టాలీవుడ్

నా కెరీర్ హయ్యస్ట్ ఓపెనింగ్స్ వచ్చిన చిత్రం ‘స్పై’ : నిఖిల్

నా కెరీర్ హయ్యస్ట్ ఓపెనింగ్స్ వచ్చిన చిత్రం ‘స్పై’. ఇంత పెద్ద విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు: హీరో నిఖిల్



యంగ్ హీరో నిఖిల్ కథానాయకుడిగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన నేషనల్ థ్రిల్లర్ ‘స్పై’. ప్రముఖ ఎడిటర్ గ్యారీ బిహెచ్ దర్శకుడిగా పరిచయమైన ఈ చిత్రాన్ని చ‌ర‌ణ్ తేజ్ ఉప్పలపాటి సీఈఓగా ఈడీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పై కె రాజ శేఖ‌ర్ రెడ్డి భారీ స్థాయిలో నిర్మించారు.

నిఖిల్ సరసన ఐశ్వర్య మీనన్ కథానాయిక గా నటించింది. నిన్న (జూన్ 29) విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకొని, నిఖిల్ కెరీర్ లో హైయెస్ట్ ఓపెనింగ్స్(11.7cr) తో నేషన్‌ వైడ్ బ్లాక్‌ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ని నిర్వహించింది.

ప్రెస్ మీట్ లో హీరో నిఖిల్ మాట్లాడుతూ..‘స్పై’ సినిమాకి వరల్డ్ వైడ్ యునానిమస్ గా అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. నా కెరీర్ లోనే హయ్యస్ట్ ఓపెనింగ్స్ వచ్చాయి. సినిమాని ఇంతగా ఆదరించిన ప్రేక్షకులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.  నా కెరీర్ ని మరో మెట్టు పై కి ఎక్కిస్తూ ఓపెనింగ్స్ కలెక్షన్స్ ఇచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ముందుముందు మరిన్ని మంచి చిత్రాలు ఇస్తానని ప్రామిస్ చేస్తున్నాను.

దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. దర్శకుడు గ్యారీ సినిమాని చాలా  కొత్తగా రిచ్ గా ప్రజెంట్ చేశారు. సినిమా చూసిన ప్రేక్షకులంతా మంచి సినిమా అందించామని అభినందిస్తున్నారు. ఫ్యామిలీ అంతా వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. శ్రీచరణ్ నేపధ్య సంగీతం గురించి ప్రత్యేకంగా చెబుతున్నారు. స్పై చాలా రిచ్  ఫిల్మ్. ఫన్, ఎంటర్ టైన్ మెంట్, దేశభక్తి అన్నీ వున్నాయి. ఈ వీకెండ్ కి మంచి సినిమా చుశామనే అనుభూతి ఇస్తుంది. ఇంతమంచి విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు మరోసారి కృతజ్ఞతలు’’ తెలిపారు

చ‌ర‌ణ్ తేజ్ మాట్లాడుతూ.. పబ్లిక్ టాక్ అద్భుతంగా వుంది. ప్రేక్షకులు చాలా ఇష్టపడుతున్నారు. కామెడీ, యాక్షన్ అన్నీ ఎలిమెంట్స్ చక్కగా వర్క్ అవుట్ అయ్యాయి. నిఖిల్, గ్యారీ, ఐశ్వర్య అందరికీ థాంక్స్. ఇంత బిగ్ ఓపెనింగ్ రావడం ఆనందంగా వుంది. ఆల్రెడీ యాభై శాతం రికవరీ అయిపోయారు. డిస్ట్రిబ్యుటర్స్ కాల్ చేసి చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సక్సెస్ ఇచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’ తెలిపారు

 గ్యారీ బిహెచ్ మాట్లాడుతూ.. ప్రేక్షకుల నుంచి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. ఇంత మంచి విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. సినిమాని ఇంకా బాగా ఆదరిస్తారని కోరుకుంటున్నాను’’మ అన్నారు.

ఐశ్వర్య మీనన్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో భాగం కావడం గర్వంగా వుంది. ప్రేక్షకుల రియాక్షన్ చూసినప్పుడు చాలా ఆనందంగా వుంది.  తెలుగులో  చేసిన మొదటి సినిమా ఇంతపెద్ద విజయం సాధించడం ఆనందంగా వుంది’’ అన్నారు. ఈ ప్రెస్ మీట్ లో చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

Tfja Team

Recent Posts

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైల‌ర్‌.. హిందీతో పాటు త‌మిళ‌, తెలుగులోనూ…

10 hours ago

ఫిబ్రవరి 6, 2026న‌ ‘యుఫోరియా’ గ్రాండ్ రిలీజ్‌

బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమ‌తి రాగిణి గుణ స‌మ‌ర్ప‌ణ‌లో గుణ…

4 days ago

కోయంబత్తూరులోని ఈ యోగ కేంద్రం వద్దనున్న లింగ భైరవి సన్నిధిలో, పవిత్రమైన ‘భూత శుద్ధి వివాహం’ చేసుకున్న సమంత ప్రభు, రాజ్ నిడిమోరు

ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…

4 days ago

తల్లి చేతుల మీదుగా అవార్డులను అందుకున్న మధుర క్షణాల్ని గుర్తు చేసుకున్న సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్

సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…

3 weeks ago

“రాజు వెడ్స్ రాంబాయి” మీ హృదయాన్ని తాకే అందమైన ప్రేమ కథ – ట్రైలర్ లాంఛ్ లో హీరో అడివి శేష్

అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…

3 weeks ago

‘దేవగుడి’ రియల్ స్టోరి.. కచ్చితంగా పెద్ద సక్సెస్ అవుతుంది – టీజర్ లాంచ్ వేడుకలో హీరో శ్రీకాంత్

కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…

3 weeks ago