టాలీవుడ్

అధునాతన టెక్నాలజీతో శ్రీ సారథీ స్టూడియోస్

డాల్బీ మిక్సింగ్, సౌండ్ డిజైన్ స్టూడియోలు ప్రారంభం

హైదరాబాద్ లో తెలుగు సినిమాకు ఐకాన్ గా , ఇంకా చెప్పాలంటే మొట్ట మొదటి స్టూడియోగా శ్రీ సారథీ స్టూడియోస్ కు ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. అలనాటి సినిమాలు మొదలుకుని, నేటి సినిమాల వరకు ఎన్నెన్నో సినిమాలు ఇక్కడ షూటింగ్ జరుపుకున్నవే. మారుతున్న కాలానికి తగట్టు అధునాతన టెక్నాలజీతో అన్ని రకాల హంగులతో, ఈ స్టూడియోస్ ను తీర్చిదిద్దారు.

ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలలోనే అధునాతన డాల్బీ మిక్సింగ్, సౌండ్ డిజైన్ స్టూడియోలను శ్రీ సారథీ స్టూడియోస్ ప్రారంభించింది. కాగా శుక్రవారం ఆహ్లాదభరిత వాతావరణంలో పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో ఈ స్టూడియోలో జరిగిన కార్యక్రమంలో డాల్బీ మిక్సింగ్ స్టూడియోను ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి ప్రారంభించగా, సౌండ్ డిజైన్ స్టూడియోను ప్రముఖ సినీ సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర ప్రారంబించారు.

ఈ సందర్భంగా శ్రీ సారథీ స్టూడియోస్ చైర్మన్ ఎం.ఎస్ ఆర్.వి. ప్రసాద్ మాట్లాడుతూ, లోగడ ఈ స్టూడియోని మల్టీఫ్లెక్స్ థియేటర్స్ గా మార్చాలన్న ఆలోచన చేసి, ఆ తర్వాత విరమించుకున్నాం. సినీ స్టూడియోస్ గానే కొనసాగించాలని నిర్ణయించుకున్న అనంతరం షూటింగులకు కావలసిన అన్ని రకాల హంగులు, అలాగే నేటి కాలానికి పోటీపడేవిధంగా పోస్ట్ ప్రొడక్షన్స్ కు కావలసిన అధునాతన టెక్నాలజీని మా స్టూడియోలో అందుబాటులోకి తీసుకునివచ్చాం. మేము ఈ రోజు ఆరంభించిన డాల్బీ మిక్సింగ్, సౌండ్ డిజైన్ లు చాలా చాలా అధునాతనమైనవి.

ఈ టెక్నాలజీని ఉపయోగించుకుంటూ మా స్టూడియోలో మొదలైన మొదటి సినిమా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న క్రేజీ సినిమా “కల్కి” అని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాం” అని అన్నారు


శ్రీ సారథీ స్టూడియోస్ డైరెక్టర్ కె.వి.రావు మాట్లాడుతూ, మా స్టూడియోలో షూటింగ్ ప్రారంభిస్తే,, పోస్ట్ ప్రొడక్షన్స్ తో సహా సినిమా మొదటి కాపీని సిద్ధం చేసుకునేంతవరకు కావలసిన ఎక్విప్ మెంట్ అంతా ఉందని అన్నారు. సినిమా అనగానే సౌండింగ్ కు ఉన్న ప్రాధాన్యం అంతాఇంతా కాదు. అందుకే అధునాతన టెక్నాలజీని మేము ప్రవేశపెట్టామని చెప్పారు.


ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాతలు కె.ఎస్.రామారావు, కె.ఎల్.నారాయణ, రచయిత విజయేంద్రప్రసాద్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ దామోదర్ ప్రసాద్, సంగీత దర్శకుడు భీమ్స్, స్టూడియో జనరల్ మేనేజర్ బాలచంద్ర, ఇంకా పలువురు సినీ ప్రముఖులు, మీడియా ప్రముఖులు పాల్గొని, స్టూడియో యాజమాన్యానికి అభినందనలు తెలియజేశారు.

Tfja Team

Recent Posts

డాక్టర్ అరుళనందు పుట్టినరోజు సందర్భంగా ‘హైకు’ ఫస్ట్ లుక్ విడుదల చేసిన విజన్ సినిమా హౌస్

నిజాయితీతో, భావోద్వేగపూరిత కథలను ప్రోత్సహిస్తూ అందరి దృష్టిని ఆక‌ర్షిస్తూ వేగంగా ఎదుగుతోన్న‌ నిర్మాణ సంస్థ విజన్ సినిమా హౌస్. డా.…

43 minutes ago

జియో స్టార్ సరికొత్త కార్యక్రమం ‘సౌత్ బౌండ్’ టీజ‌ర్ విడుద‌ల‌

ఎప్ప‌టిక‌ప్పుడు వైవిధ్య‌మైన కంటెంట్‌తో ప్రేక్ష‌కుల‌ను మెపిస్తూ వారి హృద‌యాల్లో త‌న‌దైన స్థానాన్ని సంపాదించుకున్న ఓటీటీ ఫ్లాట్ ఫామ్ జియో హాట్…

47 minutes ago

లండన్ లీసెస్ట‌ర్ స్క్వేర్‌లో షారూఖ్ ఖాన్‌, కాజోల్ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌తో తొలి భార‌తీయ సినిమాగా గుర్తింపు పొందిన దిల్ వాలే దుల్హ‌నియా లే జాయేంగే

యష్ రాజ్ ఫిల్మ్స్ హిస్టారిక‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ దిల్ వాలే దుల్హ‌నియా లే జాయేంగే (DDLJ) 30 వ‌సంతాల సంద‌ర్బంగా…

50 minutes ago

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైల‌ర్‌.. హిందీతో పాటు త‌మిళ‌, తెలుగులోనూ…

1 day ago

ఫిబ్రవరి 6, 2026న‌ ‘యుఫోరియా’ గ్రాండ్ రిలీజ్‌

బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమ‌తి రాగిణి గుణ స‌మ‌ర్ప‌ణ‌లో గుణ…

5 days ago

కోయంబత్తూరులోని ఈ యోగ కేంద్రం వద్దనున్న లింగ భైరవి సన్నిధిలో, పవిత్రమైన ‘భూత శుద్ధి వివాహం’ చేసుకున్న సమంత ప్రభు, రాజ్ నిడిమోరు

ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…

5 days ago