నైజాంలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా అక్టోబర్ 10న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న స్టార్ హీరో సూర్య ప్రెస్టీజియస్ మూవీ ‘కంగువ’

స్టార్ హీరో సూర్య నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘కంగువ’ అక్టోబర్ 10న దసరా పండుగ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ సినిమాను నైజాం ఏరియాలో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేయబోతున్నారు. ఇటీవల పలు సూపర్ హిట్ చిత్రాలను మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. ప్రెస్టీజియస్ మువీ ‘కంగువ’ను నైజాం ఏరియాలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ పంపిణీ చేస్తుండటంతో మరింత ఎగ్జైట్ మెంట్ ఏర్పడుతోంది.

‘కంగువ’ చిత్రాన్ని భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ గా దర్శకుడు శివ రూపొందిస్తున్నారు. దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘కంగువ’ సినిమాను హ్యూజ్ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు.

‘కంగువ’ నుంచి ఇప్పటిదాకా రిలీజ్ చేసిన సిజిల్ టీజర్, పోస్టర్స్ సినిమా మీద క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్నాయి. పీరియాడిక్ యాక్షన్ జానర్ లో ఇప్పటిదాకా తెరపైకి రాని ఒక కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల్ని ఆకట్టుకోబోతోందీ సినిమా. పది భాషల్లో తెరకెక్కుతున్న ‘కంగువ’ త్రీడీలోనూ ప్రేక్షకుల ముందుకు రానుంది. పలు అంతర్జాతీయ భాషల్లోనూ ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ నుంచి వస్తున్న మరో బిగ్గెస్ట్ మూవీగా ‘కంగువ’ సినిమాపై అటు ట్రేడ్ వర్గాల్లో, ఇటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి.

నటీనటులు – సూర్య, దిశా పటాని, యోగి బాబు, బాబీ డియోల్ తదితరులు

టెక్నికల్ టీమ్
ఎడిటర్ – నిశాద్ యూసుఫ్
సినిమాటోగ్రఫీ – వెట్రి పళనిస్వామి
యాక్షన్ – సుప్రీమ్ సుందర్
డైలాగ్స్ – మదన్ కార్కే
కథ – శివ, ఆది నారాయణ
పాటలు – వివేక్, మదన్ కార్కే
కాస్ట్యూమ్ డిజైనర్ – అను వర్థన్, దష్ట పిల్లై
కాస్ట్యూమ్స్ – రాజన్
కొరియోగ్రఫీ – శోభి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – ఏ జే రాజా
కో ప్రొడ్యూసర్ – నేహా జ్ఞానవేల్ రాజా
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
ప్రొడ్యూసర్స్ – కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్
దర్శకత్వం – శివ

Tfja Team

Recent Posts

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

4 hours ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

12 hours ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

1 day ago

“అంతా రాములోరు చూస్కుంటారు” సినిమా నుంచి బ్యూటిఫుల్, టాలెంటెడ్ హీరోయిన్ అనస్వర రాజన్ బర్త్ డే పోస్టర్ రిలీజ్

యంగ్ ప్రామిసింగ్ హీరో సంగీత్ శోభన్ నటిస్తున్న కొత్త సినిమా "అంతా రాములోరు చూస్కుంటారు". ఈ చిత్రంలో అనస్వర రాజన్…

1 day ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ సినిమాను కుటుంబ ప్రేక్షకులు కూడా చూడొచ్చు.. ‘కడలి’ పాత్ర ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది: కథానాయిక వైష్ణవి చైతన్య

బ్లాక్ బస్టర్ 'బేబీ' జోడీ ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘ఎపిక్…

2 days ago

తెలుగు చిత్ర నిర్మాతల మండలి ఎన్నికల్లో వైస్ ప్రెసిడెంట్ గా మోహన్ వడ్లపట్ల ఘన విజయం*

▪️ ఉపాధ్యక్ష పదవికి నలుగురు పోటీ పడగా మోహన్ వడ్లపట్లకు అత్యధిక మెజార్టీ ▪️ ‘మన ప్యానెల్’ ప్రభంజనం హైదరాబాద్:…

2 days ago