“చాల్లే చాల్లే” పాటను విడుదల చేసిన శివ నిర్వాణ

లెజెండరీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై యష్ రాజ్, నాంది సినిమా ఫెమ్ నవిమి గాయక్ జంటగా రామకృష్ణార్జున్ దర్శకత్వంలో జింకా శ్రీనివాసులు నిర్మించిన చిత్రం “అభిరామ్” ఈ చిత్రం నుండి విడుదల చేసిన ‘సైదులో సైదులా ఆ నంగనాచి పిల్ల లిరికల్ సాంగ్ కు ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.ఈ చిత్రం లోని పాటలు టిప్స్ ఆడియో ద్వారా విడుదల అవుతున్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్దమైన సందర్బంగా ఈ చిత్రంలోని “చాల్లే చాల్లే” లిరికల్ సాంగ్ ను దర్శకుడు శివ నిర్వాణ విడుదల చేశారు.అనంతరం దర్శకుడు శివ నిర్వాణ మాట్లాడుతూ..లెజెండరీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో  నిర్మించిన “అభిరామ్” సినిమాలోని “చాల్లే చాల్లే” అనే బ్యూటిఫుల్ మెలోడీ సాంగ్ ను చూడడం జరిగింది. ఈ పాట వింటుంటే ఇంకా వినాలనిపించేలా చాలా క్యాచీగా ఉంది. మీనాక్షి భుజంగ్ మ్యూజిక్ కంపోజిషన్ లో తనే ఈ పాటను పాడడం విశేషం.ఈ పాటలో విజువల్స్ చాలా బాగున్నాయి. హీరో, హీరోయిన్ లు చాలా బాగా చేశారు.కాబట్టి సినిమాలో కూడా బాగా చేసుంటారు అనుకుంటున్నాను.చంద్ర కిరణ్ కొరియోగ్రఫీ బాగుంది.ఈ సినిమాకు పనిచేసిన “అభిరామ్” సినిమా టెక్నిషియన్స్ అందరికీ అల్ ద  బెస్ట్.అలాగే దర్శక, నిర్మాతలకు ఈ సినిమా ద్వారా మంచి పేరు వస్తుందని ఆశిస్తున్నాను అన్నారు.

చిత్ర నిర్మాత జింకా శ్రీనివాసులు మాట్లాడుతూ..మీనాక్షి భుజంగ్ అద్భుతమైన సంగీతం అందిస్తూ పాడిన “చాల్లే చాల్లే” అనే బ్యూటిఫుల్ మెలోడీ సాంగ్ ను విడుదల చేసిన  దర్శకులు శివ నిర్వాణ గారికి ధన్యవాదాలు.ఈ సినిమాలో హీరో, హీరోయిన్స్ పోటీపడి  నటించారు..జగదీశ్ కొమరి సినిమాటోగ్రఫీగా, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.టిప్స్ ఆడియో మ్యూజిక్ ద్వారా విడుదలైన పాటలు మ్యూజిక్ లవర్స్ అందరినీ కచ్చితంగా అలరిస్తాయి. లవ్ యాక్షన్ కామెడీ సెంటిమెంట్ కలయికతో ఒక విన్నూత కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని త్వరలో మీ ముందుకు తీసుకు వస్తాం.అందరూ మా చిత్రాన్ని ఆదరించి ఆశీర్వదించాలని  మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.చిత్ర దర్శకుడు రామకృష్ణార్జున్ మాట్లాడుతూ.. మా అభిరామ్ సినిమాలోని “చాల్లే చాల్లే” అనే బ్యూటిఫుల్ మెలోడీ సాంగ్ ను విడుదల చేసిన  దర్శకులు శివ నిర్వాణ గారికి ధన్యవాదాలు.నటే, నటులు, టెక్నిషియన్స్  అందరూ సపోర్ట్ చేయడంతో  సినిమా బాగా వచ్చింది.త్వరలో వస్తున్న ఈ సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.

నటీ నటులు

యష్ రాజ్, నవిమి గాయక్, శివబాలాజీ, నవీన్ రెడ్డి, బాహుబలి ప్రభాకర్, రఘు బాబు, కాదంబరి కిరణ్, అన్నపూర్ణమ్మ, తులసి,వై విజయ, సుమన్ శెట్టి, విజయ రంగనాథ్,గౌతమ్ రాజు, జబర్దస్త్ శేషు, కిషోర్ దాస్, తదితరులు

సాంకేతిక నిపుణులు

బ్యానర్ : లెజెండరీ ఎంటర్టైన్మెంట్

నిర్మాత : జింకా శ్రీనివాసులు

దర్శకత్వం : రామకృష్ణార్జున్,

డి. ఓ. పి: కొమరి జగదీష్,

ఎడిటర్ : మార్తాండ్ కె వెంకటేష్,

సంగీతం మీనాక్షి భుజంగ్ ,

పాటలు : సాగర్ నారాయణ్ ఎం.

స్టంట్స్ : వించన్ అంజి,

డాన్స్ మాస్టర్ : చంద్ర కిరణ్,

ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ : ఉల్లగంటి ప్రసాద్

పి. ఆర్ ఓ : మధు వి. ఆర్

Tfja Team

Recent Posts

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

6 days ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

7 days ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

7 days ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

7 days ago

సెప్టెంబర్ 4న విడుదలకు సిద్దంగా ‘మా రాముడు అందరివాడు’

ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…

7 days ago

పాన్ ఇండియా సినిమాలు తీస్తున్న డైరెక్టర్లందరికీ ఇది ఒక పాఠం — ఇరుముడి చూసి నేర్చుకోవాల్సిన సమయం వచ్చింది!

ఇరుముడి సినిమా కలెక్షన్స్ చూస్తుంటే అసలు నమ్మశక్యం కాని విధంగా ఉన్నాయి. సినిమా చరిత్రలో ఇలాంటి కలెక్షన్స్, ఇలాంటి జనసందోహం…

1 week ago