విక్రాంత్, చాందినీ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “సంతాన ప్రాప్తిరస్తు”. ఈ సినిమాను మధుర ఎంటర్ టైన్ మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. అల్లు శిరీష్ హీరోగా “ఏబీసీడీ” సినిమా, రాజ్ తరుణ్ తో “అహ నా పెళ్లంట” అనే వెబ్ సిరీస్ రూపొందించిన దర్శకుడు సంజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఆయన రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి నటించిన తెలంగాణ ప్రభుత్వ యాంటీ డ్రగ్ యాడ్ ను రూపొందించి ప్రశంసలు అందుకున్నారు. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజా, ఏక్ మినీ కథ లాంటి చిత్రాలకు స్క్రీన్ ప్లే అందించిన రచయిత షేక్ దావూద్ జి ఈ సినిమాకు స్క్రీన్ ప్లే రాస్తున్నారు. మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా “సంతాన ప్రాప్తిరస్తు” సినిమా తెరకెక్కుతోంది.
ఈ రోజు యంగ్ హీరో విక్రాంత్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు బర్త్ డే విశెస్ తెలియజేస్తూ “సంతాన ప్రాప్తిరస్తు” సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. స్పెర్మ్ కౌంట్ పెంచుకునేందుకు హెల్దీ డైట్, మెడిసిన్స్, వ్యాయామం, యోగా, స్ట్రెస్ తగ్గించుకోవడం, బుక్స్ తో ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం..ఇలా వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్న హీరో స్టిల్ తో డిజైన్ చేసిన పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఒక కాంటెంపరరీ ఇష్యూను కథలో చూపిస్తూ వినోదాత్మకంగా “సంతాన ప్రాప్తిరస్తు” సినిమాను రూపొందిస్తున్నారు దర్శకుడు సంజీవ్ రెడ్డి. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ జరుపుకుంటోంది.
నటీనటులు – విక్రాంత్, చాందినీ చౌదరి, వెన్నెల కిషోర్, అభినవ్ గోమటం, మురళీధర్ గౌడ్, జీవన్ కుమార్, తాగుబోతు రమేష్, రచ్చ రవి తదితరులు
టెక్నికల్ టీమ్
కాస్ట్యూమ్ డిజైనర్స్ – అశ్వత్ భైరి, కె ప్రతిభ రెడ్డి
ప్రొడక్షన్ డిజైనర్ – శివకుమార్ మచ్చ
సినిమాటోగ్రఫీ -మహి రెడ్డి పండుగుల
మ్యూజిక్ డైరెక్టర్ – సునీల్ కశ్యప్
డైలాగ్స్ – కల్యాణ్ రాఘవ్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – ఎ మధుసూదన్ రెడ్డి
స్టోరీ, స్క్రీన్ ప్లే – సంజీవ్ రెడ్డి, షేక్ దావూద్ జి
పబ్లిసిటీ డిజైన్ – మాయాబజార్
పీఆర్ ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
ప్రొడ్యూసర్స్ – మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి
డైరెక్టర్ – సంజీవ్ రెడ్డి
హీరో సత్యదేవ్ తన కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టారు. సత్యదేవ్ నటిస్తున్న 15వ చిత్రమిది. ఈ చిత్రాన్ని త్రిశూల్ విజినరీ…
కథా బలమున్న చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తూ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా, డిస్ట్రిబ్యూటర్ గా పేరు తెచ్చుకున్నారు ధీరజ్ మొగిలినేని.…
పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన నటి అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో కొత్త ఫీచర్ ఫిల్మ్‌ను ఎస్ కే…
‘ఉత్తుత్త హీరోలు’ సినిమాను ఎంవిఎం పిక్చర్స్ బ్యానర్ పై మహేష్ విట్టా నిర్మించారు . హాస్య నటనకు పేరుగాంచిన మహేష్…
నరేష్ వీకే, అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, రాజ్ వెడ్స్ రాంబాయి ఫేమ్ అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న…
ఇటీవల లిటిల్‌హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి, ఈషా వంటి బ్లాక్‌బస్టర్స్ చిత్రాలను అందించిన బన్నీవాస్, వంశీ నందిపాటిల సక్సెస్‌ఫుల్ ద్వయం…