శివాజీ బర్త్ డే స్పెషల్.. సెకండ్ ఇన్నింగ్స్‌లో దూసుకుపోతోన్న విలక్షణ నటుడు

తెలుగు సినిమా లోకానికి, తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం అవసరం లేని పేరు శివాజీ. నటుడిగా, హీరోగా ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించారు. ఎంతో మంది కుర్ర హీరోలకు తన గాత్రాన్ని ఇచ్చి నిలబెట్టారు. శివాజీ తన కెరీర్‌లో డబ్బింగ్ చెప్పింది కొంత మందికే అయినా అందులో ఆయన మార్క్ ఎప్పటికీ ప్రేక్షకుల్లో నిలిచే ఉంటుంది. కామెడీ, ఎమోషన్, ఫ్యామిలీ, యాక్షన్ ఇలా అన్ని రకాల కథలతో ఆడియెన్స్‌ని ఆయన ఆకట్టుకున్నారు. అయితే సినిమాలకి కాస్త గ్యాప్ ఇచ్చిన ఆయన బిగ్ బాస్ షోతో మళ్లీ కెరీర్‌ను ప్రారంభించారు. బిగ్ బాస్ షోతో శివాజీ ప్రతీ ఇంటి గడపలోకి, తెలుగు వారి మనసుల్లో మళ్లీ స్థానాన్ని సంపాదించుకున్నారు.

బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన శివాజీకి ఇబ్బడి ముబ్బడిగా అవకాశాలు వచ్చాయి. అయితే శివాజీ మాత్రం తనకు నచ్చిన, మెచ్చిన కథల్ని ఆచితూచి ఎంచుకుంటూ ఉన్నారు. శివాజీ ఓ కథను ఒప్పుకున్నారంటే ఆ సినిమాను తప్పకుండా చూడాల్సిందే అనేలా ప్రేక్షకుల్లో నమ్మకాన్ని ఏర్పర్చుకున్నారు. శివాజీ ఓ మూవీ చేస్తున్నాడంటే.. అందులో కంటెంట్ ఎంతో గొప్పగా ఉంటుందనే పేరు తెచ్చుకున్నారు. అందుకే ఆయన సెకండ్ ఇన్నింగ్స్‌లో చేసిన ‘కోర్ట్’, ‘దండోరా’ చిత్రాలకు అవార్డులు వచ్చాయి.

90స్ మూవీతో‌ శివాజీ ఓటీటీ ఆడియెన్స్‌ని సైతం మెప్పించారు. ఇక ఆ సిరీస్‌కు సీక్వెల్‌గా ‘ఎపిక్’ అనే మూవీ వస్తున్న సంగతి తెలిసిందే. అందులోనూ శివాజీ తన నటనతో అందరినీ ఆకట్టుకోబోతోన్నారు. అఖిల్ అక్కినేని హీరోగా వస్తున్న ‘లెనిన్’ చిత్రంలోనూ ఓ కొత్త తరహా పాత్రను పోషిస్తున్నారు. ఇవే కాకుండా ఇంకో క్రేజీ ప్రాజెక్ట్‌లు లైనప్‌లో ఉన్నాయి. ఇలా చేతినిండా ప్రాజెక్టులతో శివాజీ బిజీగా ఉన్నారు. వచ్చిన ప్రతీ కథకు ఓకే చెప్పకుండా.. తన మనసుకు నచ్చిన కథల్ని మాత్రమే చేస్తూ తెలుగు ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. అలాంటి శివాజీ గారు మరెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని కోరుకుందాం.

TFJA

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

3 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

3 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

3 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago