చార్మింగ్ స్టార్ శర్వా ఇటీవలే తన మేడిన్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ #Sharwa38ని అనౌన్స్ చేశారు. బ్లాక్ బస్టర్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లను అందించే డైరెక్టర్ సంపత్ నంది ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని ప్రతిష్టాత్మక శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె.రాధామోహన్ ప్రొడక్షన్ నెం. 15గా నిర్మించనున్నారు. హై ప్రొడక్షన్, టెక్నికల్ వాల్యూస్ తో రూపొందే ఈ చిత్రాన్ని లక్ష్మీ రాధామోహన్ సమర్పిస్తున్నారు.
#Sharwa38 1960లో ఉత్తర తెలంగాణ, తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోని రూరల్ బ్యాక్ డ్రాప్ లో సాగే పల్సేటింగ్ పీరియడ్ యాక్షన్ డ్రామా.
#Sharwa38 టీం భూమి పూజతో సెట్ వర్క్‌ను ప్రారంభించింది. ఉత్తర తెలంగాణ స్వరూపాన్ని, వరల్డ్ , కల్చర్ ని రీక్రియేట్ చేసే మ్యాసీవ్ సెట్ ని హైదరాబాద్ సమీపంలోని 15 ఎకరాల విస్తీర్ణంలో హై బడ్జెట్ తో ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ కుమార్ మన్నె రూపొందించారు. పల్సేటింగ్ పీరియడ్ యాక్షన్ డ్రామా కోసం నిర్మించిన ఈ మ్యసీవ్ సెట్ మన చరిత్రలోని ఇంపార్టెంట్ టైమ్స్ లోకి ఆడియన్స్ ని తీసుకువెళ్ళనుంది. ఈ సెట్‌లో కొన్ని అద్భుతమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.
శర్వా మునుపెన్నడూ చూడని పాత్రలో కనిపించనున్నారు. 60ల నాటి పాత్రను పోషించడానికి అద్భుతంగా మేక్ఓవర్ అవుతున్నారు.
#Sharwa38 అత్యున్నత స్థాయి సాంకేతిక నిపుణుల పని చేస్తున్నారు. సౌందర్ రాజన్ ఎస్ డీవోపీ కాగ, సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించనున్నారు. కిరణ్ కుమార్ మన్నె ఆర్ట్ డైరెక్టర్.
ఈ మోస్ట్ అవైటెడ్ మూవీకి పని చేసే తారాగణం, ఇతర ప్రముఖ సాంకేతిక నిపుణులు వివరాలు త్వరలో తెలియజేస్తారు. #Sharwa38 తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.
నటీనటులు: చార్మింగ్ స్టార్ శర్వా
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: సంపత్ నంది
నిర్మాత: కేకే రాధామోహన్
బ్యానర్: శ్రీ సత్యసాయి ఆర్ట్స్
ప్రజెంట్స్: లక్ష్మీ రాధామోహన్
డీవోపీ: సౌందర్ రాజన్ S
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
ఆర్ట్ డైరెక్టర్: కిరణ్ కుమార్ మన్నె
పీఆర్వో: వంశీ-శేఖర్
కేవలం ఐదు రోజుల్లో రూ.100.2 కోట్ల గ్రాస్ సాధించిన 'అనగనగా ఒక రాజు'నవీన్ పొలిశెట్టి కెరీర్లోనే అతిపెద్ద విజయంయూఎస్‌లో హ్యాట్రిక్…
వైవిధ్యమైన సినిమాలు, పాత్రలతో బహు భాషా నటుడిగా తనదైన గుర్తింపు సంపాదించుకున్న స్టార్ దుల్కర్ సల్మాన్. కంటెంట్ బేస్డ్ మూవీస్…
ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…
డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…
వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించారు.…
చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…