ఆకాష్ పూరి అతిథిగా ‘తస్కరించుట’ సినిమా ప్రారంభోత్సవం

సన్నీ హీరోగా పరిచయం అవుతున్న సినిమా తస్కరించుట. ఈ చిత్రాన్ని రెచెల్ పిక్చర్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.1 సినిమాగా ప్రొడ్యూసర్ షేక్ అఫ్రీన్ నిర్మిస్తున్నారు. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ కథతో దర్శకుడు శివప్రసాద్ చలువాది రూపొందిస్తున్నారు. ఈ రోజు హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో తస్కరించుట సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో యంగ్ హీరో ఆకాష్ పూరి, ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ అతిథులుగా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో యంగ్ హీరో ఆకాష్ పూరి స్క్రిప్ట్ అందజేసి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. అనంతరం మూవీ పోస్టర్ లాంఛ్ చేశారు. నిర్మాత బెల్లంకొండ సురేష్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ నిచ్చారు. ఈ సందర్భంగా

అతిథిగా వచ్చిన హీరో ఆకాష్ పూరి మాట్లాడుతూ – సత్కరించుట మూవీ టైటిల్ పోస్టర్ బాగుంది. హీరోగా పరిచయం అవుతున్న సన్నీకి కంగ్రాట్స్. మూవీ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా. అన్నారు.

హీరో సన్నీ మాట్లాడుతూ – ఈ రోజు మా తస్కరించుట మూవీ ప్రారంభోత్సవానికి వచ్చిన హీరో ఆకాష్ పూరి గారికి థ్యాంక్స్ చెబుతున్నాం. ఈ చిత్రంతో ఒక మంచి ప్రయత్నం చేస్తున్నాం. క్రైమ్ కామెడీ జానర్ లో మూవీ ఉంటుంది. మీ అందరికీ నచ్చేలా సినిమా చేస్తాం. అన్నారు.

నిర్మాత షేక్ అఫ్రీన్ మాట్లాడుతూ – మా మూవీ తస్కరించుట గ్రాండ్ గా లాంఛ్ చేసుకోవడం హ్యాపీగా ఉంది. గెస్ట్ లుగా వచ్చిన ఆకాష్ పూరి గారికి, బెల్లంకొండ సురేష్ గారికి మా ఎంటైర్ టీమ్ తరుపున థ్యాంక్స్ చెబుతున్నాం. ఒక ఇంట్రెస్టింగ్ క్రైమ్ కామెడీ సినిమాతో త్వరలోనే మీ ముందుకు వస్తాం. మా సంస్థకు తస్కరించుట సినిమా మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాం. అన్నారు.

దర్శకుడు శివప్రసాద్ మాట్లాడుతూ – తస్కరించుట సినిమాను సరికొత్త క్రైమ్ కామెడీ థ్రిల్లర్ గా రూపొందించబోతున్నాం. వచ్చే నెల 15వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. ఒక సరికొత్త ప్రెజెంటేషన్ తో సినిమా చేయబోతున్నాం. పేరున్న ఆర్టిస్టులు మా మూవీలో నటించబోతున్నారు. వారి వివరాలు త్వరలో వెల్లడిస్తాం. అన్నారు.

నిర్మాత బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ* – చిన్న చిత్రాలు ఆదరణ పొందాలి. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుంది. ఆకాష్ పూరి ఈ ఓపెనింగ్ కు రావడం సంతోషంగా ఉంది. తస్కరించుట సినిమాతో ఈ మూవీ టీమ్ ప్రేక్షకుల మనసుల్ని తస్కరించాలని కోరుకుంటున్నా. అన్నారు.

నటీనటులు – సన్నీ, తదితరులు

టెక్నికల్ టీమ్

ఆర్ట్ – కె రాకేష్
ఎడిటింగ్ – వెంకట్
సినిమాటోగ్రఫీ – అజయ్ ఎర్రగుంట్ల
మ్యూజిక్ – రోహిత్
పీఆర్ఓ -B .వీరబాబు
స్టోరీ స్క్రీన్ ప్లే – పండు చరణ్
ప్రొడ్యూసర్ – షేక్ అఫ్రీన్
డైరెక్టర్ – శివప్రసాద్ చలువాది

Tfja Team

Recent Posts

‘యమకింకరుడు’ ట్రైలర్‌ విడుదల చేసిన “రాక్షసుడు” నిర్మాత కె.ఎస్. రామారావు!

(తెలుగులో మొదటి AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సినిమాగా ‘యమ కింకరుడు’) ప్రముఖ నిర్మాత, దర్శకుడు తుమ్మలపల్లి రామసత్యనారాయణ టైటిల్ పాత్ర…

6 hours ago

‘మెయిన్ వాపస్ ఆవుంగా’ విజయోత్సవం – ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపిన ఇమ్తియాజ్ అలీ

హిందీ చిత్రం 'మెయిన్ వాపస్ ఆవుంగా' దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. విడుదలై ఆరు వారాలు పూర్తయినా ఈ…

7 hours ago

గ్రాండ్‌గా జరిగిన ‘MRP – నీకెంత నాకెంత’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. జూలై 17న రిలీజ్

యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ 'MRP - నీకెంత నాకెంత' చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విడుదల…

2 weeks ago

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు చేతుల మీదుగా రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ “అదే నీవు అదే నేను” టీజర్ రిలీజ్

తన బ్యానర్ సినిమాకు ఈ టైటిల్ పెట్టాలని అనుకున్నానని వెల్లడించిన ప్రొడ్యూసర్ దిల్ రాజు త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్…

2 weeks ago

నా కెరీర్ లో చాలా స్పెషల్ సినిమా ‘రక్త చరిత్ర’-రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో రామ్ గోపాల్ వర్మ

"రాయలసీమ ఫ్యాక్షనిజంలోని యథార్థ ఘటనలను ఆధారంగా చేసుకుని 'రక్త చరిత్ర' సినిమాను తీశాను. అందులోని క్యారెక్టర్స్ గురించి ఎంతో స్టడీ…

2 weeks ago

యతిరాజు పాత్రలో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచిన శివాజీ

అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తూ సితార ఎంటర్టైనర్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తూ నేడు ప్రేక్షకుల ముందుకు…

2 weeks ago