సుహాస్, కార్తిక్ రత్నం, రుహాని శర్మ ప్రధాన పాత్రలలో నటిస్తోన్న చిత్రం శ్రీరంగనీతులు. ఇటీవల విడుదలైన టైటిల్ పోస్టర్‌కి మంచి రెస్పాన్స్ రాగా ఈ రోజు (జూన్ 29)తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.
సుహాస్, కార్తిక్ రత్నం, రుహాని శర్మలతో కూడిన ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్ సినిమాపై మరింత ఇంట్రస్ట్‌ని క్రియేట్ చేసింది. ఈ చిత్రాన్ని రాధావి ఎంటర్టైన్‌మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా వెంకటేశ్వరరావు బల్మూరి నిర్మిస్తున్నారు. న్యూ ఏజ్ కామెడీ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం ద్వారా ప్రవీణ్ కుమార్ వీఎస్ఎస్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ పూర్తిచేసుకుని శరవేగంగా నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. అతి త్వరలో ఈ చిత్రాన్ని థియేటర్స్‌లో రిలీజ్ చేయనున్నారు మేకర్స్.
అర్జున్ రెడ్డి ఫేమ్ హర్ష వర్థన్ రామేశ్వర్, సేవ్ ది టైగర్స్ ఫేమ్ అజయ్ అర్సాడ సంగీత దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి టిజో టామి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. విరాజ్ అశ్విన్, తనికెళ్ల భరణి, గీత భాస్కర్, శ్రీనివాస్ అవసరాల కీలక పాత్రలలో కనిపించనునున్నారు.
నటీనటులు: సుహాస్, కార్తిక్ రత్నం, రుహాని శర్మ, విరాజ్ అశ్విన్, తనికెళ్ల భరణి, గీత భాస్కర్, శ్రీనివాస్ అవసరాల, దేవీ ప్రసాద్, జీవన్ రెడ్డి, సంజయ్ స్వరూప్,సీవిఎల్ నరసింహా రావు తదితరులు..
సాంకేతిక వర్గం:
కథ,మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ప్రవీణ్ కుమార్ వీఎస్ఎస్,
నిర్మాణ సంస్థ: రాధావి ఎంటర్‌టైన్‌మెంట్స్,
నిర్మాత: వెంకటేశ్వరరావు బల్మూరి,
సంగీతం: హర్ష వర్థన్ రామేశ్వర్, అజయ్ అర్సాడ,
సినిమాటోగ్రఫి: టిజో టామి,
పీఆర్ఓ: దుద్ధి శ్రీను – సిద్ధు.
ధనుష్, కృతి సనన్ సూపర్బ్ కెమిస్ట్రీతో ఆకట్టుకుంటోన్న ‘అమరకావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైలర్.. హిందీతో పాటు తమిళ, తెలుగులోనూ…
బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమతి రాగిణి గుణ సమర్పణలో గుణ…
ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…
సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…
అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…
కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…