రాధా మమతా ప్రెజెంట్స్, ఎస్.కె. ఆర్ట్స్ బ్యానర్స్ పై దుర్మార్గుడు
ఫేమ్ విజయ్ కృష్ణ హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం గణా
. సుకన్య, తేజు హీరోయిన్స్ గా నటించారు. టాలీవుడ్ ప్రముఖ సీనియర్ డైరెక్టర్ శ్రీ ఎస్వీ క్రిష్ణారెడ్డి ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ చేశారు.ఈ సందర్భంగా ఎస్వీ క్రిష్ణా రెడ్డి మాట్లాడుతూ..’నేను పుట్టింది తూర్పుగోదావరి జిల్లా..ఇప్పుడు అక్కడి నుంచే మరో వ్యక్తి అతను పేరు కూడా క్రిష్ణారెడ్డే..కాకపోతే విజయ్ క్రిష్ణా రెడ్డి. విజయ క్రిష్ణా రెడ్డి అనే ఒక వ్యక్తి కృషి తో, పట్టుదలతో, దీక్షతో గణా చిత్రాన్ని రూపొందించారు. విజయ్ క్రిష్ణ హీరోగా నటిస్తూ కథ, స్క్రీన్ ప్లే, ప్లస్ డైరెక్షన్ కూడా చేశారు. ఆయనే ప్రొడ్యూసర్ గా కూడా ఈ సినిమాని తీశారు. అన్నీ ఆయనే చేస్తూ సినిమా తీయడమంటూ మామూలు విషయం కాదు. దీనికి ఎంతో సహకారం ఉండాలి..ఎంతో మంది వ్యక్తులు ఇతనికి సహకరించడం వలన సాధ్యపడుతుంది. సినిమా అంటే మాటలు కాదు కదా..కాబట్టి అందరి సహకారంతో ఇతను ఈ సినిమాని నిర్మించగలిగారు.
అందులో ముఖ్యంగా చెప్పాలంటే ఆదిత్యాశేషారెడ్డిగారు, ఫారిన్ నుండి ఎమ్.యు.ఎస్ రెడ్డిగారు, కాకినాడ కార్పొరేటర్ బాల ప్రసాద్ గారు, కర్రి బుచ్చిరెడ్డిగారు ఇలా అందరూ కలిసి ఒక మంచి సినిమా తియ్యాలనే తపనతో మన ముందుకొచ్చారు. నా చేతుల మీదుగా ఫస్ట్ లుక్ లాంచ్ చేయడం ఆనందంగా ఉంది. తప్పకుండా ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నా“ అన్నారు.హీరో విజయ్ క్రిష్ణ మాట్లాడుతూ..’ దుర్మార్గుడు మూవీతో నన్నుహీరోగా వంశీగారు పరిచయం చేశారు.ప్రతీ వ్యక్తికీ ఒక ఆదర్శం ఉంటుంది. మాకు అన్నగారు ఎస్వీ క్రిష్ణారెడ్డిగారు ఆదర్శం. ‘గణా’ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినందుకు సార్ కి నేనెప్పుడూ రుణపడి ఉంటాను..నా ధన్యవాదాలుతెలుపుకుంటున్నాను..నేను ఇది వరకు దుర్మార్గుడు, గోవిందా భజ గోవింద సినమాల్లో ప్రధాన పాత్రలో చేశాను. పాగల్ వంటి పలు చిత్రాల్లో విలన్ గా కూడా చేశాను. హీరోగా మూడో సినిమా గణా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నేను తొలిసారిగా ఈ గణా చిత్రానికి డైరెక్టర్ గా చేశాను..ఈ సినిమాని నేను ఒక యజ్ఞంలా ప్రారంభించాను.. నా సొంత బ్యానర్ ఎస్.కె.ఆర్ట్స్ లో తొలిసారిగా నిర్మించాను..ఈ సినిమా నిర్మాణంలో సహాయం చేసిన వారందరికీ నా ధన్యవాదాలు..
