‘జనతా హోటల్ ” సినిమాకి ఆరేళ్లు

Must Read

తెలుగులో జనతా హోటల్ రిలీజ్ అయి ఆరేళ్లు పూర్తయింది. విభిన్నమైన సినిమాలతో ఎప్పుడూ వైవిధ్యాన్ని కనబరిచే నిర్మాత సురేష్ కొండేటి. ప్రేమిస్తే, షాపింగ్‌మాల్, పిజ్జా, జర్నీ, నాన్న లాంటి మంచి సినిమాలను ప్రేక్షకులకు అందించిన సురేష్ కొండేటి అదే కోవలో మరో గొప్ప సినిమాను ఆడియన్స్ ముందుకు తెచ్చారు. ‘మహానటి’ ఫేం దుల్కర్ సల్మాన్, క్యూట్ హీరోయిన్ నిత్యామీనన్ జంటగా మలయాళంలో సూపర్ హిట్‌గా నిలిచిన ఉస్తాద్ హెటల్‌ను తెలుగులో ‘జనతా హోటల్’ పేరుతో సెప్టెంబర్ 14 2018న విడుదల చేశారు.

మలయాళంలో ఉస్తాద్ హోటల్ పేరుతో విడుదలైన ఈ సినిమాను తెలుగులో జనతా హోటల్‌ పేరుతో ఎస్.కె. పిక్చర్స్ బ్యానర్ పై సురేష్ కొండేటి నిర్మాతగా రిలీజ్ చేశారు. దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్‌ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు అన్వర్ రషీద్ దర్శకత్వం వహించాడు . డాక్టర్లు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు కావాలనుకునే ఈ యువతరంలో.. తాను చెఫ్‌గా మారలనుకునే హీరో కథతో ఎంతో ఆసక్తికరంగా సాగే సినిమా ఇది. విదేశాలకు వెళ్లి మరీ హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సు చేసొచ్చిన ఓ చెఫ్ చుట్టూ నడిచే కథతో ప్రేక్షకులను అలరించింది ఈ సినిమా. ఈ సినిమా రిలీజ్ అయి ఆరేళ్ళు పూర్తయ్యాయి.

Latest News

రీ రికార్డింగ్ జరుపుకుంటున్న* 1000 కోట్లు*

మోహన్ లాల్ హీరోగా శ్రీకర్ మూవీ మేకర్స్ పతాకంపై కాసుల రామకృష్ణ (శ్రీధర్), శ్రీకరగుప్త, సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "1000 కోట్లు. గతంలో "100 కోట్లు"వంటి...

More News