‘రావణాసుర’స్పెషల్ సాంగ్  ఫిబ్రవరి 5న లాంచ్

మాస్ మహారాజా రవితేజ,  క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మల హై-ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ ‘రావణాసుర’ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అభిషేక్ పిక్చర్స్, ఆర్ టీ టీమ్‌వర్క్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని గ్రాండ్ గా  నిర్మిస్తున్నాయి. అభిషేక్ నామా, రవితేజ నిర్మాతలు.

ఫస్ట్ , స్పెషల్ ట్రాక్ గురించి అప్‌డేట్‌ తో వచ్చారు మేకర్స్ . హర్షవర్ధన్ రామేశ్వర్,  భీమ్స్ కలిసి సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని  మొదటి పాటను పాపులర్ మ్యూజిక్ వేదిక్ బ్యాండ్ శాంతి పీపుల్ చేతుల మీదగా ఫిబ్రవరి 5న హైదరాబాద్‌లో లాంచ్ చేయనున్నారు.

రవితేజ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన గ్లింప్స్‌ కు అద్భుతమైన స్పందన వచ్చింది. సుధీర్ వర్మ ఈ సినిమాలో రవితేజను లాయర్ పాత్రలో మునుపెన్నడూ చూడని విధంగా హై యాక్షన్‌ లో ప్రజంట్ చేస్తున్నారు. శ్రీకాంత్ విస్సా ఈ చిత్రానికి సరికొత్త కథని అందించారు. సుధీర్ వర్మ తన మార్క్ టేకింగ్‌తో ఈ చిత్రాన్ని కథనంలో  ఊహించని మలుపులతో స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నారు.

సుశాంత్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో  అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ.. కథానాయికలుగా నటిస్తున్నారు.  

విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా శ్రీకాంత్ ఎడిటర్ గా పని చేస్తున్నారు.

ఏప్రిల్ 7, 2023న వేసవిలో రావణాసురు థియేటర్స్ లో గ్రాండ్‌గా విడుదల కానుంది.

తారాగణం: రవితేజ, సుశాంత్, అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, నితిన్ మెహతా (అఖండ ఫేమ్), సత్య, జయ ప్రకాష్ తదితరులు.

సాంకేతిక విభాగం:
దర్శకత్వం: సుధీర్ వర్మ
నిర్మాతలు: రవితేజ, అభిషేక్ నామా
బ్యానర్: ఆర్ టి టీమ్‌వర్క్స్, అభిషేక్ పిక్చర్స్
కథ, స్క్రీన్‌ప్లే & డైలాగ్స్ : శ్రీకాంత్ విస్సా
సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్
డీవోపీ: విజయ్ కార్తీక్ కన్నన్
ఎడిటర్: శ్రీకాంత్
ప్రొడక్షన్ డిజైనర్: డిఆర్ కె కిరణ్
సీఈఓ: పోతిని వాసు
మేకప్ చీఫ్: ఐ శ్రీనివాస్ రాజు
పీఆర్వో: వంశీ-శేఖర్

TFJA

Recent Posts

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

7 days ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

7 days ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

7 days ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

7 days ago

సెప్టెంబర్ 4న విడుదలకు సిద్దంగా ‘మా రాముడు అందరివాడు’

ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…

7 days ago

పాన్ ఇండియా సినిమాలు తీస్తున్న డైరెక్టర్లందరికీ ఇది ఒక పాఠం — ఇరుముడి చూసి నేర్చుకోవాల్సిన సమయం వచ్చింది!

ఇరుముడి సినిమా కలెక్షన్స్ చూస్తుంటే అసలు నమ్మశక్యం కాని విధంగా ఉన్నాయి. సినిమా చరిత్రలో ఇలాంటి కలెక్షన్స్, ఇలాంటి జనసందోహం…

1 week ago