పక్కా కమర్షియల్ సినిమా అయినా, ఎక్స్ పెరిమెంటల్ మూవీ అయినా నటనకు ప్రాధాన్యముందంటే, ఆటోమేటిగ్గా అందరి చూపులూ హీరో సత్యదేవ్ వైపు తిరగాల్సిందే. సినిమా రంగంలో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకున్నా, ఒక్కో మెట్టూ ఎక్కుతూ తానేంటో ప్రూవ్ చేసుకుంటున్నారు హీరో సత్యదేవ్. ఆయన నటించిన లేటెస్ట్ సినిమా కృష్ణమ్మ. రా అండ్ రస్టిక్ బ్యాక్‌డ్రాప్ యాక్షన్ మూవీగా కృష్ణమ్మ మూవీ తెరకెక్కుతోంది. వి.వి.గోపాలకృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అరుణాచల క్రియేషన్స్ పతాకంపై రూపొందిస్తున్నారు. కొరటాల శివ సమర్పిస్తున్న సినిమా ఇది. కృష్ణ కొమ్మలపాటి నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని మే 3 గ్రాండ్ లెవల్లో రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా…
నిర్మాత కృష్ణ కొమ్మలపాటి మాట్లాడుతూ ”రా అండ్ రస్టిక్ బ్యాక్‌డ్రాప్ యాక్షన్ మూవీగా తెరకెక్కించిన సినిమా ఇది. టైటిల్ కృష్ణమ్మ అని ఎందుకు పెట్టామో, సినిమా చూసినప్పుడు ప్రతి ఒక్కరికీ అర్థమవుతుంది. నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను సెలక్ట్ చేసుకుంటూ, ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు పొందిన సత్యదేవ్ కచ్చితంగా ఈ సినిమాతో మరో రేంజ్‌కి చేరుకుంటారు. ఇటీవల విడుదల చేసిన టీజర్‌కి, పాటలకి చాలా మంచి స్పందన వస్తోంది. కాలభైరవ తన మ్యూజిక్‌తో మ్యాజిక్ చేస్తున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి వేసవి కానుకగా మే 3న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం” అని అన్నారు.
దర్శకుడు వి.వి.గోపాలకృష్ణ మాట్లాడుతూ ”స్నేహానికి ఉన్న విలువను ఈ చిత్రంలో చూపిస్తున్నాం. టైటిల్ సాంగ్‌లోనే హీరోకి, అతని స్నేహితుల మధ్య ఉండే అనుబంధాన్ని చూపించాం. ఇంటెన్స్ థ్రిల్లర్ కథతో ఈ చిత్రం రూపొందుతోంది. సినిమా చాలా బాగా వచ్చింది. ఈ సమ్మర్‌కి ఓ బెస్ట్ సినిమా చూశామనే భావన ప్రేక్షకులకు తప్పక కలుగుతుంది” అని చెప్పారు.
ఈ సినిమాలో సత్యదేవ్‌కి జోడీగా అతీరారాజ్ నటించారు. లక్ష్మణ్, కృష్ణ, అర్చన, రఘుకుంచె, నందగోపాల్ కీలక పాత్రల్లో నటించారు.
నటీనటులు:
సత్యదేవ్, అతీరా రాజ్, లక్ష్మణ్ మీసాల, రఘు కుంచె, నందగోపాల్ తదితరులు
సాంకేతిక వర్గం:
సమర్పణ – కొరటాల శివ, బ్యానర్ – అరుణాచల క్రియేషన్స్, నిర్మాత – కృష్ణ కొమ్మలపాటి, రచన, దర్శకత్వం – వి.వి.గోపాలకృష్ణ, సంగీతం – కాల భైరవ, సినిమాటోగ్రఫీ – సన్నీ కూరపాటి, ఎడిటర్ – తమ్మిరాజు, ఆర్ట్ – రామ్ కుమార్, పాటలు – అనంత శ్రీరాం, ఫైట్స్ – పృథ్వీ శేఖర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – రవి సూర్నెడ్డి, పి.ఆర్.ఒ – వంశీ కాకా.
మిస్టిక్ థ్రిల్లర్ ఫ్రాంచైజీలో ప్రేక్షకులను ఆకట్టుకున్న 'పొలిమేర' సిరీస్ నుంచి మూడో చిత్రంగా వస్తున్న 'పొలిమేర 3'పై అంచనాలు పెరుగుతున్నాయి.…
మంచు లక్ష్మిని అర్థం చేసుకున్నామనుకునేలోపే, ఆమె మరో కొత్త ఆశ్చర్యానికి తెరతీస్తారు! ఇటీవల ఆమె సోషల్ మీడియాలో కొన్ని ఆసక్తికరమైన…
పి.ఎస్.జె. ఫిలిమ్స్ అండ్ కో బ్యానర్ మీద ప్రదీప్ కుమార్, గుండబోయిన శ్రీనివాస్ నిర్మాణంలో సురేందర్ చాచా తెరకెక్కించిన చిత్రం…
సుమ చిత్ర ఆర్ట్స్ సమర్పణలో సుమయా రెడ్డి స్వీయ నిర్మాణంలో నటిస్తున్న రెండో ప్రాజెక్ట్‌ని త్వరలోనే ప్రకటించనున్నారు. ‘డియర్ ఉమ’…
‘శంబాల’ బ్లాక్ బస్టర్ తర్వాత ఆది సాయికుమార్ డిఫరెంట్ సబ్జెక్ట్‌లతో ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలోనే ‘ఈగో రాజా’…
రేసన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపి కృష్ణ జయంతి నిర్మించిన ‘రాయవలస’ చిత్రానికి రాధిక జయంతి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో…