#Sharwa38 కోసం 15 ఎకరాల్లో స్పెక్టక్యూలర్ సెట్‌ నిర్మాణం

చార్మింగ్ స్టార్ శర్వా ఇటీవలే తన మేడిన్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ #Sharwa38ని అనౌన్స్ చేశారు. బ్లాక్ బస్టర్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లను అందించే డైరెక్టర్ సంపత్ నంది ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని ప్రతిష్టాత్మక శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె.రాధామోహన్ ప్రొడక్షన్ నెం. 15గా నిర్మించనున్నారు. హై ప్రొడక్షన్, టెక్నికల్ వాల్యూస్ తో రూపొందే ఈ చిత్రాన్ని లక్ష్మీ రాధామోహన్ సమర్పిస్తున్నారు.

#Sharwa38 1960లో ఉత్తర తెలంగాణ, తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోని రూరల్ బ్యాక్ డ్రాప్ లో సాగే పల్సేటింగ్ పీరియడ్ యాక్షన్ డ్రామా. 

#Sharwa38 టీం భూమి పూజతో సెట్ వర్క్‌ను ప్రారంభించింది. ఉత్తర తెలంగాణ స్వరూపాన్ని, వరల్డ్ , కల్చర్ ని రీక్రియేట్ చేసే మ్యాసీవ్ సెట్ ని హైదరాబాద్ సమీపంలోని 15 ఎకరాల విస్తీర్ణంలో హై బడ్జెట్ తో ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ కుమార్ మన్నె రూపొందించారు. పల్సేటింగ్ పీరియడ్ యాక్షన్ డ్రామా కోసం నిర్మించిన ఈ మ్యసీవ్ సెట్ మన చరిత్రలోని ఇంపార్టెంట్ టైమ్స్ లోకి ఆడియన్స్ ని తీసుకువెళ్ళనుంది. ఈ సెట్‌లో కొన్ని అద్భుతమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.

శర్వా మునుపెన్నడూ చూడని పాత్రలో కనిపించనున్నారు. 60ల నాటి పాత్రను పోషించడానికి అద్భుతంగా మేక్ఓవర్‌ అవుతున్నారు.

#Sharwa38 అత్యున్నత స్థాయి సాంకేతిక నిపుణుల పని చేస్తున్నారు. సౌందర్ రాజన్ ఎస్  డీవోపీ కాగ, సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించనున్నారు. కిరణ్ కుమార్ మన్నె ఆర్ట్ డైరెక్టర్.

ఈ మోస్ట్ అవైటెడ్ మూవీకి పని చేసే తారాగణం, ఇతర ప్రముఖ సాంకేతిక నిపుణులు వివరాలు త్వరలో తెలియజేస్తారు. #Sharwa38 తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.

నటీనటులు: చార్మింగ్ స్టార్ శర్వా

సాంకేతిక సిబ్బంది:

రచన, దర్శకత్వం: సంపత్ నంది

నిర్మాత: కేకే రాధామోహన్

బ్యానర్: శ్రీ సత్యసాయి ఆర్ట్స్

ప్రజెంట్స్: లక్ష్మీ రాధామోహన్

డీవోపీ: సౌందర్ రాజన్ S

సంగీతం: భీమ్స్ సిసిరోలియో

ఆర్ట్ డైరెక్టర్: కిరణ్ కుమార్ మన్నె

పీఆర్వో: వంశీ-శేఖర్

Tfja Team

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

10 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

10 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

10 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago