తెలుగుకు పరిచయం అవుతున్న సెన్సేషనల్ సింగర్ ఆర్య దయాళ్

ఆనంద్ దేవరకొండ,విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య నటించిన సినిమా బేబీ. సాయి రాజేశ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని ఎస్.కే.ఎన్ నిర్మించారు. ఈ సినిమా నుంచి ఆ మధ్య విడుదల చేసిన “ఓ రెండు ప్రేమ మేఘాలిలా” లిరికల్ సాంగ్ కు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారి నుంచి గొప్ప స్పందన వచ్చింది. విజయ్ బుల్గానిన్ స్వరపరచగా అద్భుతమైన మెలోడీగా ఎంతోమందికి ఫేవరెట్ సాంగ్ గా నిలిచిందీ గీతం. ఇక అంతకు మించిన మెలోడీతో మరో పాటతో సిద్ధమైంది బేబీ మూవీ టీమ్. ఈ సారి మళయాలంలో మోస్ట్ ఫేమస్ సింగర్ గా పేరు తెచ్చుకున్న ఆర్య దయాల్ చేత ఈ రెండో పాటను పాడించడం విశేషం. అంతేకాదు.. ఓ పెద్ద బడ్జెట్ సినిమా పాటలాగా ఆర్య దయాల్ పాడుతుండగా ఈ గీతాన్ని వీడియోగానూ చేశారు. త్వరలోనే ఈపాటను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా సింగర్ చేత చేయించిన లిరికల్ వీడియో  పూర్తయిన సందర్భంగా

చిత్ర దర్శకుడు సాయి రాజేశ్ మాట్లాడుతూ.. “. బేబీ ఫస్ట్ సాంగ్ ఓ పెద్దసెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పటి వరకూ అన్ని డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లో 20 మిలియన్ వ్యూస్ సంపాదించుకుంది. అందుకే తర్వాతి అంతర్జాతీయ స్థాయిలో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న మళయాలీ సింగర్ ఆర్య దయాల్ చేత ఈ పాటను పాడించాం.  తన ప్రైవేట్ సాంగ్స్, యూ ట్యూబ్ షాట్స్, ఇంతకు ముందు పాడిన పాటలకు చాలా పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది. నేను కూడా తనకు అభిమానిని. ఈ పాటను మా మ్యూజిక్ డైరెక్టర్ తో కలిసి తన కోసమే కంపోజ్ చేశాం. తనతోనే పాడించాలని నిర్ణయించుకున్నాం. ఈ పాట మొదటి పాటకు ఏ మాత్రం తీసిపోదు. ఇక ఫస్ట్ సాంగ్ కు మించి ఈ పాట పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఓ పాటకు పెట్టాల్సినంత బడ్జెట్ ను ప్రమోషనల్ మ్యూజికల్ వీడియోకే పెట్టారు. ఆర్యదయాల్ మొదటి పాట నా సినిమాలోనిది కావడం గర్వంగా ఉంది. ఈ పాట తర్వాత తెలుగు ప్రజలు తన వాయిస్ తో ప్రేమలో పడతారు అని ఖచ్చితంగా చెప్పగలను.”అన్నారు

నిర్మాత ఎస్కేఎన్ మాట్లాడుతూ.. ” ఇప్పటి వరకూ మీడియా వారికి ఆన్ సెట్స్ కు వచ్చి కవర్ చేయడం ఉండేది. మొదటిసారిగా ఓ అప్ కమింగ్ స్టార్ సినిమాకు లిరికల్ వీడియోకు సెట్ వేసి సాంగ్ చేయడం ఇదే ఫస్ట్ టైమ్. అందుకు కారణం బేబీ సినిమా మొదటి పాటకు వచ్చిన రెస్పాన్సే. ఆ పాటకు చాలా పెద్ద అప్లాజ్ వచ్చింది. బేబీ మూవీ మ్యూజిక్ హిట్ అవుతుందని నమ్ముతున్నాం. ఇక ఈ రెండో లిరికల్ సాంగ్ ను త్వరలోనే విడుదల చేయబోతున్నాం. ఈ పాట పాడిన ఇంటర్నేషనల్ లెవల్ లో క్రేజ్ ఉంది. తన ఫస్ట్ తెలుగు పాట మా సినిమాలోనిది కావడం విశేషం. ఈ పాట కోసం తను చాలా హార్డ్ వర్క్ చేసింది. భాషను అర్థం చేసుకుని పాడింది. సినిమాలో ఈ పాట వస్తున్నప్పుడు ఓ హై మూమెంట్ వస్తుంది. దర్శకుడు చాలా ఎక్స్ పీరియన్స్ డ్ డైరెక్టర్ లా సాయి రాజేశ్ ఈ సినిమాను చాలా అద్భుతంగా తెరకెక్కించాడు. ఈ మూవీ ఆనంద్, వైష్ణవి, విరాజ్ లకు చాలా పేరు వస్తుందని నమ్ముతున్నాను. సోషల్ మీడియా నుంచి బేబీ చిత్రాన్ని సపోర్ట్ చేస్తోన్న ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్ చెబుతున్నాను” అన్నారు.

