టాలీవుడ్ హీరో నితిన్ ప్రధాన పాత్రలో, దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన స్పోర్ట్స్ యాక్షన్ ఎంటర్టైనర్ సై. ఈ చిత్రం 2004 లో థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయం ను సాధించింది. ఇప్పుడు ఈ చిత్రం రీ రిలీజ్ కి రెడీ అయిపోయింది. మెగా ప్రొడక్షన్స్ వారు న్యూ ఇయర్ కానుకగా జనవరి 1న థియేటర్స్ లో భారిగా రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రం లో జెనీలియా హీరోయిన్ గా నటించింది.
ఈ బ్లాక్ బస్టర్ మూవీకి ఆస్కార్ అవార్డు విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. ‘సై’ చిత్రాన్ని 4కే అల్ట్రా హెచ్‌డీ టెక్నాలజీతో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. లేటెస్ట్ సౌండ్ సిస్టంతో క్వాలిటీ అద్భుతంగా ఉండబోతుంది.
విజయేంద్ర ప్రసాద్ కథ అందించిన ఈ సినిమాకు ఎం రత్నం డైలాగ్స్ అందించారు. ఎ భారతి నిర్మాణంలో రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు మంచి బజ్ ఉంది. ఈ సినిమా కథ మొత్తం రగ్బీ ఆట చుట్టూ, ఒక కాలేజ్ లోని రెండు గ్రూప్ లు, ఒక విలన్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. తమ కాలేజ్ స్థలంను కబ్జా చేసేందుకు ప్రయత్నించే విలన్ తో రగ్బీ ఆటకు హీరో టీం దిగుతుంది. అప్పుడు ఏం జరుగుతుంది అనేది క్లైమాక్స్ లో దర్శకుడు జక్కన్న అద్భుతంగా చూపించాడు. రీ రిలీజ్ లోనూ ‘సై’ కచ్చితంగా హిట్ సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రేక్షకులు, నితిన్ అభిమానులు ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇటీవల నితిన్ ఇష్క్ సినిమా రీ రిలీజ్ అయ్యి మంచి ప్రేక్షక ఆదరణ పొందింది.
నితిన్ హీరోగా వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై రూపొందనున్న యూనిక్ సైఫై ఎంటర్టైనర్.. వైవిధ్యమైన సినిమాలు, పాత్రలతో…
తానా సాహిత్య విభాగం - తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో మరియు అనకాపల్లి సిరివెన్నెల…
కేవలం ఐదు రోజుల్లో రూ.100.2 కోట్ల గ్రాస్ సాధించిన 'అనగనగా ఒక రాజు'నవీన్ పొలిశెట్టి కెరీర్లోనే అతిపెద్ద విజయంయూఎస్లో హ్యాట్రిక్…
వైవిధ్యమైన సినిమాలు, పాత్రలతో బహు భాషా నటుడిగా తనదైన గుర్తింపు సంపాదించుకున్న స్టార్ దుల్కర్ సల్మాన్. కంటెంట్ బేస్డ్ మూవీస్…
ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…
డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…