‘సలార్’ .. జూలై 6న టీజర్

ఎంటైర్ ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తోన్న పాన్ ఇండియా మూవీ ‘సలార్’. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా KGFతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ హోంబ‌లే ఫిలింస్ బ్యాన‌ర్ నిర్మిస్తోన్న భారీ బ‌డ్జెట్ చిత్రమిది. ఈ సినిమా అనౌన్స్ చేసిన రోజు నుంచి అంద‌రిలో ఎగ్జ‌యిట్‌మెంట్‌ను పెంచుతోంది. ఈ మూవీకి సంబంధించిన అప్‌డేట్స్ కోసం ఫ్యాన్స్‌, ప్రేక్ష‌కులు ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు. ఈ క్ర‌మంలో మేక‌ర్స్ ‘స‌లార్’ టీజ‌ర్‌ను జూలై 6 ఉద‌యం 5 గంట‌ల 12 నిమిషాల‌కు విడుద‌ల చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

ఈ ఏడాదిలో విడుద‌ల‌వుతున్న బిగ్గెస్ట్ మూవీ ‘స‌లార్‌’. బాహుబ‌లి ఫ్రాంచైజీతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్ర‌భాస్ అభిమానులు, ప్రేక్ష‌కులు అంచ‌నాలకు ధీటుగా ప్ర‌శాంత్ నీల్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. వీరిద్ద‌రి కాంబోలో రాబోతున్న తొలి సినిమా ఇది.

‘‘‘సలార్’టీజ‌ర్‌ను జూలై 6న అన్నీ భాష‌ల్లో విడుద‌ల చేయ‌బోతున్నారు. KGF2, కాంతార చిత్రాల‌తో ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్స్‌ను సొంతం చేసుకున్నాం. ఇప్పుడు మా బ్యాన‌ర్ నుంచి ప్ర‌భాస్ హీరోగా మ‌రో భారీ బ‌డ్జెట్ సినిమా స‌లార్ రిలీజ్ చేస్తున్నాం. ఈ సినిమా సరికొత్త రికార్డుల‌ను క్రియేట్ చేస్తుంద‌న‌టంలో సందేహం లేద‌ర‌. ఈ మెగా యాక్ష‌న్ ప్యాక్డ్ మూవీ టీజ‌ర్‌ను చూడ‌టానికి ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నార‌ని తెలుసు. దాన్ని రిలీజ్ చేయ‌టానికి స‌ర్వం సిద్ధంగా ఉంది’’ అని హోంబలే ఫిలింస్ ప్రతినిధులు తెలిపారు.

ప్రభాస్‌తో పాటు పృథ్వీరాజ్ సుకుమార్‌, శ్రుతీ హాస‌న్‌, జ‌గ‌ప‌తి బాబు, త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తోన్న పాన్ ఇండియా భారీ చిత్రం ‘స‌లార్‌’ను సెప్టెంబర్ 28న రిలీజ్ చేస్తున్నారు.

Tfja Team

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

17 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

17 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

17 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago