సూపర్‌స్టార్ రజినీకాంత్ 170వ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. జై భీమ్ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు టి.జె.జ్ఞానవేల్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. నిర్మాత సుభాస్కరన్ పుట్టినరోజు సందర్భంగా తలైవర్ 170వ సినిమా అనౌన్స్‌మెంట్ చేశారు. ఈ మేరకు వారు ‘‘ఈరోజు మా చైర్మన్ సుభాస్కరన్ పుట్టినరోజు సందర్భంగా సూపర్‌స్టార్ రజినీకాంత్‌గారి తలైవర్ 170వ సినిమాను మా బ్యానర్‌లో రూపొందించబోతున్నట్లు ప్రకటించటం ఆనందంగా ఉంది.
టి.జె.జ్ఞానవేల్ ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నారు. రాక్‌స్టార్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని అందించనున్నారు. జి.కె.ఎం. తమిళ్ కుమరన్‌గారి నేతృత్వంలో త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభిస్తాం. అలాగే 2024లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం. ‘‘తలైవర్‌గారితో లైకా ప్రొడక్షన్స్ సంస్థకు ఉన్న అనుబంధం అందరికీ తెలిసిందే. ఆయనతో కలిసి ఎన్నో విజయవంతమైన చిత్రాలను రూపొందించాం. ఆయనతో ఉన్న అనుబంధం ఇలా కొనసాగటాన్ని ఎంతో గౌరవంగా భావిస్తున్నాం. ఫ్యాన్స్, ప్రేక్షకులు సంతోషపడేలా ఎన్నో గొప్పగా ఈ సినిమాను రూపొందించటానికి అందరి ఆశీర్వాదాలు మాకు ఇవ్వండి’’ అంటూ నిర్మాణ సంస్థ ప్రకటించింది.
సినిమాలో హీరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే తెలియజేస్తామని మేకర్స్ ఈ సందర్భంగా తెలియజేశారు.
ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…
డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…
వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించారు.…
చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…
మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ 'మన శంకర వర ప్రసాద్ గారు' తో…
రాకింగ్ స్టార్ యష్ సెన్సేషనల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’లో మెల్లిసా పాత్రలో రుక్మిణి…