లెజెండరీ అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగ చైతన్య, అఖిల్ క్లాసిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మనం’. మే23, 2014న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద సంచలన విజయం సాదించడంతో పాటు తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యుత్తమ క్లాసిక్ మూవీ గా నిలిచింది.
‘మనం’ విడుదలై పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ క్లాసిక్ ఎంటర్‌టైనర్ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. మే23న రెండు తెలుగు రాష్ట్రాలలో ‘మనం’ స్పెషల్ షోలని ప్రదర్శించబోతున్నారు. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ లో ఇప్పటికే బుకింగ్స్ ఓపెన్ చేశారు.
ఈ మ్యాజికల్ అప్డేట్ ని అన్నపూర్ణ స్టూడియోస్ సోషల్ మీడియాలో పంచుకుంటూ #మనం తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన చిత్రం. థియేటర్లలో మరోసారి సెలబ్రేట్ చేసుకుందాం’ అని ట్వీట్ చేశారు.
అన్నపూర్ణ స్టూడియోస్ ప్రతిష్టాత్మక నిర్మాణంలో, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అక్కినేని మూడు తరాల హీరోలు కలసి తెరపై కనిపించడం ప్రేక్షకుల మనసులో చేరగని ముద్ర వేసింది.
ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ అందించిన ఆల్బమ్ ఎవర్ గ్రీన్ చార్ట్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు పదేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా అభిమానులు, ప్రేక్షకులని మరోసారి మెస్మరైజ్ చేయబోతోంది.
ధనుష్, కృతి సనన్ సూపర్బ్ కెమిస్ట్రీతో ఆకట్టుకుంటోన్న ‘అమరకావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైలర్.. హిందీతో పాటు తమిళ, తెలుగులోనూ…
బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమతి రాగిణి గుణ సమర్పణలో గుణ…
ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…
సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…
అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…
కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…