తలైవర్173 షూటింగ్ త్వరలో ప్రారంభం- పొంగల్ 2027 కి థియేటర్లలో రిలీజ్

Must Read

సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్ RKFI, సిబి చక్రవర్తి, అనిరుధ్ రవిచందర్ #తలైవర్173 షూటింగ్ త్వరలో ప్రారంభం- పొంగల్ 2027 కి థియేటర్లలో రిలీజ్

రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ #తలైవర్173 మాగ్నమ్ ఓపస్ కు దర్శకుడిని అనౌన్స్ చేసింది. సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్ కాంబినేషన్ లో వచ్చే ఈ చిత్రానికి సిబి చక్రవర్తి దర్శకత్వం వహిస్తారు. ఇది  నెక్స్ట్ లెవల్ సినిమాటిక్ గ్రాండియర్‌ గా వుండబోతోంది.

రజనీకాంత్ హీరోగా కమల్ హాసన్, ఆర్ మహేంద్రన్ నిర్మాణంలో  #తలైవర్173 రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ లెగసీ ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోనుంది. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రం మాస్ అప్పీల్, ఎమోషన్, హై క్యాలిటీ మేకింగ్ తో ప్రేక్షకులని అలరించబోతోంది.

ఈ సినిమా చిత్రీకరణ త్వరలో ప్రారంభమవుతుంది. త్వరలోనే తారాగణం, టెక్నికల్ టీం గురించి మరిన్ని వివరాలను రివిల్ చేయనున్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులకు స్పెషల్ ట్రీట్ గా #తలైవర్173, 2027 పొంగల్ సందర్భంగా థియేటర్లలో విడుదల కానుంది. సూపర్ స్టార్  పవర్, ఎంటర్టైన్మెంట్, అద్భుతమైన విజువల్స్‌తో ఈ చిత్రం పర్ఫెక్ట్ సినిమాటిక్ ఎక్స్ అందించనుంది.

Latest News

అంగరంగ వైభవంగా ‘భావ రస నాట్యోత్సవం – సీజన్ 1’

'మదాలస - స్పేస్ ఫర్ డివైన్ ఆర్ట్' ఆధ్వర్యంలో 'భావ రస నాట్యోత్సవం - సీజన్ 1' అంగరంగ వైభవంగా జరిగింది. జనవరి 4న, ఆదివారం...

More News