ఇక బేబీ సినిమాలోని రెండో పాటను పాడిన ఆర్య దయాల్ మాట్లాడుతూ.. ” తెలుగు పాట కోసం ఇంత మంచి భాష నేర్చుకోవడం సంతోషంగా అనిపించింది. రికార్డింగ్ అంతా చాలా ఫన్నీగా జరిగింది. టీమ్ లోని ప్రతి ఒక్కరూ సహనంతో నాకు అన్నీ నేర్పించారు. నాలో కాన్ఫిడెన్స్ పెంచేందుకు టీమ్ మొత్తం బాగా కృషి చేసింది. ఇంత గొప్ప ప్రాజెక్ట్ లో భాగమైనందుకు గర్వంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్యూ.. ” అంటూ ముగించారు.

కో ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ.. ” మొదటి పాట ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలుసు. కానీ ఈ రెండో పాట అంతకు డబుల్ రేంజ్ లో ఉంటుంది. పాట చేస్తున్నప్పుడే నాకు అనిపించింది.. ఇది చాలా పెద్ద హిట్ అవుతుందని. ఇక ఈ పాట పాడేందుకు ఒప్పుకున్న ఆర్య దయాల్ గారికి థ్యాంక్యూ చెబుతున్నాను.. ” అన్నారు.

ఇక త్వరలోనే విడుదల కాబోతోన్న ఈ చిత్రంలో ఆనంద్ దేవరకొండ,విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య,నాగబాబు, లిరీష తదితరులు నటించారు.

ఈ చిత్రానికి సంగీతంః విజయ్ బుల్గానిన్,
ఎడిటింగ్ః విప్లవ్ నైషధం, సినిమాటోగ్రఫీః ఎమ్ఎన్ బాల్ రెడ్డి,
పి.ఆర్.వోః ఏలూరు శీను, జిఎస్.కే మీడియా,
కో ప్రొడ్యూసర్ః ధీరజ్ మొగిలినేని, నిర్మాతః ఎస్.కే.ఎన్,
రచన- దర్శకత్వంః సాయి రాజేశ్.

Tfja Team

Recent Posts

గ్రాండ్‌గా జరిగిన ‘MRP – నీకెంత నాకెంత’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. జూలై 17న రిలీజ్

యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ 'MRP - నీకెంత నాకెంత' చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విడుదల…

2 weeks ago

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు చేతుల మీదుగా రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ “అదే నీవు అదే నేను” టీజర్ రిలీజ్

తన బ్యానర్ సినిమాకు ఈ టైటిల్ పెట్టాలని అనుకున్నానని వెల్లడించిన ప్రొడ్యూసర్ దిల్ రాజు త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్…

2 weeks ago

నా కెరీర్ లో చాలా స్పెషల్ సినిమా ‘రక్త చరిత్ర’-రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో రామ్ గోపాల్ వర్మ

"రాయలసీమ ఫ్యాక్షనిజంలోని యథార్థ ఘటనలను ఆధారంగా చేసుకుని 'రక్త చరిత్ర' సినిమాను తీశాను. అందులోని క్యారెక్టర్స్ గురించి ఎంతో స్టడీ…

2 weeks ago

యతిరాజు పాత్రలో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచిన శివాజీ

అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తూ సితార ఎంటర్టైనర్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తూ నేడు ప్రేక్షకుల ముందుకు…

2 weeks ago

సావిత్రి గారంటే తెలుగుతనం, అమ్మతనం ‘సావిత్రి క్లాసిక్స్’ ఇంగ్లీషు పుస్తకావిష్కరణ సభ లో జయప్రద

సావిత్రి గారు అద్భుతాలకే అద్భుతం - ‘సావిత్రి క్లాసిక్స్’ ఇంగ్లీషు పుస్తకావిష్కరణ సభ లో పద్మశ్రీ డా. బ్రహ్మానందం ఆంగ్లంలోకి…

2 weeks ago

‘ఐ, నోబడీ’ ప్రివ్యూ ప్రెస్ మీట్‌లో పృథ్వీరాజ్ సుకుమారన్*

‘ఐ, నోబడీ’ చిత్రీకరణలో మాకెన్నో సవాళ్లు ఎదురయ్యాయి. యాక్షన్ సీక్వెన్స్ కోసం చాలా కష్టపడ్డాం’ -మలయాళ టాప్ స్టార్ పృథ్వీరాజ్…

2 weeks ago