శ్రీసింహా కోడూరి, కావ్యా కళ్యాణ్ రామ్ ఎంటర్‌టైనర్ ‘ఉస్తాద్’ షూటింగ్ పూర్తి ఆగస్ట్ 12న భారీ విడుదల
కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు చేస్తూ తనదైన గుర్తింపు సంపాదించుకుంటున్న యంగ్ హీరో శ్రీసింహా కోడూరి. ఆస్కార్ విన్నింగ్ డైరెక్టర్ ఎం.ఎం.కీరవాణి కొడుకు అయినప్పటినీ తనదైన రూట్‌ను ఏర్పరుచుకుంటూ ముందుకు వెళుతున్నారు శ్రీసింహ. మత్తు వదలరా, భాగ్ సాలే వంటి వైవిధ్యమైన చిత్రాలతో ఆకట్టుకున్న ఈయన ఆగస్ట్ 12న ‘ఉస్తాద్’ చిత్రంతో మెప్పించటానికి సిద్ధమవుతున్నారు.
‘ఉస్తాద్’ మూవీ అనౌన్స్‌మెంట్ రోజు నుంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఈ మూవీలో కావ్యా కళ్యాణ్ రామ్ హీరోయిన్. వారాహి చలనచిత్రం, క్రిషి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై ‘ఉస్తాద్’ చిత్రాన్ని ఫణిదీప్ దర్శకత్వంలో రజినీ కొర్రపాటి, రాకేష్ రెడ్డి గడ్డం, హిమాంక్ రెడ్డి దువ్వూరు నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ఇప్పుడు దర్శక నిర్మాతలు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసే పనిలో ఉన్నారు.
రీసెంట్‌గా విడుదలైన టీజర్.. ‘రోజు..’ అనే సాంగ్‌కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో, పరిమితమైన బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ఆడియెన్స్‌ను అలరిస్తుందని మేకర్స్ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఇందులో శ్రీసింహ మూడు డిఫరెంట్ షేడ్స్‌లో కనిపించబోతున్నారు. డిఫరెంట్ మూవీస్, పరిమిత బడ్జెట్‌లతో రూపొందుతోన్న సినిమాలకు అద్భుతమైన స్పందన వస్తున్న నేపథ్యంలో ఉస్తాద్ నిర్మాతలు అదే నమ్మకంతో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో గౌతమ్ వాసుదేవ్ మీనన్, అను హాసన్, రవీంద్ర విజయ్, వెంకటేష్ మహ, రవి శివ తేజ, సాయికిరణ్ ఏడిద కీలక పాత్రల్లో నటించారు. అకీవా. బి సంగీతాన్ని అందిస్తున్నారు.
నటీనటులు:
శ్రీసింహా కోడూరి, కావ్యా కళ్యాణ్ రామ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, అను హాసన్, రవీంద్ర విజయ్, వెంకటేష్ మహ. రవి శివ తేజ, సాయి కిరణ ఏడిద తదితరులు
సాంకేతిక వర్గం:
సాయి కొర్రపాటి ప్రొడక్షన్
బ్యానర్స్: వారాహి చలనచిత్రం, క్రిషి ఎంటర్‌టైన్‌మెంట్స్
నిర్మాతలు: రజినీ కొర్రపాటి, రాకేష్ రెడ్డి గడ్డం, హిమాంక్ రెడ్డి దువ్వూరు
రచన, దర్శకత్వం: ఫణిదీప్
సినిమాటోగ్రఫీ: పవన్ కుమార్ పప్పుల
మ్యూజిక్: అకీవా.బి
ఎడిటర్: కార్తీక్ కట్స్
ప్రొడక్షన్ డిజైనర్: అరవింద్ ములె
సౌండ్ డిజైన్: అశ్విన్ రాజశేఖర్
కాస్ట్యూమ్స్: ప్రియాంక వీరబోయిన
వి.ఎఫ్.ఎక్స్ సూపర్‌వైజర్: సునీల్ రాజు చింత
లిరిక్స్: అనంత శ్రీరాం, రెహమాన్, లక్ష్మీ ప్రియాంక
లైన్ ప్రొడ్యూసర్స్: ప్రజనయ్ కొనిగరి, రాజేష్ గడ్డం
పి.ఆర్.ఒ: వంశీ కాకా
మిస్టిక్ థ్రిల్లర్ ఫ్రాంచైజీలో ప్రేక్షకులను ఆకట్టుకున్న 'పొలిమేర' సిరీస్ నుంచి మూడో చిత్రంగా వస్తున్న 'పొలిమేర 3'పై అంచనాలు పెరుగుతున్నాయి.…
మంచు లక్ష్మిని అర్థం చేసుకున్నామనుకునేలోపే, ఆమె మరో కొత్త ఆశ్చర్యానికి తెరతీస్తారు! ఇటీవల ఆమె సోషల్ మీడియాలో కొన్ని ఆసక్తికరమైన…
పి.ఎస్.జె. ఫిలిమ్స్ అండ్ కో బ్యానర్ మీద ప్రదీప్ కుమార్, గుండబోయిన శ్రీనివాస్ నిర్మాణంలో సురేందర్ చాచా తెరకెక్కించిన చిత్రం…
సుమ చిత్ర ఆర్ట్స్ సమర్పణలో సుమయా రెడ్డి స్వీయ నిర్మాణంలో నటిస్తున్న రెండో ప్రాజెక్ట్‌ని త్వరలోనే ప్రకటించనున్నారు. ‘డియర్ ఉమ’…
‘శంబాల’ బ్లాక్ బస్టర్ తర్వాత ఆది సాయికుమార్ డిఫరెంట్ సబ్జెక్ట్‌లతో ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలోనే ‘ఈగో రాజా’…
రేసన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపి కృష్ణ జయంతి నిర్మించిన ‘రాయవలస’ చిత్రానికి రాధిక జయంతి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో…