తమన్నా-సంపత్ నంది లు లాంచ్ చేసిన రేవు రిలీజ్ డేట్ పోస్టర్

వంశీ రామ్ పెండ్యాల, అజయ్, స్వాతి భీమిరెడ్డి, ఏపూరి హరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా రేవు. ఈ చిత్రాన్ని సంహిత్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్, పారుపల్లి ప్రొడక్షన్ పై నిర్మాతలు డా. మురళీ గింజుపల్లి, నవీన్ పారుపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నిర్మాణ పర్యవేక్షకుడిగా జర్నలిస్ట్ ప్రభు, ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా ఫిలిం జర్నలిస్ట్ పర్వతనేని రాంబాబు వ్యవహరిస్తున్నారు.. హరినాథ్ పులి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న రేవు సినిమా ఆగస్టు 9 న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అ‌వుతోంది.


డైనమిక్ డైరెక్టర్ సంపత్ నంది, మిల్కి బ్యూటీ తమన్నా, హీరో వసిష్ఠ సింహ, మధు క్రియేషన్స్ అధినేత మధు.డి, డైరెక్టర్ అశోక్ తేజ, సినిమాటోగ్రాఫర్ సౌందర్ రాజన్ ల సమక్షంలో ఓదెల 2 సెట్స్ లో ఆగష్టు 9 న విడుదలవుతున్న రేవు రిలీజ్ డేట్ పోస్టర్ ను ఆవిష్కరించారు.


ఈ సందర్భంగా తమన్నా మాట్లాడుతూ.. రేవు సినిమా రిలీజ్ డేట్ పోస్టర్ ని లాంచ్ చేసినందుకు సంతోషంగా ఉంది, రేవు రిలీజ్ డేట్ పోస్టర్ చాలా డిఫరెంట్ గా ఉంది, ఈ సినిమా సక్సెస్ సాధించి నిర్మాతలు డా. మురళీ గింజుపల్లి, నవీన్ పారుపల్లి లకు మంచి లాభాలు తెచ్చిపెట్టాలని, సీనియర్ జర్నలిస్ట్ ప్రభు, పర్వతనేని రాంబాబు కు ఆల్ ద బెస్ట్ చెప్పారు.


డైరెక్టర్ సంపత్ నంది మట్లాడుతూ.. నా మిత్రులైన డా. మురళీ గింజుపల్లి, నవీన్ పారుపల్లి లకు నా సహకారం ఎప్పుడు ఉంటుంది. రేవు రిలీజ్ డేట్ పోస్టర్ రిలీజ్ చెయ్యాలని అడిగినప్పుడు ఓదెల 2 కి సంబందించిన పెద్దపల్లి జిల్లా, ఓదెల గ్రామం మల్లిఖార్జున దేవాలయం షూటింగ్ సెట్ కి వారిని ఆహ్వానించి తమన్నా తో ఆగష్టు 9 న రిలీజ్ అవుతున్న రేవు పోస్టర్ లాంచ్ చేయించడం హ్యాపీగా ఉంది. ఈ సినిమా విజయం సాధించాలని టీమ్ అందరికి ఆల్ ద బెస్ట్ చెప్పారు.
ఈ కార్యక్రమంలో రేవు హీరో వంశీ, హేమంత్, ప్రముఖ పారిశ్రామిక వేత్త పారుపల్లి అనీల్, BDL నగేష్ పాల్గొన్నారు.

రేవు చిత్రం ఆర్టిస్టులు: వంశీ రామ్ పెండ్యాల, అజయ్, స్వాతి భీమిరెడ్డి, ఏపూరి హరి, గురు తేజ్, సుమేష్ మాధవన్, హేమంత్ ఉద్భవ్, లీలా వెంకటేష్ కొమ్మూరి, తదితరులు.
సాంకేతిక నిపుణులు: డి ఓ పి – రేవంత్ సాగర్ నేపథ్య సంగీతం- వైశాఖ్ మురళీధరన్ పాట- జాన్ కె జోసెఫ్ ఎడిటర్ – శివ శర్వాని కళ- బాషా సాహిత్యం – ఇమ్రాన్ శాస్త్రి, నిర్మాణ పర్యవేక్షణ జర్నలిస్ట్ ప్రభు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత పర్వతనేని రాంబాబు, నిర్మాతలు డా॥ మురళీ గింజుపల్లి, నవీన్ పారుపల్లి రచయిత దర్శకుడు – హరినాథ్ పులి.

Tfja Team

Recent Posts

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…

4 days ago

శంబాల థ్యాంక్స్ మీట్.. చిత్రయూనిట్‌‌ని అభినందించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు

డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…

4 days ago

కానిస్టేబుల్‌ కనకం2.. సీజన్ 1 కంటే అద్భుతంగా ఉంటుంది. బిగ్గెస్ట్ హిట్ అవుతుంది: ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ వర్ష బొల్లమ్మ

వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్‌ కానిస్టేబుల్‌ కనకం. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వం వహించారు.…

4 days ago

చార్మింగ్ స్టార్ శర్వా, సాక్షి వైద్య ‘నారి నారి నడుమ మురారి’ నుంచి లవ్లీ నెంబర్ ‘భల్లే భల్లే’రిలీజ్

చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…

4 days ago

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్:మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి వ‌సంత్.. లుక్ పోస్ట‌ర్ విడుద‌ల

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’లో మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి…

4 days ago