అత్యంత విజయవంతమైన హారర్ కామెడీ సిరీస్ ‘అరణ్మనై’ నుంచి నాల్గవ చిత్రం అరణ్మనై 4, తెలుగులో బాక్ పేరుతో వస్తోంది. సుందర్ సి దర్శకత్వంతో పాటు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో తమన్నా భాటియా, రాశి ఖన్నా హీరోయిన్స్. మేకర్స్ ఇటీవల అన్ని ప్రధాన పాత్రలు ఫస్ట్ లుక్ పోస్టర్లను విడుదల ద్వారా ప్రచార కార్యక్రమాలను ప్రారంభించారు. ఈరోజు ‘పంచుకో’అనే ప్రోమో సాంగ్ తో వచ్చారు.
హిప్హాప్ తమిళా కొన్ని లైవ్లీ బీట్లతో ఫుట్-ట్యాపింగ్ నంబర్‌ను స్కోర్ చేశారు. సాహితీ ఫన్నీ లిరిక్స్ రాస్తే, రాఘవి హస్కీ వాయిస్ మెస్మరైజ్ చేస్తోంది. తమన్నా, రాశీఖన్నాల గ్లామర్ ఈ పాటను మరింత అందంగా తీర్చిదిద్దింది. వారి గ్రేస్ ఫుల్ మూమెంట్స్, ముఖ్యంగా హిప్ మూమెంట్స్ చూడటానికి ఒక ట్రీట్‌గా వున్నాయి. ట్రెండీ అవుట్ ఫిట్స్ ధరించి, హీరోయిన్లిద్దరూ అదరగొట్టారు. ప్రోమో సాంగ్‌లో సినిమాలోని కొన్ని ఎక్సయిటింగ్ సన్నివేశాలను కూడా చూపించారు.
అవ్నీ సినిమాక్స్ P Ltd పతాకంపై ఖుష్బు సుందర్, ACS అరుణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, శ్రీనివాసులు, ఢిల్లీ గణేష్, కోవై సరళ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ LLP తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనుంది. ఏప్రిల్ 26న ‘బాక్ ‘ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.
ఈ చిత్రానికి కృష్ణమూర్తి డీవోపీగా పని చేస్తుండగా, ఎడిటింగ్‌ను ఫెన్నీ ఆలివర్ పర్యవేక్షిస్తున్నారు. గురురాజ్ ఆర్ట్ డైరెక్టర్.
తారాగణం: సుందర్ సి, తమన్నా భాటియా, రాశి ఖన్నా, వై వెన్నెల కిషోర్, శ్రీనివాసులు, ఢిల్లీ గణేష్, కోవై సరళ
సాంకేతిక సిబ్బంది:
కథ & దర్శకత్వం: సుందర్ సి
నిర్మాతలు: ఖుష్బు సుందర్, ఏసీఎస్ అరుణ్ కుమార్
బ్యానర్: అవ్నీ సినిమాక్స్క్స్ P Ltd.
తెలుగు రిలీజ్: ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ ఎల్ఎల్పి
సంగీతం: హిప్హాప్ తమిళా
సినిమాటోగ్రాఫర్: ఇ కృష్ణమూర్తి అకా కిచ్చ
ఎడిటర్: ఫెన్నీ ఆలివర్
ఆర్ట్: గురురాజ్
కొరియోగ్రఫీ: బృందా మాస్టర్
స్టంట్స్: రాజశేఖర్
పీఆర్వో: వంశీ-శేఖర్
మిస్టిక్ థ్రిల్లర్ ఫ్రాంచైజీలో ప్రేక్షకులను ఆకట్టుకున్న 'పొలిమేర' సిరీస్ నుంచి మూడో చిత్రంగా వస్తున్న 'పొలిమేర 3'పై అంచనాలు పెరుగుతున్నాయి.…
మంచు లక్ష్మిని అర్థం చేసుకున్నామనుకునేలోపే, ఆమె మరో కొత్త ఆశ్చర్యానికి తెరతీస్తారు! ఇటీవల ఆమె సోషల్ మీడియాలో కొన్ని ఆసక్తికరమైన…
పి.ఎస్.జె. ఫిలిమ్స్ అండ్ కో బ్యానర్ మీద ప్రదీప్ కుమార్, గుండబోయిన శ్రీనివాస్ నిర్మాణంలో సురేందర్ చాచా తెరకెక్కించిన చిత్రం…
సుమ చిత్ర ఆర్ట్స్ సమర్పణలో సుమయా రెడ్డి స్వీయ నిర్మాణంలో నటిస్తున్న రెండో ప్రాజెక్ట్‌ని త్వరలోనే ప్రకటించనున్నారు. ‘డియర్ ఉమ’…
‘శంబాల’ బ్లాక్ బస్టర్ తర్వాత ఆది సాయికుమార్ డిఫరెంట్ సబ్జెక్ట్లతో ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలోనే ‘ఈగో రాజా’…
రేసన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపి కృష్ణ జయంతి నిర్మించిన ‘రాయవలస’ చిత్రానికి రాధిక జయంతి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో…