“క” సినిమా నుంచి తన్వీ రామ్ రాధ క్యారెక్టర్ ఫస్ట్ లుక్ రిలీజ్

యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా “క”. ఈ సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మిస్తున్నారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో ‌”క” సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాను త్వరలో తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకురాబోతున్నారు. “క” సినిమాను తెలుగులో ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి, మలయాళంలో హీరో దుల్కర్ సల్మాన్ తన వేఫరర్ ఫిలింస్ పై రిలీజ్ చేయబోతున్నారు.

తాజాగా “క” సినిమా నుంచి బ్యూటిఫుల్ హీరోయిన్ తన్వీ రామ్ నటిస్తున్న రాధ క్యారెక్టర్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో ట్రెడిషినల్ లుక్ లో దాండియా ఆడుతూ అందంగా కనిపిస్తూ ఆకట్టుకుంటోంది తన్వీరామ్. ఆమె చేస్తున్న రాధ క్యారెక్టర్ కు “క” సినిమాలో మంచి ఇంపార్టెన్స్ ఉండనుంది. బ్లాక్ బస్టర్ మూవీ “2018” తో ఇప్పటికే తెలుగు ప్రేక్షకుల ఆదరణ పొందిన తన్వీ రామ్ ఇప్పుడు “క” సినిమాతో మరోసారి తన అందంతో పాటు అభినయంతో ఇంప్రెస్ చేయబోతోంది.

నటీనటులు – కిరణ్ అబ్బవరం, నయన్ సారిక, తన్వీ రామ్, తదితరులు

టెక్నికల్ టీమ్
ఎడిటర్ – శ్రీ వరప్రసాద్
డీవోపీస్ – విశ్వాస్ డానియేల్, సతీష్ రెడ్డి మాసం
మ్యూజిక్ – సామ్ సీఎస్
ప్రొడక్షన్ డిజైనర్ – సుధీర్ మాచర్ల
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – చవాన్
క్రియేటివ్ ప్రొడ్యూసర్ – రితికేష్ గోరక్
లైన్ ప్రొడ్యూసర్ – కేఎల్ మదన్
సీయీవో – రహస్య గోరక్ (కేఏ ప్రొడక్షన్స్)
కాస్ట్యూమ్స్ – అనూష పుంజ్ల
మేకప్ – కొవ్వాడ రామకృష్ణ
ఫైట్స్ – రియల్ సతీష్, రామ్ కృష్ణన్, ఉయ్యాల శంకర్
కొరియోగ్రఫీ – పొలాకి విజయ్
వీఎఫ్ఎక్స్ ప్రొడ్యూసర్ -ఎంఎస్ కుమార్
వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ – ఫణిరాజా కస్తూరి
కో ప్రొడ్యూసర్స్ – చింతా వినీషా రెడ్డి, చింతా రాజశేఖర్ రెడ్డి
ప్రొడ్యూసర్ – చింతా గోపాలకృష్ణ రెడ్డి
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
రచన దర్శకత్వం – సుజీత్, సందీప్

Tfja Team

Recent Posts

*పాన్ ఇండియా ఫీచర్ ఫిల్మ్‌గా రాబోతున్న ‘వనజీవి రామయ్య’-

▪️ వాస్విక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 'వనజీవి రామయ్య' మూవీ టీమ్ సమక్షంలో ఘనంగా వనజీవి 90 వ జయంతి సందర్భంగా…

9 hours ago

ఘనంగా ప్రారంభమైన ‘నిమ్మకాయ.. నీకెందుకు భయం’ చిత్రం

హైదరాబాద్:ఆధునిక కాలంలోనూ మూఢనమ్మకాలను ఎండగట్టే ఉత్కంఠ రేపుతూ ఆసక్తికరంగా సాగే కథనంతో తెలుగు తెరపైకి ఓ సినిమా రాబోతుంది. రాజేష్…

1 day ago

ఏఐ ఫీచర్ ఫిల్మ్‌గా రాబోతున్న ‘అంబ’s రివెంజ,

▪️తెలుగు సినీ పరిశ్రమలో తొలి పూర్తి స్థాయి AI మూవీ▪️విడుదలకు సిద్ధమవుతూ ప్రచార పర్వం ప్రారంభంహైదరాబాద్‌: తెలుగు సినీ పరిశ్రమలో…

1 day ago

మురళీ శర్మ ఓటీటీ ఎంట్రీ.. నెట్‌ఫ్లిక్స్ తొలి తెలుగు ఒరిజినల్ ‘సూపర్ సుబ్బు’తో ప్రేక్షకుల ముందుకు

జూలై 2 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్న కామెడీ-డ్రామాలో కుక్కుటేశ్వరరావు పాత్రలో మురళీ శర్మ మూడు దశాబ్దాలకుపైగా హిందీ, తెలుగు,…

2 days ago

ఎన్టీఆర్ జీవితాన్ని పాఠ్యగ్రంథంగా చేర్చాలి, టీడీ జనార్ధన్ ఓ అరుదైన నిబద్ధత కలిగిన రాజకీయ నాయకుడు – మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు.

ఆంధ్రుల ఆరాధ్య దైవంగా వెండితెరపై మూడున్నర దశాబ్దాల పాటు వెలిగి తెలుగువారి గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించిన నందమూరి తారక…

2 days ago

బిలియన్ వ్యూస్ సాధించి చరిత్ర సృష్టించిన బోయపాటి శ్రీను బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా జయ జానకి నాయక.

భద్ర సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన జయ జానకి నాయక చిత్రం సంచలనం…

2 days ago