యువ కథానాయకుడు రామ్ కార్తీక్, కశ్వి జంటగా రూపొందుతోన్న చిత్రం ‘వీక్షణం’. పద్మనాభ సినీ ఆర్ట్స్ బ్యానర్‌పై మనోజ్ పల్లేటి దర్శకత్వంలో పి.పద్మనాభ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రీసెంట్‌గా విడుదలై ఈ సినిమా ఫస్ట్ లుక్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ నుంచి ‘ఎన్నెన్నో…’ అనే లిరికల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ప్రేయసి ప్రేమలో మునిగిన ప్రేమికుడి మనసు ఎలా ఉంటుందనే విషయాన్ని చెప్పేలా ఈ సాంగ్ ఉంది.
సమర్థ్ గొల్లపూడి సంగీత సారథ్యం వహిస్తోన్న ఈ చిత్రంలోని ఈ పాటను రెహ్మాన్ రాయగా.. ప్రముఖ సింగర్ సిద్ శ్రీరామ్ ఆలపించారు. యూత్‌కు కనెక్ట్ అయ్యేలా సాంగ్ కలర్‌ఫుల్‌గా ఉంది. ప్రస్తుతం సినిమా చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ఫస్ట్ కాపీ కూడా సిద్ధమైంది. సాయిరామ్ ఉదయ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. త్వరలోనే సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్‌ను అందిస్తామని మేకర్స్ తెలియజేశారు.
నటీనటులు:
రామ్ కార్తీక్, కశ్వి తదితరులు
సాంకేతిక వర్గం:
బ్యానర్ : పద్మనాభ సినీ ఆర్ట్స్, నిర్మాత : P. పద్మనాభ రెడ్డి, దర్శకుడు : మనోజ్ పల్లేటి, సినిమాటోగ్రఫీ : సాయి రామ్ ఉదయ్ (D.F Tech), సంగీత దర్శకుడు : సమర్థ్ గొల్లపూడి, ఎడిటింగ్ : జెస్విన్ ప్రభు, పి.ఆర్.ఒ: నాయుడు సురేంద్ర కుమార్- ఫణికందుకూరి (బియాండ్ మీడియా).
తమ చిత్రం #Ranabaali విడుదలకు ముందు స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తమిళనాడు ముఖ్యమంత్రి, థళపతి విజయ్‌ను…
దోనేపూడి చక్రపాణి సమర్పణలో చిత్రాలయం స్టూడియోపై గుణి మంచికంటి దర్శకుడిగా వేణు దోనేపూడి నిర్మించిన చిత్రం ‘బా బా బ్లాక్…
కృష్ణ కమల్ , మహి హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న రూరల్ కామెడీ డ్రామా ‘జో జో’. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న…
నటిగా సూపర్ హిట్ సినిమాల్లో నటించిన అనన్య నాగళ్ల నూతనంగా హిడి పేరుతో కేవలం మహిళలకు ఉపయోగపడేలా క్లోతింగ్ బిజినెస్…
▪️ ఆదిత్య మ్యూజిక్ ద్వారా అధికారికంగా విడుదల ▪️ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్.. సెలబ్రిటీలనూ ఆకట్టుకుంటున్న సాంగ్ హైదరాబాద్:…
సినీ రంగంలో పవన్ కళ్యాణ్ 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఆయనకు హృదయపూర్వక…