జూన్ 7 న విడుదలకు సిద్ధం అయిన “స్పీడ్220”.

విజయలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఫణి కొండమూరి సమర్పణలో తెరకెక్కుతున్న యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ చిత్రం స్పీడ్220. హర్ష బెజగం కథ-కథనం-దర్శకత్వం అందించిన ఈ చిత్రంలో హేమంత్, గణేష్ ఇద్దరు హీరోలుగా నటిస్తున్నారు. వీరి సరసన ప్రీతి సుందర్, జాహ్నవి శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు, సెన్సార్ పనులు ముగించుకొని జూన్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ కమిటెడ్ గా ఉన్నారు. స్పీడ్220 చిత్రం నుంచి ప్రతీ ప్రొమోషనల్ వీడియో, పోస్టర్లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ ప్రేక్షకులను ఊపేసింది. బెజవాడలో బాలా కుమారి అనే స్పెషల్ సాంగ్ ప్రముఖ సింగర్ గీతామాధురి ఆలపించగా స్నేహ గుప్తా డ్యాన్స్ కుమ్మెసింది. ప్రస్తుతం మంచి వ్యూస్‌తో సోషల్ మీడియాలో దూసుకుపోతుంది. ఈ తరుణంలో మరో సాంగ్ సైతం విడుదల చేశారు మేకర్స్. మొదటిది నరాలు జివ్వుమనే ఐటమ్ బాంబ్ అయితే సెకండ్ ది గుండెను పిండేసి ఎమోషనల్ మెలోడి సాంద్. హే పిల్లా అంటూ సాగే ఈ పాట భావోద్వేగాలతో నిండి హృదయాన్ని బరువెక్కించేలా చేస్తుంది. సురేష్ గంగుల లిరిక్స్ అందించగా, శ్రీదీప్ ప్రాణం పెట్టి ఆలపించారు. శేఖర్ మోపూరి సంగీత సారథ్యంలో రూపొందిన ఈ పాట యూట్యూలో దూసుకుపోతుంది.

ఇప్పటికే సెన్సార్ సభ్యులు స్పీడ్ 220 చిత్రానకి రివ్యూ ఇచ్చారు. అన్ని భావోద్వేగాలు సమపాలల్లో ఉన్నాయని, మంచి సినిమా అవుతుందని పేర్కొన్నారు. సినిమా కచ్చితంగా సెన్సెషన్ క్రియేట్ చేస్తుందని మేకర్స్ సైతం నమ్మకంగా ఉన్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను రంజింప చేసేలా ఈ చిత్రం ఉంటుందని, నిర్మాణంలో ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా గ్రాండ్ గా తెరకెక్కించినట్లు మేకర్స్ వెల్లడించారు. యూత్‌ కు కనెక్ట్ అయ్యే టైటిల్ స్పీడ్220 సబ్జెక్ట్ ఎలా ఉండబోతుంది. పాటలతో మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ మూవీ కథ ఎంటో తెలియాలంటే జూన్ 7 వరకు వేచి చూడాల్సిందే.

చిత్రం: స్పీడ్220
నిర్మాత: ఫణి కొండమూరి, మందపల్లి బ్రదర్స్ & దుర్గ
హీరోలు: హేమంత్, గణేష్
హీరోయిన్స్: ప్రీతీ సుందర్, జాహ్నవి శర్మ
డ్యాన్సర్: స్నేహ గుప్తా
కొరియోగ్రాఫర్ : అషేర్ మామిడి
మ్యూజిక్ డైరెక్టర్: శేఖర్ మోపూరి
సింగర్ : గీతమాధురి
డీఓపీ : క్రాంతి కుమార్ కొణిదెన
పీఆర్ఓ : హరీష్, దినేష్
కథ-స్క్రీన్ ప్లే- డైరెక్షన్ : హర్ష బెజగం

Tfja Team

Share
Published by
Tfja Team

Recent Posts

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

7 hours ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

1 day ago

“అంతా రాములోరు చూస్కుంటారు” సినిమా నుంచి బ్యూటిఫుల్, టాలెంటెడ్ హీరోయిన్ అనస్వర రాజన్ బర్త్ డే పోస్టర్ రిలీజ్

యంగ్ ప్రామిసింగ్ హీరో సంగీత్ శోభన్ నటిస్తున్న కొత్త సినిమా "అంతా రాములోరు చూస్కుంటారు". ఈ చిత్రంలో అనస్వర రాజన్…

1 day ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ సినిమాను కుటుంబ ప్రేక్షకులు కూడా చూడొచ్చు.. ‘కడలి’ పాత్ర ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది: కథానాయిక వైష్ణవి చైతన్య

బ్లాక్ బస్టర్ 'బేబీ' జోడీ ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘ఎపిక్…

1 day ago

తెలుగు చిత్ర నిర్మాతల మండలి ఎన్నికల్లో వైస్ ప్రెసిడెంట్ గా మోహన్ వడ్లపట్ల ఘన విజయం*

▪️ ఉపాధ్యక్ష పదవికి నలుగురు పోటీ పడగా మోహన్ వడ్లపట్లకు అత్యధిక మెజార్టీ ▪️ ‘మన ప్యానెల్’ ప్రభంజనం హైదరాబాద్:…

1 day ago

’90s’ వెబ్ సిరీస్ బాటలోనే ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ కూడా ప్రేక్షకుల హృదయాలను దోచుకుంటుంది: చిత్ర దర్శకుడు ఆదిత్య హాసన్

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’. '90s'…

2 days ago