సెకండ్ షెడ్యూల్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న మూవీ “కిల్లర్”

“శుక్ర”, “మాటరాని మౌనమిది”, “ఏ మాస్టర్ పీస్” వంటి డిఫరెంట్ సినిమాలతో మూవీ లవర్స్ దృష్టిని ఆకట్టుకుంటున్న దర్శకుడు పూర్వాజ్ “కిల్లర్” అనే సెన్సేషనల్ సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో ఆయన హీరోగా పాత్రలో నటిస్తుండటం విశేషం. జ్యోతి పూర్వజ్ హీరోయిన్ గా నటిస్తుండగా..మరో ఇద్దరు హీరోలుగా విశాల్ రాజ్, గౌతమ్ యాక్ట్ చేస్తున్నారు. ఏయు అండ్ఐ మరియు మెర్జ్ ఎక్స్ ఆర్ సంస్థతో కలిసి థింక్ సినిమా బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు పూర్వాజ్ ప్రజయ్ కామత్, ఎ. పద్మనాభరెడ్డి ఈ కొలాబ్రేషన్ లో నిర్మాణమవుతున్న రెండవ చిత్రమిది.

“కిల్లర్” పార్ట్ 1 డ్రీమ్ గర్ల్ మూవీ ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ పూర్తి చేశారు. రామెజీ ఫిలిం సిటీ, వికారాబాద్ ఫారెస్ట్ ఏరియా, హైదరాబాద్ లో ఈ షెడ్యూల్ చిత్రీకరణ జరిపారు. సెకండ్ షెడ్యూల్ లో హీరో పూర్వాజ్, హీరోయిన్ జ్యోతి పూర్వజ్ మరో ఇద్దరు హీరోలు విశాల్ రాజ్, గౌతమ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా

హీరో, దర్శకుడు పూర్వాజ్ మాట్లాడుతూ – “కిల్లర్” సినిమా ఔట్ పుట్ మేము అనుకున్నట్లే బాగా వస్తోంది. లవ్, రొమాన్స్, ప్రతీకారం, ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్, థ్రిల్లర్ అంశాలతో మా సినిమాను రూపొందిస్తున్నాం. ఎ మాస్టర్ పీస్ సినిమాతో పాటు మా సంస్థలో వస్తున్న చిత్రంగా “కిల్లర్” మూవీపై ఉన్న అంచనాలను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా సినిమాను చిత్రీకరిస్తున్నాం. త్వరలోనే షూటింగ్ కంప్లీట్ చేసి చిత్రాన్ని మీ ముందుకు తీసుకొస్తాం. సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ గా “కిల్లర్” ఒక స్పెషల్ మూవీగా మీకు గుర్తుండిపోతుంది. అన్నారు.

నటీనటులు – జ్యోతి పూర్వజ్, పూర్వాజ్, విశాల్ రాజ్, గౌతమ్, తదితరులు

టెక్నికల్ టీమ్

సినిమాటోగ్రఫీ – జగదీశ్ బొమ్మిశెట్టి
మ్యూజిక్ – అషీర్ ల్యూక్, సుమన్ జీవరత్నం
వీఎఫ్ఎక్స్, వర్చువల్ ప్రొడక్షన్ – మెర్జ్ ఎక్స్ఆర్
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
బ్యానర్స్ – థింక్ సినిమా, మెర్జ్ ఎక్స్ఆర్, ఏయు అండ్ ఐ.
నిర్మాతలు – పూర్వాజ్, ప్రజయ్ కామత్, ఎ. పద్మనాభరెడ్డి.
రచన దర్శకత్వం – పూర్వాజ్

Tfja Team

Recent Posts

త్వ‌ర‌లోనే నితిన్ 36వ సినిమా షూటింగ్ ప్రారంభం

నితిన్ హీరోగా వి.ఐ.ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో శ్రీనివాస సిల్వ‌ర్ స్క్రీన్ బ్యాన‌ర్‌పై రూపొంద‌నున్న యూనిక్ సైఫై ఎంట‌ర్‌టైన‌ర్‌.. వైవిధ్య‌మైన సినిమాలు, పాత్ర‌ల‌తో…

2 days ago

ప్రముఖ సినీ గీత రచయిత పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి కాంస్య విగ్రహవిష్కరణ

తానా సాహిత్య విభాగం - తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో మరియు అనకాపల్లి సిరివెన్నెల…

2 days ago

రికార్డులు తిరగరాస్తున్న స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్‌ పొలిశెట్టి

కేవలం ఐదు రోజుల్లో రూ.100.2 కోట్ల గ్రాస్ సాధించిన 'అనగనగా ఒక రాజు'నవీన్‌ పొలిశెట్టి కెరీర్‌లోనే అతిపెద్ద విజయంయూఎస్‌లో హ్యాట్రిక్…

1 week ago

దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ చిత్రం నుంచి సాత్విక వీరవల్లి పరిచయం

వైవిధ్య‌మైన సినిమాలు, పాత్ర‌ల‌తో బ‌హు భాషా న‌టుడిగా త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న స్టార్‌ దుల్క‌ర్ స‌ల్మాన్. కంటెంట్ బేస్డ్ మూవీస్…

1 week ago

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…

3 weeks ago

శంబాల థ్యాంక్స్ మీట్.. చిత్రయూనిట్‌‌ని అభినందించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు

డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…

3 weeks ago