తమన్నా భాటియా హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘ఓదెల 2’లో నెవర్ బిఫోర్ క్యారెక్టర్ లో అలరించడానికి సిద్ధంగా వున్నారు. సూపర్ నాచురల్ థ్రిల్లర్ ‘ఓదెల రైల్వే స్టేషన్’కి సీక్వెల్ ఇది. అశోక్ తేజ దర్శకత్వంలో, మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్‌పై డి మధు నిర్మించిన ఈ చిత్రం ప్రతి అప్‌డేట్‌తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ఇటీవలి రీలీజిన టీజర్ ఎక్సయిట్మెంట్ పెంచింది, అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్ళింది. ఇప్పుడు మేకర్స్ సినిమా థియేట్రికల్ ట్రైలర్ అప్‌డేట్‌తో వచ్చారు.
ఓదెల 2 థియేట్రికల్ ట్రైలర్ ఈ నెల 8న ముంబైలో జరిగే అద్భుతమైన ఈవెంట్ లో గ్రాండ్‌గా లాంచ్ కానుంది. కోర్ టీమ్ హాజరు కానున్న ఈ కార్యక్రమంలో టీమ్ తెలుగు, హిందీ ట్రైలర్‌లను లాంచ్ చేయనుంది.
ఈ సినిమా ప్రారంభోత్సవం కాశీలో జరిగింది. టీజర్‌ను కుంభమేళాలో లాంచ్ చేశారు. ఇప్పుడు, ట్రైలర్‌ను లాంచ్ చేయడానికి మేకర్స్ ముంబైని ఎన్నుకున్నారు. విడుదల దగ్గర పడుతుండటంతో ఓదెల 2 ప్రచార కార్యక్రమాలు దూకుడుగా జరుగుతున్నాయి.
ఏప్రిల్ 17న థియేటర్లలో విడుదల కానున్న ఓదెల 2 ఈ వేసవిలో బిగ్గెస్ట్ ఎట్రాక్షన్ లో ఒకటిగా నిలుస్తుంది. తమన్నా భాటియా నాగ సాధువుగా అద్భుతంగా నటించి పవర్ ఫుల్ పాత్రకు ప్రాణం పోశారు.
హెబ్బా పటేల్, వసిష్ట ఎన్ సింహా ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. ఎక్సయిటింగ్ యాక్షన్‌ను అద్భుతమైన కథలతో కలపగల సామర్థ్యం వున్న సంపత్ నంది ఓదెల 2 చిత్రాన్ని సూపర్ విజన్ చేస్తున్నారు.
ఈ చిత్రానికి కాంతర ఫేం అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ అందిస్తున్నారు. రాజీవ్ నాయర్ ఆర్ట్ డైరెక్టర్, సౌందర్‌రాజన్ ఎస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. టాలెంటెడ్ టీమ్‌తో ఓదెల2 సినిమా మెమరబుల్ ఎక్స్ పీరియన్స్ ని అందించబోతోంది.
తారాగణం: తమన్నా భాటియా, హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహ, యువ, నాగ మహేష్, వంశీ, గగన్ విహారి, సురేందర్ రెడ్డి, భూపాల్, పూజా రెడ్డి
సాంకేతిక సిబ్బంది:
నిర్మాత: డి మధు
క్రియేటెడ్ బై: సంపత్ నంది
బ్యానర్లు: మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్
దర్శకత్వం: అశోక్ తేజ
DOP: సౌందర్ రాజన్ S
సంగీతం: అజనీష్ లోక్‌నాథ్
ఆర్ట్ డైరెక్టర్: రాజీవ్ నాయర్
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో
అవినాష్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా "వానర". ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. నందు…
వైవిధ్యమైన చిత్రం కలర్ ఫొటో, బ్లాక్‌బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య ఎంటర్టైన్మెంట్స్…
సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్ల మీద నిఖిల్ ఎం. గౌడ నిర్మించిన చిత్రం ‘జిన్’. ఈ మూవీకి…
బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్ - శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "ఎర్రచీర".…
వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు విశ్వక్ సేన్, హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి.…
శ్రోతలను ఉర్రుతలూగిస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' తొలి గీతం ‘దేఖ్లేంగే సాలా’ 24 గంటల్లోనే 29.6 మిలియన్లకు పైగా వీక్షణలతో…