌ను తీర్చిదిద్దుతున్నారు. మ‌ల‌యాళం, తెలుగులో ఏక స‌మ‌యంలో చిత్రీక‌రించారు. హిందీ, క‌న్న‌డ‌లోనూ విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి.

TFJA

Recent Posts

‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’ బోలెడన్ని ట్విస్టులతో ఉంటుంది.. ఏ ఒక్కరినీ నిరాశపర్చదు.. గ్రాండ్ ప్రివ్యూ ఈవెంట్‌లో రాజీవ్ కనకాల

రాజీవ్ కనకాల, ఉదయభాను, వసంతిక, శ్రీరామ్ వెంకట్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’.…

22 hours ago

తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (TFJA) కి యువ నిర్మాత వంశీ నందిపాటి విరాళం

తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (TFJA) సభ్యుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న TFJA టీమ్ ను అభినందిస్తూ,…

2 days ago

మార్చి 4వ తేదీ నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు వస్తున్న సూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ”ఓం శాంతి శాంతి శాంతిః”

సరికొత్త కంటెంట్ తో వ్యూయర్స్ ను ఎంగేజ్ చేస్తున్న ఆహా ఓటీటీ మరో సూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్…

2 days ago

బుక్ మై షోలో 100కె టికెట్ బుకింగ్స్ క్రాస్ చేసిన బ్లాక్ బస్టర్ లవ్ స్టోరీ మూవీ “కపుల్ ఫ్రెండ్లీ”

సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ "కపుల్ ఫ్రెండ్లీ" బాక్సాఫీస్ వద్ద స్టడీ…

2 days ago

మూవీ ఆర్టిస్టుల అసోసియేషన్ డైరీని ఆవిష్కరించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ )నూతన డైరీని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదుగా 'మా…

2 days ago

“అరుణాచల గిరి ప్రదక్షిణ”ఫస్ట్ గ్లిమ్ప్స్ ఆవిష్కరించినప్రఖ్యాత నటులు తనికెళ్ళ!!

"ఆటగదరా శివా" అంటూ శివతత్వాన్ని ఆవిష్కరించిన ప్రముఖ నటుడు - రచయిత- దర్శకుడు తనికెళ్ళ భరణి… సుప్రసిద్ధ మహిమాన్విత పుణ్యక్షేత్రం…

2 days ago