శ్రీవిష్ణు కథానాయకుడిగా వివాహ భోజనంబు ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందుతున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘సామజవరగమన’. అనిల్ సుంకర సగర్వంగా సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ తో కలిసి హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో శ్రీ విష్ణు కు జోడిగా రెబా మోనికా జాన్ నటిస్తోంది.
ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మే 18న వేసవి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా సామజవరగమన చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. అనౌన్స్‌మెంట్ పోస్టర్ చాలా ప్లజంట్ గా వుంది ఉంది. శ్రీవిష్ణు కుటుంబంలోని అందరు ఆడవాళ్లతో కలిసి కనిపించారు.
సినిమా ఫస్ట్ గ్లింప్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సామజవరగమన ఒక అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఉండబోతోందని భరోసా ఇచ్చింది.
భాను బోగవరపు కథను అందించగా, నందు సవిరిగాన సంభాషణలు రాశారు. దర్శకుడు రామ్ అబ్బరాజు స్వయంగా ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే రాశారు. ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణుల బృందం ఈ చిత్రానికి పని చేస్తున్నారు. గోపి సుందర్ సంగీతం అందిస్తుండగా, రామ్‌రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఛోటా కె ప్రసాద్ ఎడిటర్, బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్.
తారాగణం: శ్రీ విష్ణు, రెబా మోనికా జాన్, నరేష్, సుదర్శన్, శ్రీకాంత్ అయ్యంగార్, వెన్నెల కిషోర్, రఘు బాబు, రాజీవ్ కనకాల, దేవి ప్రసాద్, ప్రియ తదితరులు.
సాంకేతిక విభాగం:
అనిల్ సుంకర సమర్పణ
స్క్రీన్ ప్లే & దర్శకత్వం – రామ్ అబ్బరాజు
నిర్మాత – రాజేష్ దండా
సహ నిర్మాత – బాలాజీ గుత్తా
బ్యానర్లు- ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్
కథ – భాను బోగవరపు
డైలాగ్స్ – నందు సవిరిగాన
సంగీత దర్శకుడు – గోపీ సుందర్
సినిమాటోగ్రాఫర్ – రాంరెడ్డి
ఎడిటర్ – ఛోటా కె ప్రసాద్
ఆర్ట్ డైరెక్టర్ –బ్రహ్మ కడలి
కాస్ట్యూమ్ డిజైనర్ – లక్ష్మి కిల్లారి
పీఆర్వో – వంశీ శేఖర్
ధనుష్, కృతి సనన్ సూపర్బ్ కెమిస్ట్రీతో ఆకట్టుకుంటోన్న ‘అమరకావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైలర్.. హిందీతో పాటు తమిళ, తెలుగులోనూ…
బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమతి రాగిణి గుణ సమర్పణలో గుణ…
ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…
సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…
అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…
కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…