‘స్వయంభూ’ కోసం 8 కోట్ల బడ్జెట్‌తో 12 రోజుల ఎపిక్ యాక్షన్ ఎపిసోడ్ షూటింగ్

Must Read

కార్తికేయ 2తో దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్న నిఖిల్ మరో క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘స్వయంభూ’తో వస్తున్నారు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో నిఖిల్ 20వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నిఖిల్ లెజెండరీ వారియర్ పాత్రలో కనిపించనున్నారు.

నిఖిల్ తనపాత్ర కోసం ఆయుధాలు, మార్షల్ ఆర్ట్స్ , గుర్రపు స్వారీలో ఇంటెన్స్ ట్రైనింగ్  తీసుకున్నారు. ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్ పతాకంపై భువన్, శ్రీకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అత్యున్నత సాంకేతిక, నిర్మాణ ప్రమాణాలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

ప్రస్తుతం, టీమ్ ప్రముఖ తారాగణంతో ఎపిక్ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తోంది. వియత్నామీస్ ఫైటర్స్‌తో సహా 700 మంది ఆర్టిస్టులపై 12 రోజుల పాటు చిత్రీకరించనున్న ఈ ఎపిసోడ్‌లో నిఖిల్ అద్భుతమైన స్టంట్స్ చేయనున్నారు. రెండు మ్యాసీవ్ సెట్లలో ప్రతిష్ఠాత్మకంగా వార్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారు. ఈ ఒక్క ఎపిసోడ్‌కి మేకర్స్ రూ.8 కోట్లు చేస్తున్నారు. ‘స్వయంభూ’లోని మెయిన్ హైలెట్స్ లో ఈ యాక్షన్ ఎపిసోడ్ ఒకటి. ఈ యాక్షన్ ఎపిసోడ్ బిగ్ స్క్రీన్ పై గొప్ప అనుభూతిని కలిగించనుంది.

వర్కింగ్ స్టిల్‌లో నిఖిల్ మజిల్డ్ ఫిజిక్ తో బీస్ట్ మోడ్ లో ఫైటింగ్ రింగ్‌లోకి దిగుతున్నట్లుగా కనిపించారు. ఈ పాత్ర కోసం పూర్తిగా మేకోవర్‌ అయిన నిఖిల్ ఒక లెజెండరీ యోధుడిగా కనిపిస్తారు. సెటప్, భారీ జనసమూహం ఫైట్ సీక్వెన్స్ గ్రాండియర్ ని సూచిస్తున్నాయి.

ఈ చిత్రంలో సంయుక్త, నభా నటేష్  హీరోయిన్స్ గా నటిస్తున్నారు. KGF,  సలార్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందించగా, M ప్రభాహరన్ ప్రొడక్షన్ డిజైనర్.

తారాగణం: నిఖిల్, సంయుక్త, నభా నటేష్

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: భరత్ కృష్ణమాచారి
నిర్మాతలు: భువన్, శ్రీకర్
బ్యానర్: పిక్సెల్ స్టూడియోస్
సమర్పణ: ఠాగూర్ మధు
సంగీతం: రవి బస్రూర్
ప్రొడక్షన్ డిజైనర్: ఎం ప్రభాహరన్
కో-డైరెక్టర్: విజయ్ కామిశెట్టి
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో

Latest News

Nuvvu Gudhithe lyrical song from Drinker Sai

Dharma and Aishwarya Sharma play the lead roles in Drinker Sai, which carries the tagline Brand of Bad Boys....

More News