సుహాస్, శ్రీధర్ రెడ్డి, ఫ్యాన్ మేడ్ ఫిలిమ్స్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ టైటిల్ ‘కేబుల్ రెడ్డి’- గ్రాండ్ గా ప్రారంభం
‘రైటర్ పద్మభూషణ్’ తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న హీరో సుహాస్, అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ కోసం నూతన దర్శకుడు శ్రీధర్ రెడ్డి తో చేతులు కలిపారు. ఫ్యాన్ మేడ్ ఫిలిమ్స్ బ్యానర్ పై బాలు వల్లు, ఫణి ఆచార్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘కేబుల్ రెడ్డి’ అనే ఆసక్తికరమైన టైటిల్ పెట్టారు. షాలిని కొండేపూడి ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్నారు.
ఈ చిత్రాన్ని ఈ రోజు పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ చేశారు. శ్రీధర్ రెడ్డి(దర్శకుడు) కెమెరా స్విచాన్ చేయగా దర్శకుడు శైలేష్ కొలను క్లాప్ కొట్టి స్క్రిప్ట్ ని మేకర్స్ కి అందించారు.
ఈ సందర్భంగా హీరో సుహాస్ మాట్లాడుతూ.. దర్శకుడు శ్రీధర్ మంచి స్నేహతుడు. తనకి ఇది తొలి చిత్రం. రెండు రోజుల్లో షూటింగ్ స్టార్ట్ అవుతుంది. అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ మూవీ ఇది. చాలా ఎక్సయిటింగా వుంది.” అన్నారు
శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. ఇది నా మొదటి సినిమా. చాలా ఆసక్తికరమైన కథ రాసుకున్నాను. అంతే ఆసక్తికరంగా, యంగేజింగా షూట్ చేయడానికి సన్నాహాలు చేశాం. ఒక టౌన్ లో జరిగే కథ ఇది. క్లీన్ ఎంటర్ టైనర్ గా వుంటుంది”అన్నారు
షాలిని కొండేపూడి మాట్లాడుతూ.. చాలామంచి టీంతో ఈ సినిమా చేస్తున్నాం. చాలా ఎక్సయిటింగ్ గా వుంది. దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు” అన్నారు
బాలు వల్లు మాట్లాడుతూ .. ఇది మా మొదటి సినిమా. చాలా మంచి టీంతో పని చేస్తున్నాం. బౌండెడ్ స్క్రిప్ట్ తో షూట్ కి వెళ్తున్నాం. మొదటి షెడ్యుల్ 20 రోజుల్లో పూర్తి చేస్తున్నాం”అన్నారు.
ఈ చిత్రానికి మహి రెడ్డి పండుగల డీవోపీ గా పని చేస్తున్నారు. స్మరణ్ సాయి సంగీతం అందిస్తుండగా క్రాంతి ప్రియం ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు.
నటీనటులు : సుహాస్, షాలిని కొండేపూడి
సాంకేతిక విభాగం :
దర్శకత్వం : శ్రీధర్ రెడ్డి
నిర్మాతలు: బాలు వల్లు, ఫణి ఆచార్య
సినిమాటోగ్రాఫర్: మహి రెడ్డి పండుగల
సంగీతం: స్మరణ్ సాయి
ఆర్ట్ డైరెక్టర్: క్రాంతి ప్రియం
పీఆర్వో : వంశీ – శేఖర్
న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…
యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…
భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…
విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…
న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…
సంగీత దర్శకుడు, నటుడు, సింగర్ రఘు కుంచె టైటిల్ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…