స్టార్ హీరోయిన్ రశ్మిక మందన్న వరుస అవకాశాలతో పాన్ ఇండియా స్థాయిలో దూసుకెళ్తోంది. పుష్ప 2 సినిమాతో దేశవ్యాప్తంగా రశ్మిక గుర్తింపు తెచ్చుకుంది. ఆమెకు తెలుగుతో పాటు హిందీలో భారీ ఆఫర్స్ దక్కుతున్నాయి. యానిమల్ బ్లాక్ బస్టర్ తర్వాత బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారింది రశ్మిక మందన్న. ఆమె తాజాగా మరో బిగ్గెస్ట్ మూవీ దక్కించుకుంది. సల్మాన్ ఖాన్ హీరోగా దర్శకుడు ఏఆర్ మురుగదాస్ రూపొందిస్తున్న సికిందర్ సినిమాలో రశ్మిక హీరోయిన్ గా ఎంపికైంది. మేకర్స్ ఈ విషయాన్ని ఈ రోజు అనౌన్స్ చేశారు.
సికిందర్ సినిమాలో సల్మాన్ ఖాన్ జోడిగా నటించేందుకు రశ్మిక మందన్నకు అహ్వానం పలుకుతున్నాం. ఈ జంట ఆన్ స్క్రీన్ మ్యాజిక్ త్వరగా చూడాలని కోరుకుంటున్నాం. వచ్చే ఈద్ పండక్కి తెరపై సల్మాన్, రశ్మిక జంట తెరపైకి వస్తారు. అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ సినిమా దక్కడంపై రశ్మిక మంందన్న ఇన్ స్టాగ్రామ్ లో స్పందించింది. నా నెక్ట్ మూవీ అప్డేట్ చెప్పమని ఫ్యాన్స్ తరుచూ అడుగుతుంటారు. సల్మాన్ సరసన సికిందర్ మూవీలో నటించే అవకాశం దక్కడాన్ని గౌరవంగా, గర్వంగా భావిస్తున్నా. అని పోస్ట్ చేసింది.
ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ లో ఉన్న రశ్మిక ఈ ఆగస్టు 15న శ్రీవల్లిగా మరోసారి స్క్రీన్ మీద మ్యాజిక్ చేయబోతోంది. ఆమె గర్ల్ ఫ్రెండ్ అనే ఫీమేల్ ఓరియెంటెడ్ మూవీలోనూ నటిస్తోంది. రశ్మిక అందుకుంటున్న అవకాశాలు చూస్తుంటే ప్రస్తుతం ఆమె బిగ్గెస్ట్ పాన్ ఇండియా హీరోయిన్ అనుకోవచ్చు.
అర్జున్ కోలా దర్శకత్వంలో దినేష్ తేజ్, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్, ఎస్.కె.ప్రొడక్షన్స్…
స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అందరూ థియేటర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి…
ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…
ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…
ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…