భద్ర ప్రొడక్షన్స్ బ్యానర్ నుంచి రూపొందిన న్యూ ఏజ్ క్రైమ్ థ్రిల్లర్ ‘తగ్గేదే లే’. యువ కథనాాయకుడు నవీన్ చంద్ర లీడ్ రోల్‌లో నటిస్తోన్న ఈ చిత్రాన్ని ‘దండుపాళ్యం’ ఫేమ్ శ్రీనివాస్ రాజు తెరకెక్కిస్తుున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, ఇంట్రెస్టింగ్ టీజర్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మేకర్స్ ఈ సినిమా నుంచి ‘తగ్గేదే లే’ అనే స్పెషల్ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ పాటను మరో యంగ్ హీరో రాజ్ తరుణ్ విడుదల చేసి ఎంటైర్ టీమ్‌కు అభినందనలు తెలిపారు.ఈ మాసివ్ జానపద పాటలో మాస్ బీట్‌కి నైనా గంగూళీ ఆకట్టుకునే డాన్స్ చూసిన ప్రతి ఒక్కరినీ ఓ ట్రాన్స్‌లోకి తీసుకెళుతుంది. ప్రోమోలో అద్భుతమైన డాన్స్ మూమెంట్స్ కనిపిస్తుండగా, లిరికల్ వీడియోలో ఇంకా ఏదో కొత్త ఉంటుందనే ఓ అభిప్రాయాన్ని కలిగిస్తోంది. చరణ్ అర్జున్ సంగీతం అందించిన ఈ పాట విన్నవారందిరకీ నచ్చుతుంది.
మాసివ్ బీట్‌కి నైనా గంగూళీ వేసిన డాన్స్ అందరిని మెప్పిస్తుంది. దీంతో పాట చూసిన వెంటనే అందరికీ కనెక్ట్ అయిపోతుంది. సంగీతం అందించటంతో పాటు చరణ్ అర్జున్ పాటను రాశారు కూడా. రానున్న రోజుల్లో తగ్గేదే లే సాంగ్‌ను అందరినీ కట్టిపడేస్తుందనేంతగా ఉంది. మోహన భోగరాజు, చరణ్ అర్జున్, శరత్ రవి మాసివ్ సాంగ్‌ను పాడారు.దివ్యా పిళ్లై, అనన్య సేన్ గుప్తా హీరోయిన్స్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో నాగబాబు, డానీ కుట్టప్ప, రవి కాలే, మకరంద్ దేశ్ పాండే, అయ్యప్ప పి.శర్మ, నవీన్ చంద్ర, పూజా గాంధీ, రాజా రవీంద్ర, రవి శంకర్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. వెంకట్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి చరణ్ అర్జున్ సంగీతాన్ని అందిస్తుండగా గ్యారీ బి.హెచ్ ఎడిటింగ్ చేస్తున్నారు.త్వరలోనే సినిమాను విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
నటీనటులు:
నవీన్ చంద్ర, దివ్యా పిళ్లై, అనన్య సేన్ గుప్తా, నైనా గంగూలీ, రవి శంకర్, రాజా రవీంద్ర, నాగబాబు, అయ్యప్ప శర్మ, పూజా గాంధీ, మకరంద్ దేశ్ పాండే, రవి కాలే తదితరులు
సాంకేతిక వర్గం:
దర్శకత్వం: శ్రీనివాస్ రాజు
బ్యానర్: భద్ర ప్రొడక్షన్స్
నిర్మాతలు: ప్రేమ్ కుమార్ పాండే, ఎన్. అఖిలేష్ రెడ్డి, పి.వి.సుబ్బా రెడ్డి
సినిమాటోగ్రఫీ: వెంకట్ ప్రసాద్
సంగీతం: చరణ్ అర్జున్
బీజీఎం: చిన్నా
ఎడిటర్: గ్యారీ బి.హెచ్
ఆర్ట్ డైరెక్టర్: కిరణ్ కుమార్ మన్నె
ఫైట్స్ : వెంకట్
పబ్లిసిటీ డిజైనర్: అనిల్, భాను
పి.ఆర్.ఒ: వంశీ కాక
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రాజా రవీందర్
యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…
భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…
విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…
న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…
సంగీత దర్శకుడు, నటుడు, సింగర్ రఘు కుంచె టైటిల్ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…
లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…