ఆహా ఓటీటీలో 100 మిలియన్ మినిట్స్ ఫ్లస్ వ్యూయర్ షిప్ తో బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ దక్కించుకుంటున్న ఆది సాయికుమార్ ‘శంబాల’ మూవీ

Must Read

ఆది సాయికుమార్ నటించిన రీసెంట్ సూపర్ హిట్ మూవీ ‘శంబాల’ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చి అద్భుత ఆదరణ సొంతం చేసుకుంటోంది. గత నెల 22వ తేదీ నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా 100 మిలియన్ మినిట్స్ ఫ్లస్ వ్యూయర్ షిప్ తో బ్లాక్ బస్టర్ సక్సెస్ దక్కించుకుంటోంది.

గతేడాది డిసెంబర్ 25న ‘శంబాల’ సినిమా మిస్టికల్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకులు ఆకట్టుకుంది. ఈ చిత్రాన్ని దర్శకుడు యుగంధర్ ముని రూపొందించారు. అర్చన ఐయ్యర్ హీరోయిన్ గా నటించింది. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద ఈ మూవీని మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీకి ప్రవీణ్ కె బంగారి విజువల్స్, శ్రీ చరణ్ పాకాల ఆర్ఆర్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. థియేటర్స్ లో సాధించిన విజయాన్ని మరిపించేలా ఆహా ఓటీటీలో శంబాల సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తుండటం విశేషం.

Latest News

భారత్‌లో ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ జోరు – అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం..!

మార్వెల్ స్టూడియోస్ ప్రతిష్టాత్మక చిత్రం ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు శుభవార్త. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో, భారత్‌లో కూడా...

More News