
థియేట్రికల్ గా 2 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించిన “కిల్లర్” సినిమా
ఫ్యాన్సీ ప్రైస్ కు “కిల్లర్” సినిమా ఓటీటీ హక్కులు పొందిన ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్
స్ట్రాంగ్ కంటెంట్ ఉంటే చిన్న చిత్రాలు కూడా పెద్ద విజయం సాధించగలవు అని మరోసారి ప్రూవ్ చేసింది “కిల్లర్”. ఈ సెన్సేషనల్ సై ఫై థ్రిల్లర్ ప్రీమియర్స్ తో కలిపి థియేట్రికల్ గా 2 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించింది. “కిల్లర్” సినిమా సాధించిన విజయం ప్రముఖ ఓటీటీ సంస్థల దృష్టిని ఆకర్షించింది. ఈ నేపథ్యంలో ఒక ప్రముఖ ఓటీటీ సంస్థ ఈ చిత్ర ఓటీటీ హక్కులను ఫ్యాన్సీ ప్రైస్ కు సొంతం చేసుకుంది. ఒక చిన్న సినిమా థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఫ్యాన్సీ ప్రైస్ తో ఔట్ రైట్ గా ఒక పెద్ద ఓటీటీ సంస్థ హక్కులు తీసుకోవడం విశేషం. త్వరలో “కిల్లర్” సినిమా స్ట్రీమింగ్ కు రాబోతోంది.
“కిల్లర్” సినిమాలో జ్యోతి పూర్వజ్, పూర్వాజ్, లీడ్ రోల్స్ లో నటించారు. ఈ చిత్రంలో మనీష్ గిలాడా, చంద్రకాంత్ కొల్లు, అయినాబత్తిన దశరథ మాధవ్, విశాల్ రాజ్, అర్చన అనంత్, గౌతమ్ చక్రధర్ కొప్పిశెట్టి ఇతర పాత్రల్లో కనిపించారు. “కిల్లర్” సినిమాను ధ్యానం నాన్నగారు ఆశీస్సులతో థింక్ సినిమా, ఏయూ అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్స్ పై పూర్వాజ్ , పద్మనాభ రెడ్డి.ఎ. నిర్మించగా ..ఉర్వీశ్ పూర్వజ్ సమర్పకులుగా వ్యవహరించారు. పూర్వాజ్ దర్శకత్వం వహించి, ఒక ఇంపార్టెంట్ రోల్ చేశారు. దర్శకుడిగా, నటుడిగా పూర్వాజ్ ప్రేక్షకులను మెప్పించారు. త్వరలోనే ఓటీటీ ద్వారా “కిల్లర్” సినిమా మరింతమంది ప్రేక్షకులకు చేరువ కానుంది.
నటీనటులు – జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ , మనీష్ గిలాడ, చంద్రకాంత్ కొల్లు, అయినాబత్తిన దశరథ మాధవ్, విశాల్ రాజ్, అర్చన అనంత్, గౌతమ్ చక్రధర్ కొప్పిశెట్టి, తదితరులు
టెక్నికల్ టీమ్
రచన, ఎడిటింగ్, దర్శకత్వం – పూర్వాజ్
సమర్పణ – ఉర్వీశ్ పూర్వజ్
ప్రొడ్యూసర్స్ – పూర్వాజ్, పద్మనాభరెడ్డి.ఎ.
డీవోపీ – జగదీశ్ బొమ్మిశెట్టి
స్క్రీన్ ప్లే ఎడిటర్ – పూర్వాజ్
మ్యూజిక్ – ఆశీర్వాద్, సుమన్ జీవ
చీఫ్ ఎడిటర్ – బి.మనోజ్ కుమార్
మాస్టర్ చీఫ్ ఎడిటర్ – శివ శర్వాణి
కాస్టూమ్ డిజైన్ – ఉదయశ్రీ పూర్వజ్
ఆర్ట్ డైరెక్షన్ – మణి
యాక్షన్ కొరియోగ్రఫీ – రాజ్ కుమార్ గంగపుత్ర
లైన్ ప్రొడ్యూసర్స్ – అయినాబత్తిన దశరథ మాధవ్, సీతారామారావు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – డీఎస్ బాష
డీఐ – మయసభ స్టూడియోస్
పీఆర్ఓ – గాండ్ల శ్రీనివాస్ ( జి.ఎస్. మీడియా )