త్వరలో మా ఎస్.కె ఆర్ట్స్ బేనర్ లో ఈ సినిమా తర్వాత మా డైరెక్షన్ టీం నుండి కొత్త ప్రాజెక్ట్ చేయడానికి సన్నద్ధం అవుతున్నాము’ అని తెలిపారు..కో -డైరెక్టర్ పృథ్వీ మాట్లాడుతూ..’ఈ మూవీకి నేను కో డెరెక్టర్ గా చేశాను. ముందుగా మా గణా మూవీ ఫస్ట్ లుక్ విడుదల చేసిన మన తెలుగు చిత్రసీమ సీనియర్ దర్శకులు ఎస్వీ క్రిష్ణా రెడ్డిగారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. విజయ్ కృష్ణ గారు అన్నీ తానై ఈ సినిమా చేశారు“ అన్నారు.డైరెక్షన్ డిపార్ట్ మెంట్ నుండి శివక్రిష్ణ మాట్లాడుతూ..నాకీ సినిమాలో అవాకశమిచ్చిన హీరో డైరెక్టర్ ప్రొడ్యూసర్ విజయ్ క్రిష్ణగారికి నేను చాలా రుణపడి ఉంటాను. గణా సినిమా ఫుల్ లెంత్ యాక్షన్ ఎంటర్టైన్ ఫిలిం. ఈ చిత్రం ఆద్యంతం బోర్ కొట్టకుండా చాలా స్పీడ్ స్క్రీన్ ప్లేతో పరిగెడుతుంది. సాంగ్స్, ఫైట్స్, కామెడీ ఇలా అంతా నవరసభరితంగా ఉంటుంది
అన్నారు.సినీ దర్శకుడు రామారెడ్డి పసలపూడి మాట్లాడుతూ..’
గణా సినిమా ఒక పెద్ద హీరో తీయాల్సిన సినిమా..ఒక ప్రభాస్ గారు, ఒక మహేష్బా బుగారు లాంటివాళ్లు చేయాల్సిన సినిమా విజయ్ క్రిష్ణ గారు చాలా అద్భుతంగా చేశారు .ప్రేక్షకులు ఈ సినిమా ఆదరిస్తారని కోరుకుంటున్నాను“ అన్నారు.బాక్సాఫీస్ రమేష్ చందు మాట్లాడుతూ..’విజయ్ క్రిష్ణగారి ‘గణా’ సినిమా పోస్టర్ చాలాబాగుందని, సినిమా కూడా ఇంకా బాగుంటుందినీ, త్వరలో రిలీజ్ కాబోతున్న ‘గణా’ సినిమా ఘనవిజయం సాధించాలనిమనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని తెలిపారు.హీరోగా విజయ్ క్రిష్ణ, హీరోయిన్లుగా సుకన్య, తేజు నటించారు. నాగ మహేష్, ప్రభు, ఛత్రపతి ఫేమ్ జగదీష్ , దత్తు విలన్లుగా చేశారు. సీనియర్ నటుడు హేమ సుందర్, జబర్దస్త్ అప్పారావు, దొరబాబులు ముఖ్య పాత్రల్లో నటించారు.కాగా ఈ చిత్రానికి ఎడిటర్ గా నందమూరి హరి-ఎన్టీఆర్, డీఓపి గా సన్ని చేశారు. చిన్నిక్రిష్ణ సంగీతాన్ని అందించారు. స్టంట్స్ శివరాజ్ మాస్టర్..కో డైరెక్టర్ పృథ్వీ.. చీఫ్ అసియేట్ డైరెక్టర్ దేవర శివక్రిష్ణ .. కొరుమిల్లి. లైన్ ప్రొడ్యూసర్స్ గా బాల ప్రసాద్, ఎమ్.యు.ఎస్.రెడ్డి, కర్రి బుచ్చిరెడ్డి, పిఆర్ఓ. చందు రమేష్.