సుహాస్, కార్తిక్ రత్నం, రుహాని శర్మల న్యూ ఏజ్ కామెడీ డ్రామా శ్రీరంగనీతులు టైటిల్ పోస్టర్ విడుదల.సుహాస్, కార్తిక్ రత్నం, రుహాని శర్మ ప్రధాన పాత్రలలో నటిస్తోన్న చిత్రం శ్రీరంగనీతులు. రాధావి ఎంటర్టైన్‌మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా వెంకటేశ్వరరావు బల్మూరి నిర్మిస్తున్నారు. న్యూ ఏజ్ కామెడీ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం ద్వారా ప్రవీణ్ కుమార్ వీఎస్ఎస్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ పూర్తిచేసుకుని శరవేగంగా నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు టైటిల్ పోస్టర్ విడుదల చేసింది చిత్ర యూనిట్.
ఈ టైటిల్ పోస్టర్‌ని పరిశీలిస్తే…మైధానంలో ఏర్పాటు చేసిన ఒక ఫ్లెక్సీ ముందు ముగ్గురు యువకులు కూర్చుని ఉండడం గమనించవచ్చు. టైటిల్ క్యాచీగా ఉండడంతో పాటు టైటిల్ పోస్టర్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. అతి త్వరలో ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయనున్నారు చిత్ర యూనిట్.అర్జున్ రెడ్డి ఫేమ్ హర్ష వర్థన్ రామేశ్వర్, సేవ్ ది టైగర్స్ ఫేమ్ అజయ్ అర్సాడ సంగీత దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి టిజో టామి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. విరాజ్ అశ్విన్, తనికెళ్ల భరణి, గీత భాస్కర్, శ్రీనివాస్ అవసరాల కీలక పాత్రలలో కనిపించనునున్నారు.
నటీనటులు: సుహాస్, కార్తిక్ రత్నం, రుహాని శర్మ, విరాజ్ అశ్విన్, తనికెళ్ల భరణి, గీత భాస్కర్, శ్రీనివాస్ అవసరాల, దేవీ ప్రసాద్, జీవన్ రెడ్డి, సంజయ్ స్వరూప్,సీవిఎల్ నరసింహా రావు తదితరులు..
సాంకేతిక వర్గం:
కథ,మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ప్రవీణ్ కుమార్ వీఎస్ఎస్,
నిర్మాణ సంస్థ: రాధావి ఎంటర్‌టైన్‌మెంట్స్,
నిర్మాత: వెంకటేశ్వరరావు బల్మూరి,
సంగీతం: హర్ష వర్థన్ రామేశ్వర్, అజయ్ అర్సాడ,
సినిమాటోగ్రఫి: టిజో టామి,
పీఆర్ఓ: దుద్ధి శ్రీను – సిద్ధు.
అర్జున్ కోలా దర్శకత్వంలో దినేష్ తేజ్, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్, ఎస్.కె.ప్రొడక్షన్స్…
స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అందరూ థియేటర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి…
ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…
ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…
ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…