సుధీర్ బాబు, ‘హరోం హర’ జూన్ 14న విడుదల

సుధీర్ బాబు మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘హరోం హర’ ప్రమోషన్స్ జోరందుకున్నాయి. ఆకట్టుకునే పాటలు, ఆసక్తిని రేకెత్తించే టీజర్, ప్రోమోలకు అద్భుతమైన స్పందనతో, సినిమాపై హ్యుజ్ హైప్ క్రియేట్  చేశాయి. సుధీర్ బాబు పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన మురుగన్ పాట, సునీల్‌తో అతని స్నేహాన్ని చూపించడం కూడా విశేషంగా ఆకట్టుకుంది. తాజాగా మేకర్స్ కొత్త విడుదల తేదీని అనౌన్స్ చేశారు.

ముందుగా మే 31న రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా జూన్ 14కి షిఫ్ట్ చేశారు. చేతిలో తుపాకీతో ఉన్న సుధీర్ బాబు బ్రాండ్ న్యూ పవర్ ఫుల్ పోస్టర్ ద్వారా ఈ వార్తను మేకర్స్ అధికారికంగా అనౌన్స్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జూన్ 14న నోటెడ్ సినిమా ఏదీ రానందున, హరోం హర సోలోగా విడుదల కానుంది.

ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సెహరి ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు. మాళవిక శర్మ కథానాయికగా నటిస్తుండగా ఎస్‌ఎస్‌సి (శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్) బ్యానర్‌పై సుమంత్ జి నాయుడు నిర్మించిన ఈ చిత్రం చిత్తూరు జిల్లా కుప్పం నేపథ్యంలో 1989లో జరిగిన పీరియాడికల్ ఫిల్మ్.

చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తుండగా, అరవింద్ విశ్వనాథన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఎడిటింగ్‌ రవితేజ గిరిజాల.

తారాగణం: సుధీర్ బాబు, మాళవిక శర్మ, సునీల్

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం – జ్ఞానసాగర్ ద్వారక
నిర్మాత – సుమంత్ జి నాయుడు
సంగీతం – చైతన్ భరద్వాజ్
డీవోపీ – అరవింద్ విశ్వనాథన్
ఎడిటర్ – రవితేజ గిరిజాల
బ్యానర్ – శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్
పీఆర్వో – వంశీ శేఖర్

Tfja Team

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

7 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

7 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

8 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago