“స్వాతంత్రం మా స్వాతంత్ర్యం” సాంగ్ లాంచ్ చేసిన తమ్మారెడ్డి భరద్వాజ.

Must Read

తన ఆహార విధానంతో ఆరోగ్య డైట్ స్థాపించి ఆహారం మాది ఆరోగ్యం మీది అనే నినాదంతో కొంతమంది డైటీషియన్స్ మరియు కొంతమంది డాక్టర్స్ ను కలుపుకొని కూరగాయలతో కొన్ని వంటకాలు కనిపెట్టి ఎంతోమందికి దీర్ఘకాలిక వ్యాధిల్ని తగ్గిస్తున్న లక్ష్మణ్ పూడి తను మాతృ సంస్థ ప్రజానాట్యమండలి రూపకల్పనలో ఎం శేషగిరి రచించిన పాటను శ్రీనివాస్ నందుల సంగీత సారధ్యంలో లక్ష్మణ్ పూడి గానం చేసినటువంటి స్వాతంత్రం మా స్వాతంత్ర్యం అనే పాటను దర్శక,నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఈరోజు లాంచ్ చేశారు.

ఈ సందర్భంగా తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ, స్వాతంత్ర్యం వచ్చి 77 సంవత్సరాలు అయ్యింది. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత మన దేశం ఆర్థికంగా, టెక్నాలజీ పరంగా ఎంతో అభివృద్ధి చెందింది. కానీ నిరక్షరాస్యత, పేదరికం లో చాలా కుటుంబాలు కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ పరిస్థితులు అన్నిటిని దృష్టిలో పెట్టుకుని లక్ష్మణ్ పూడి గారు స్వాతంత్ర్యం మీద చేసిన సాంగ్ అద్బుతంగా ఉంది అన్నారు.

ఈ సందర్భంగా ప్రజానాట్యమండలి గాయకుడు లక్ష్మణ్ పూడి మాట్లాడుతూ నేను కారులో వెళుతున్నప్పుడు సిగ్నల్స్ దగ్గర భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్న వారికి, స్వాతంత్య్రం అంటే ఏమిటో తెలియదు. దేశంమీద ప్రేమతో ఇలాంటి నిరక్షరాస్యులను పాటతో మేల్కొల్పటానికి ఈ సాంగ్ చేయడం జరిగింది.

సాంగ్ లాంచ్ చేసిన మా గురువు గారు భరద్వాజ్ గారికి కృతజ్ఞతలు అన్నారు. కార్యక్రమానికి సినిమా డైరెక్టర్ కర్రి బాలాజీ, వంశీ లక్ష్మణ్ పూడి తదితరులు హాజరయ్యారు.

Latest News

Pushpa 2: The Rule’s First Half is Locked

The greatly celebrated sequel to the blockbuster film 'Pushpa: The Rise' is nearing its release. 'Pushpa 2: The Rule'...

More News