దయచేసి అందరూ హెల్మెట్ ధరించండి.. జాగ్రత్తగా డ్రైవింగ్ చేయండి.. ది ఫాస్ట్ & క్యూరియస్ – ఆటో ఎక్స్పో 2025 ఈవెంట్‌లో సుప్రిమ్ హీరో సాయి దుర్గ తేజ్

సుప్రిమ్ హీరో సాయి దుర్గ తేజ్ తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ది ఫాస్ట్ & క్యూరియస్ – ఆటో ఎక్స్పో 2025 లో పాల్గొన్నారు. ఈ ఈవెంట్‌లో అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. సవాళ్లు ఎదురైతే మధ్యలోనే చేస్తున్న పనిని వదిలేయొద్దని, పట్టువదలకుండా ప్రయత్నిస్తూనే ఉండాలని సాయి దుర్గ తేజ్ అన్నారు. ఇంకా ఆయన ఈ కార్యక్రమంలో ఏం మాట్లాడరంటే..

‘నేను నా ప్రొఫైల్ పట్టుకుని ఎన్నో ఆఫీస్‌లకు తిరిగాను. నా ఫోటోల్ని పల్లీలు, బఠానీలు తినడానికి వాడే వారు. అలా ఆఫీస్‌ల చుట్టూ తిరుగుతున్న టైంలో ఓ సారి మంచు మనోజ్ గారి ఆఫీస్‌లో వైవీఎస్ చౌదరీ గారు చూశారు. అలా ‘రేయ్’ చిత్రం ప్రారంభమైంది. కానీ ఆ మూవీ షూటింగ్ టైంలో చాలా ఆర్థిక సమస్యలు వచ్చాయి. అయినా సరే పట్టువదలకుండా ప్రయత్నించాను. 2012లో ఓ సినిమా చేస్తున్న టైంలోనే ఓ ప్రముఖ నటులు చనిపోయారు. మళ్లీ 2013లో జగపతి బాబు గారితో రీ షూట్ చేశాం. పొలిటికల్ రీజన్స్ వల్ల ఆ సినిమా కూడా ఆలస్యమైంది. అలా ఎన్ని సమస్యలు వచ్చినా కూడా నా కలల్ని మాత్రం వదిలి పెట్టలేదు.

నాకు పవన్ కళ్యాణ్ గారు ఓ గురువులాంటి వారు.. చిన్నప్పటి నుంచి నన్ను గైడ్ చేస్తూనే ఉన్నారు.. ప్రతీ విషయంలో నన్ను ఎంకరేజ్ చేస్తుంటారు.. యాక్టింగ్ ట్రైనింగ్, జిమ్నాస్టిక్, డ్యాన్స్, కిక్ బాక్సింగ్ ఇలా అన్నింట్లోనూ నన్ను గైడ్ చేశారు. కాలేజ్‌లో ఉండే ఫేవరేట్ టీచర్‌లా నాకు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ సపోర్ట్ చేస్తుంటారు.

నేను ప్రతీ సిట్యువేషన్‌ను లైటర్ వేలోనే తీసుకుంటాను. ఏదీ కూడా సీరియస్‌గా తీసుకోను. ఎంత బ్యాడ్ జరిగినా కూడా నవ్వుతూ ఆ సిట్యువేషన్‌ను దాటేస్తుంటాను. నేను హాస్పిటల్ ఉన్న తరువాత బయటకు వచ్చాను. అందరూ అడుగుతూ ఉంటే.. కోమాలో ఉన్నాను అని చెప్పలేదు.. హాస్పిటల్‌కు అలా చిల్ అవ్వడానికి వెళ్లాను అని చెప్పాను. అందరూ హెల్మెట్ ధరించండి. వేగంగా వెళ్లకండి. జాగ్రత్తగా డ్రైవింగ్ చేయండి. యాక్సిడెంట్ తరువాత నాకు చాలా సమస్యలు వచ్చాయి. మాటలు కూడా సరిగ్గా వచ్చేవి కావు. నేను ఎన్నో పుస్తకాలు చదివే వాడిని.. ఎంతో వ్యాయామం చేసేవాడిని.

నాకు ‘రిపబ్లిక్’ చాలా ఇష్టం. ఆ క్లైమాక్స్ కూడా నాకు చాలా ఇష్టం. అలాంటి కథలు మళ్లీ వస్తే నేను చేస్తాను. సోషల్ మీడియా అకౌంట్లకు ఆధార్‌ని లింక్ చేయడం మన బాధ్యత అని నేను అనుకుంటాను. చిరంజీవి గారితో ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ లాంటి స్టోరీని చేయాలనే కోరిక ఉంది. నా గ్యారేజ్‌లో ఉన్న రాయల్ ఎన్ ఫీల్డ్, మహేంద్ర థార్ అంటే నాకు చాలా ఇష్టం. 1968 షెల్బీ జీటీ 500 మస్టంగ్ మోడల్ కారు అంటే మరింత ఇష్టం. అది నాకు డ్రీమ్ కారు లాంటిది. కచ్చితంగా ఎప్పటికైనా సరే ఆ కారుని కొంటాను.

Tfja Team

Recent Posts

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

4 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

4 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

7 days ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago

ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సాన చేతుల మీదుగా ఆహా ఓటీటీ మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ “పోచమ్మ” గ్లింప్స్ రిలీజ్

లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…

1 week ago