ఆగస్టు 18న విడుదలవుతున్న ‘మిస్టర్ ప్రెగ్నెంట్’

‘బిగ్ బాస్’ ఫేమ్ యంగ్ హీరో సయ్యద్ సోహైల్ రియాన్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘మిస్టర్ ప్రెగ్నెంట్’. రూపా కొడవాయుర్ హీరోయిన్‌గా నటిస్తోంది. మైక్ మూవీస్ బ్యానర్‌లో అన్నపరెడ్డి అప్పిరెడ్డి, రవిరెడ్డి సజ్జల నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి రూపొందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ మూవీ ఆగస్టు 18న విడుదలకు సిద్ధమవుతోంది.

హీరో సోహైల్ ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ చిత్రంలో ప్రెగ్నెంట్‌గా కనిపించనున్నాడు. తెలుగు తెరపై ఇదొక కొత్త తరహా ప్రయత్నంగా చెప్పుకోవచ్చు. సినిమా ఔట్ పుట్ విషయంలో చిత్రబృందం సంతృప్తిగా ఉన్నారు. రిలీజ్ కు కూడా ఆగస్టు 18 మంచి డేట్ గా భావిస్తున్నారు. వైవిధ్యమైన సినిమాలకు ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ సక్సెస్ సాధిస్తుందనే అంచనాలు ఏర్పడుతున్నాయి.

నటీనటులు : సయ్యద్ సొహైల్ రియాన్, రూపా కొడువయుర్, సుహాసినీ మణిరత్నం,
రాజా రవీంద్ర, బ్రహ్మాజీ, అలీ, హర్ష తదితరులు

సాంకేతిక నిపుణులు : సినిమాటోగ్రఫీ – నిజార్ షఫీ, సంగీతం – శ్రావణ్ భరద్వాజ్, ఎడిటింగ్ – ప్రవీణ్ పూడి, ఆర్ట్ – గాంధీ నడికుడికర్, బ్యానర్ – మైక్ మూవీస్, పీఆర్వో – జీఎస్కే మీడియా, నిర్మాతలు – అప్పి రెడ్డి, రవిరెడ్డి సజ్జల, రచన-దర్శకత్వం – శ్రీనివాస్ వింజనంపాటి.

Tfja Team

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

10 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

10 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

10 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago