సుకుమార్‌ పెద్ద ఫ్యాన్‌ శివనాగేశ్వరరావుగారికి

Must Read

ప్రణవచంద్ర, మాళవిక సతీషన్,మాస్టర్ చక్రి ..అజయ్‌ఘోష్, బిత్తిరి సత్తి ప్రణవి సాధనాల టార్జాన్ జెమిని సురేష్ ముఖ్యపాత్రల్లో.కోట శ్రీనివాసరావు తనికెళ్ళ భరణి బెనర్జీ అతిధి పాత్రలలో నటించిన చిత్రం ‘‘దోచేవారెవురా’’. ఐక్యూ క్రియేషన్స్‌ పతాకంపై బొడ్డు కోటేశ్వరరావు నిర్మించిన ఈ చిత్రంలోని ‘‘సుక్కు,సుక్కు ….’’ సాంగ్‌ను దర్శకుడు సుకుమార్‌ విడుదల చేశారు. సిరాశ్రీ సాహిత్యం అందించారు. సుకుమార్‌ మాట్లాడుతూ–‘‘ ఒకసారి దర్శకుడు అయిన తర్వాత ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తూండాలి అనుకుంటారు. అందుకే శివనగేశ్వరరావుగారు వన్స్‌మోర్‌ అని ఒక యూట్యూబ్‌ చానల్‌ పెట్టారు. అందులో ఆయన అనుభవాలను ఒక్క అబద్దం కూడా లేకుండా చాలా సిన్సియర్‌గా మాట్లాడతారు. అజయ్‌ఘోష్‌ చాలా మంచి ఆర్టిస్ట్‌. సినిమా పరిశ్రమకు ఆయన లేటుగా పరిచయమయ్యారేమో అనిపిస్తుంది నాకు. నేను విడుదల చేసిన రెండోపాటలో సుక్కు, సుక్కు అనే సౌండ్‌ నాకు బాగా నచ్చింది.

నా పేరుతో వచ్చిన ఈ పాటలో 58ఏళ్ల అజయ్‌ఘోష్‌తో డాన్స్‌ చేయించాలి అనే ఆలోచన వచ్చిన శివ నాగేశ్వరావుగారికి హ్యాట్సాఫ్‌. 58 ఏళ్ళ శంకర్ మాష్టర్ అద్భుతంగా ఈపాటకి కొరియగ్రఫీ చేసారు ..ఒన్స్ మోర్ ఛానల్ లో శివనాగేశ్వరరావు గారి వీడియోలు చూసిన బొడ్డు కోటేశ్వరరావు గారు శివ నాగేశ్వరరావు గారిని దర్సకునిగా ఈ సినిమా కి ఎంపిక చేసుకున్నారంటే అది ఒక అద్భుతం అనుకుంటున్నాను ..ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి అని టీమందరిని అభినందిస్తున్నా’’ అన్నారు. శివనాగేశ్వర రావు మాట్లాడుతూ–‘‘ సుకుమార్‌ గారికి లవ్‌యూ చెప్తున్నాను. ఎందుకంటే నేను ఇద్దర్ని అడిగాను సుకుమార్‌తో సాంగ్‌ లాంచ్‌ చేయించుకోవాలి అని. చంద్రబోస్‌ ఫోన్‌ నెంబర్‌ ఇస్తే ఒక మెసేజ్‌ పెట్టాను నేను శివ నాగేశ్వరరావు ని ..నా పాట ఒకటి లాంచ్ చెయ్యగలరా అని ..పదినిమిషాల్లో రిప్లై మెసేజ్‌ వచ్చింది. నేను రేపు హైదరాబాద్‌ వస్తాను, తర్వాత ఎప్పుడైనా ఓకే అని అన్నారు. అజయ్‌ఘోష్‌ ‘‘రంగస్థలం’’, ‘‘పుష్ప’’ సినిమాల ద్వారానే పూర్తిస్థాయి నటునిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన ముఖ్యపాత్రల్లో నటించిన ఈ సినిమాతో మరో మెట్టెక్కుతాడని అనుకుంటున్నా’’ అన్నారు.
నటీనటులు..
ప్రణవచంద్ర, మళవిక సతీషన్, అజయ్‌ఘోష్, బిత్తిరి సత్తి, మాస్టర్‌ చక్రి తదితరులు
టెక్నీషియన్స్‌..కెమెరా ఆర్లి గణేష్ ..మ్యూజిక్ రోహిత్ వర్ధన్ ..సింగర్స్ మనో .సునైన .
బ్యానర్‌– ఐక్యూ క్రియేషన్స్‌
రచన–దర్శకత్వం. కె.శివనాగేశ్వరరావు
లైన్ ప్రొడ్యూసర్: శామ్ సన్
నిర్మాత– బొడ్డు కోటేశ్వరరావు.
పి.ఆర్‌.ఓ– లక్ష్మీనివాస్

Latest News

రవితేజ ప్రతిష్టాత్మక 75వ చిత్రానికి ‘మాస్ జాతర’ టైటిల్ ఖరారు

తనదైన కామెడీ టైమింగ్, మాస్ యాటిట్యూడ్, విలక్షణ డైలాగ్ డెలివరీతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు మాస్ మహారాజా రవితేజ. స్వయంకృషితో స్టార్ గా...

More News