స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ ‘తెలుసు కదా’ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి

Must Read

స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ తన అప్ కమింగ్ మూవీ ‘తెలుసు కదా’ లో కంప్లీట్ న్యూ అండ్ స్టైలిష్ బెస్ట్ అవతార్‌లో కనిపించనున్నారు. ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన ఈ మూవీతో డైరెక్టర్ గా డెబ్యు చేస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్‌ హైదరాబాద్‌లో పూర్తయింది.  నెక్స్ట్ లెన్తీ షెడ్యూల్ కోసం సినిమా యూనిట్  సిద్ధమవుతోంది.

ఈ సినిమా పనులు శరవేగంగాజరుగుతున్నాయి, ఇప్పటికే 50% షూటింగ్ పూర్తయింది. అవుట్‌పుట్‌తో టీమ్‌ హ్యాపీగా ఉంది. నెల రోజుల పాటు జరిగిన ఈ షెడ్యూల్‌లో సిద్దు జొన్నలగడ్డ, రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి, వైవా హర్షలపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సినిమాలోని మొదటి పాటను సిద్దు జొన్నలగడ్డ, రాశీఖన్నాలపై చిత్రీకరించారు. వర్కింగ్ స్టిల్స్ సెట్స్‌లో ప్లజెంట్ ఎట్మాస్స్పియర్ ని ప్రజెంట్ చేస్తున్నాయి.

హై బడ్జెట్‌తో, టాప్ ప్రొడక్షన్ వాల్యూస్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జ్ఞాన శేఖర్ బాబా డీవోపీ కాగా, నేషనల్ అవార్డ్ విన్నింగ్ ప్రొఫెషనల్ నవీన్ నూలి ఎడిటింగ్ హ్యాండిల్ చేస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్, శీతల్ శర్మ కాస్ట్యూమ్ డిజైనర్.

నటీనటులు: సిద్దు జొన్నలగడ్డ, రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి, వైవా హర్ష
రచన, దర్శకత్వం: నీరజ కోన
నిర్మాత: టీజీ విశ్వ ప్రసాద్
బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
సంగీతం: థమన్ ఎస్
డీవోపీ: జ్ఞాన శేఖర్ బాబా
ఎడిటర్: నవీన్ నూలి
సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా
కాస్ట్యూమ్ డిజైనర్: శీతల్ శర్మ
పీఆర్వో: వంశీ-శేఖర్

Latest News

తెలంగాణ ప్రభుత్వం అనుమతితో శ్రీతేజ్‌ను పరామర్శించిన ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌

సంధ్య థియేటర్‌ తొక్కిసలాటలో గాయపడి కిమ్స్‌ హస్పటల్‌లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ ఈ రోజు (బుధవారం) పరామర్శించారు. శ్రీతేజ్‌ యోగా...

More News