“శంకర్ దాదా ఎంబీబీఎస్” ఆగస్ట్ 22న థియేటర్స్ లో రీ రిలీజ్ !!!

Must Read

టాలీవుడ్ ప్రేక్షకులు, మూవీ లవర్స్ ఒకటిగా ఎదురు చూస్తున్న రీ రిలీజ్‌ల్లో ‘శంకర్ దాదా ఎంబిబిఎస్’ సినిమా కూడా ఒకటి. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ సినిమా కామెడీ అండ్ ఎమోషనల్ చిత్రంగా 2004లో ఆడియన్స్ ముందుకు వచ్చి సూపర్ హిట్ సాధించింది. బాలీవుడ్ మూవీ ‘మున్నా భాయ్ ఎంబిబిఎస్’కి ఇది రీమేక్ గా వచ్చిన ఈ సినిమాని జయంత్ పరాంజీ డైరెక్ట్ చేశాడు. సోనాలి బింద్రే హీరోయిన్ గా నటించింది. శంకర్ దాదాగా చిరంజీవి, ఏటీఎంగా శ్రీకాంత్ చేసిన సందడి అంతాఇంతా కాదు.

ఈ సినిమాలో చిరంజీవి ఇంగ్లీష్ పదాలతో తెలుగు సమేతులు చెబుతుంటే థియేటర్స్ లో ఆడియన్స్ అంతా కడుపుబ్బా నవ్వుకున్నారు. అలాగే లైఫ్ జర్నీలో మనిషి ఎదుర్కొనే అనేక ఎమోషన్స్ ని అందరి మనసుని హత్తుకునేలా చూపించారు. ఇక ఈ సినిమాకి మరో హైలైట్ అంటే.. దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన సాంగ్స్. ఈ రీ రిలీజ్ తో థియేటర్స్ అన్ని మ్యూజికల్ కాన్సర్ట్ గా, కామెడీ కార్నివాల్‌ గా మారిపోనున్నాయి.

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్ట్ 22న శంకర్ దాదా ఎంబీబీఎస్ థియేటర్స్ లో రీ రిలీజ్ కానుంది. భారీగా అత్యంత ఎక్కువ థియేటర్స్ లో విడుదల చెయ్యడానికి డిస్ట్రిబ్యూటర్స్ ప్లాన్ చేస్తున్నారు. జె.ఆర్.కె పిక్చర్స్ ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొని వస్తోంది.

Shankar Dada M.B.B.S. Re-Release 4K Trailer | Chiranjeevi, Sonali Bendre | Devi Sri Prasad

Latest News

Deccan Sarkar Movie Poster and Teaser Launch

Hyderabad:The movie 'Deccan Sarkar', directed by Kala Srinivas under the Kala Arts banner, recently had its poster and teaser...

More News