సినిమాలో వేశం ఇస్తామని యువతిని మానభంగం చేసిన – సిద్దార్థ్ వర్మ

Must Read

తెలుగు సినిమా పరిశ్రమలో సహాయ దర్శకుడు గా పనిచేస్తున్నానని సిద్ధార్థ వర్మ అనే వ్యక్తి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న ఒక యువతిని సినిమాల్లో వేషాలు ఇప్పిస్తానని చెప్పి మోసం చేసి ఆమెను మానభంగం చేయడం జరిగిందని, సదరు యువతి పోలీస్ వారికి ఫిర్యాదు ఇచ్చిందని వార్త పత్రికలు, టీవీలు ద్వారా తెలుసుకొని తెలుగు ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ వారు, తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ వారిని సిద్దార్థ వర్మ గురించి విచారించగా సదరు అసోసియేషన్ వారు సిద్దార్థ వర్మ తమ సభ్యుడు కాదని, అతను ఏ దర్శకుడు దగ్గర సహాయకుడిగా పనిచేయడం లేదని తెలిపినారు. ముఖ్యంగా సినిమాల్లో వేషాలు వేయాలని తాపత్రయ పడే యువతులు ఇటువంటి వారిని దగ్గరకు రానివ్వకూడదని, ఇలాంటి వ్యక్తుల చర్యలకు అమ్మాయిలు అనాలోచితంగా ఉండవద్దని మనవి చేయుచున్నాము.


ఇటువంటి సంఘటనలను ఆడపిల్లలు ఒక హెచ్చరికగా భావించాలని కోరుకుంటూ, ఫిలిం ఇండస్ట్రీ లో పనిచేయాలన్న ఉత్సాహంతో వస్తున్న వారు మగవారైనా, ఆడవారైనా ఇటువంటి మోసపూరితమైన సంఘటనలకు బలి కాకుండా వారు చెప్పే మాటలను నమ్మకుండా, ఇటువంటి విషయాల మీద ఆచి తూచి తెలుసుకుని పెద్దల సలహాతో అడుగు వేయాలని తెలుగు ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ విజ్ఞప్తి చేయుచున్నది.

Latest News

ప్రముఖ నటి పావలా శ్యామల అంత్యక్రియల బాధ్యత తీసుకున్న ‘మా’ అసోసియేషన్ మరియు కరాటే కళ్యాణి

హైదరాబాద్‌లోని ఉస్మానియా హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పావలా శ్యామల గారు తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆమె భౌతికకాయాన్ని ఆసుపత్రి సిబ్బంది మార్చురీలో...

More News