సరిపోదా శనివారం నుంచి ఎస్‌జె సూర్య స్పెషల్ బర్త్‌డే గ్లింప్స్ రిలీజ్

నేచురల్ స్టార్ నాని ‘సరిపోదా శనివారం’ ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. పోస్టర్లు, గ్లింప్సెస్, సాంగ్స్, సినిమా నుండి వచ్చే ప్రతి అప్‌డేట్ హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేస్తున్నాయి. ఈ రోజు మేకర్స్ SJ సూర్య పుట్టినరోజు సందర్భంగా – నాట్ ఏ టీజర్ అనే న్యూ వీడియోని రిలీజ్ చేశారు.  

చెడు బలపడినప్పుడు దాన్ని అంతచేసే పవర్ పడుతుందనే ఇంట్రస్టింగ్ వాయిస్ ఓవర్ తో వీడియో ప్రారంభమైయింది. బలహీనులపై తన ఆధిపత్యాన్ని చూపించే రూత్ లెస్ కాప్ గా SJ సూర్య పరిచయమయ్యారు. ఈ కథ నుంచి శ్రీకృష్ణుడు (నాని) తన సత్యభామ (ప్రియాంక మోహన్)తో కలిసి నరకాసురుడు (SJ సూర్య)ను ఎదుర్కోవడానికి వస్తున్నట్లుగా ప్రజెంట్ చేయడం క్యూరియాసిటీని పెంచింది.

టేకాఫ్ నుండి చివరి వరకు వీడియో గ్రిప్పింగ్ గా వుంది. ఇద్దరు పవర్ ఫుల్ వ్యక్తుల మధ్య ఎపిక్ బాటిల్ గా వుండబోతోందని ప్రామిస్ చేస్తోంది. SJ సూర్య భయం పుట్టించేలా  కనిపించగా, నాని తన టెర్రిఫిక్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో అద్భుతంగా ఉన్నారు. ఇద్దరూ తమ పవర్-ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్ లతో అదరగొట్టారు.  

వివేక్ ఆత్రేయ స్టొరీ టెల్లింగ్ లో యూనిక్ స్టయిల్ వున్న జీనియస్. నాట్ ఎ టీజర్ వీడియోలో తన నరేటివ్ స్టయిల్ ఆకట్టుకుంది. మురళి జి సినిమాటోగ్రఫీ అత్యద్భుతంగా ఉంది, విజువల్స్ గ్రాండియర్ గా ఉన్నాయి,  జేక్స్ బిజోయ్ తన ఇంటెన్స్ బ్యాగ్ గ్రౌండ్ స్కోర్‌తో విజువల్స్ ని మరింత ఎలివేట్ చేశారు. DVV ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాణ విలువలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయి.

నాట్ ఎ టీజర్  వీడియో మాస్ మ్యాడ్ నెస్ ఎక్స్ పీరియన్స్ ని ఇస్తుంది. ఆగస్ట్ 29న థియేటర్లలో స్టార్ట్ అయ్యే ట్రూ గేమ్‌ను చూసేందుకు మరింత ఎక్సయిట్మెంట్ ని పెంచింది.

ఈ పాన్ ఇండియా అడ్రినలిన్‌ ఫిల్డ్ యాక్షన్-అడ్వెంచర్‌కు కార్తీక శ్రీనివాస్ ఎడిటర్. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.

నటీనటులు: నాని, ప్రియాంక అరుల్ మోహన్, SJ సూర్య, సాయి కుమార్

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: వివేక్ ఆత్రేయ
నిర్మాతలు: డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి
బ్యానర్: డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్
సంగీతం: జేక్స్ బిజోయ్
డీవోపీ: మురళి జి
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్
ఫైట్స్: రామ్-లక్ష్మణ్
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: వాల్స్ అండ్ ట్రెండ్స్

Tfja Team

Recent Posts

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

4 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

4 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

7 days ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago

ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సాన చేతుల మీదుగా ఆహా ఓటీటీ మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ “పోచమ్మ” గ్లింప్స్ రిలీజ్

లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…

1 week ago