“సత్యభామ” సినిమా థర్డ్ సింగిల్ ‘వెతుకు వెతుకు..’ రిలీజ్

‘క్వీన్ ఆఫ్ మాసెస్’ కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ లో నటిస్తున్న సినిమా “సత్యభామ”. నవీన్ చంద్ర అమరేందర్ అనే కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. “మేజర్” చిత్ర దర్శకుడు శశికిరణ్ తిక్క సమర్పకులుగా వ్యవహరిస్తూ స్క్రీన్ ప్లే అందించారు. క్రైమ్ థ్రిల్లర్ కథతో దర్శకుడు సుమన్ చిక్కాల రూపొందించారు. “సత్యభామ” సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ రోజు హైదరాబాద్ లో “సత్యభామ” సినిమా మ్యూజికల్ ఈవెనింగ్ ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్ లో థర్డ్ సింగిల్ ‘వెతుకు వెతుకు..’ పాట రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో గర్ల్స్, బాయ్స్ పెద్ద సంఖ్యలో పాల్గొని సందడి చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ చరణ్ పాకాల, అండ్ టీమ్ తమ పాటలతో హుషారెత్తించారు. లైవ్ ఆర్కెస్ట్రాలో సింగర్స్ పాడిన సాంగ్స్ ను ఈవెంట్ కు వచ్చిన ఆడియెన్స్ ఎంజాయ్ చేశారు. ఈ మ్యూజికల్ ఈవెంట్ లో స్పెషల్ కాంటెస్ట్ నిర్వహించి విజేతలకు గిఫ్ట్స్ అందజేశారు. ఈ సందర్భంగా

హీరోయిన్ కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ – “సత్యభామ” మ్యూజికల్ ఈవెనింగ్ ఈవెంట్ జరుపుకోవడం హ్యాపీగా ఉంది. ‘వెతుకు వెతుకు..’ నా సోలో సాంగ్. ఈ పాట చేస్తున్నప్పుడు ఎంజాయ్ చేశాం. సత్యభామగా నటించడం ఛాలెంజింగ్ గా అనిపించింది. ఇలాంటి క్యారెక్టర్ నా కెరీర్ లో చేయడం తొలిసారి. మా సినిమాలో ఎమోషన్, డ్రామా, పవర్ ఫుల్ నెస్ అన్నీ ఉన్నాయి. “సత్యభామ” మీ అందరికీ నచ్చుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఈ సినిమా నా కెరీర్ లో ఓ స్పెషల్ ప్రాజెక్ట్ గా భావిస్తున్నా. సినిమా రిలీజ్ కోసం ఎగ్జైటెడ్ గా ఉన్నాను. నేను బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత చేసిన మూవీ ఇది. ఈ సబ్జెక్ట్ చాలా పర్పస్ ఫుల్ గా, రిలవెంట్ గా అనిపించింది. అమ్మాయిలు తప్పకుండా ఈ మూవీ చూడాలి. అమ్మాయిలు షీ సేఫ్ యాప్ ను ఎలా ఉపయోగించి సేఫ్ గా ఉండాలో మా మూవీలో చూపించాం. ఈ అంశం గురించి సినిమాలో వివరంగా తెలుసుకుంటారు. మన అమ్మాయిలు క్షేమంగా ఉండాలనే పాయింట్ ఈ కథలో నన్ను ఆకట్టుకుంది. మహిళలు కూడా ఎంతో శక్తిమంతులు అని చూపిస్తున్నాం. సత్యభామ క్యారెక్టర్ శక్తి కండబలంతో పాటు బుద్ధిబలంలోనూ ఉంటుంది. సత్యభామ చూసి మీ స్పందన తెలియజేస్తారని ఆశిస్తున్నా. అన్నారు.

‘వెతుకు వెతుకు..’ పాటను ఆస్కార్ విజేత, ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి పాడటం విశేషం. ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యాన్ని అందించారు. అమ్మాయిలపై జరుగుతున్న హత్యాయత్నాల నేపథ్యంలో..బాధిత యువతులను చూసి చలించిపోతుంది పోలీస్ ఆఫీసర్ సత్యభామ. ఆ నేరస్తులను పట్టుకోవడానికి సిద్ధమవుతుంది. ఆ సందర్భంలో వచ్చే పాట ఇది. ‘వెతుకు వెతుకు వెతుకు వెనకాడకుండ వెతుకు, వెతుకు వెతుకు వెతుకు ఆశ కొరకు నిరాశలోనే వెతుకు. కాంతి కొరకు నిశీధిలోనే వెతుకు…’ అంటూ ఇన్ స్పైర్ చేసేలా సాగుతుందీ పాట.

నటీనటులు – కాజల్ అగర్వాల్, ప్రకాష్ రాజ్, నవీన్ చంద్ర, తదితరులు

టెక్నికల్ టీమ్

బ్యానర్: అవురమ్ ఆర్ట్స్
స్క్రీన్ ప్లే, మూవీ ప్రెజెంటర్ : శశి కిరణ్ తిక్క
నిర్మాతలు : బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపెల్లి
కో ప్రొడ్యూసర్ – బాలాజీ
సినిమాటోగ్రఫీ – బి విష్ణు
సీఈవో – కుమార్ శ్రీరామనేని
సంగీతం: శ్రీ చరణ్ పాకాల
పీఆర్ఓ: జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
దర్శకత్వం: సుమన్ చిక్కాల

Tfja Team

Recent Posts

‘యమకింకరుడు’ ట్రైలర్‌ విడుదల చేసిన “రాక్షసుడు” నిర్మాత కె.ఎస్. రామారావు!

(తెలుగులో మొదటి AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సినిమాగా ‘యమ కింకరుడు’) ప్రముఖ నిర్మాత, దర్శకుడు తుమ్మలపల్లి రామసత్యనారాయణ టైటిల్ పాత్ర…

19 hours ago

‘మెయిన్ వాపస్ ఆవుంగా’ విజయోత్సవం – ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపిన ఇమ్తియాజ్ అలీ

హిందీ చిత్రం 'మెయిన్ వాపస్ ఆవుంగా' దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. విడుదలై ఆరు వారాలు పూర్తయినా ఈ…

21 hours ago

గ్రాండ్‌గా జరిగిన ‘MRP – నీకెంత నాకెంత’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. జూలై 17న రిలీజ్

యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ 'MRP - నీకెంత నాకెంత' చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విడుదల…

2 weeks ago

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు చేతుల మీదుగా రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ “అదే నీవు అదే నేను” టీజర్ రిలీజ్

తన బ్యానర్ సినిమాకు ఈ టైటిల్ పెట్టాలని అనుకున్నానని వెల్లడించిన ప్రొడ్యూసర్ దిల్ రాజు త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్…

2 weeks ago

నా కెరీర్ లో చాలా స్పెషల్ సినిమా ‘రక్త చరిత్ర’-రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో రామ్ గోపాల్ వర్మ

"రాయలసీమ ఫ్యాక్షనిజంలోని యథార్థ ఘటనలను ఆధారంగా చేసుకుని 'రక్త చరిత్ర' సినిమాను తీశాను. అందులోని క్యారెక్టర్స్ గురించి ఎంతో స్టడీ…

2 weeks ago

యతిరాజు పాత్రలో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచిన శివాజీ

అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తూ సితార ఎంటర్టైనర్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తూ నేడు ప్రేక్షకుల ముందుకు…

2 weeks ago