శాకుంతలం’ బ్యూటీ ఫుల్ ఫ్యామిలీ డ్రామా.. దిల్ రాజు

– దిల్ రాజుగారి వంటి మేక‌ర్‌ను వాడుకోక‌పోతే అది మ‌న మూర్ఖ‌త్వ‌మే అవుతుంది:  గుణ శేఖ‌ర్‌
– ఏప్రిల్ 14 కోసం చాలా ఎగ్జ‌యిట్‌మెంట్‌తో వెయిట్ చేస్తున్నాను:  నిర్మాత నీలిమ గుణ‌
……………………………………………………………………………………………………………………

ప్యాషనేట్ ఎపిక్ ఫిల్మ్ మేక‌ర్ గుణ శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న పౌరాణిక ప్రేమకథా చిత్రం ‘శాకుంతలం’. ఈ ఎపిక్ లవ్ స్టోరీలో సమంత, దేవ్ మోహన్ జంటగా నటించారు. ఈ విజువల్ వండర్ ప్ర‌పంచ వ్యాప్తంగా ఏప్రిల్ 14న రిలీజ్ అవుతుంది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి.  కాళిదాసు ర‌చించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా శాకుంత‌లంను రూపొందిస్తున్నారు గుణ శేఖ‌ర్‌. శ్రీ వెంకటేశ్వ‌ర‌క క్రియేష‌న్స్ దిల్ రాజు స‌మ‌ర్ప‌ణ‌లో గుణ టీమ్ వ‌ర్క్స్ బ్యానర్‌పై నీలిమ గుణ ఈ  పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 3D టెక్నాల‌జీతో విజువ‌ల్ వండ‌ర్‌గా  తెలుగు, హిందీ, త‌మిళ‌, హిందీ, మ‌ల‌యాళ భాష‌ల్లో శాకుంత‌లం సినిమా ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌నుంది. మంగళవారం ఈ సినిమా త్రీడీ ట్రైలర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఈ సంద‌ర్బంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో..

చిత్ర నిర్మాత నీలిమ గుణ మాట్లాడుతూ ‘‘సమంతగారు ఈ 3D ట్రైల‌ర్ లాంచ్ ఈవెంట్‌కి రావాల్సింది. కానీ రాలేక‌పోయారు. అయితే ఆమె మ‌న‌సంతా ఇక్క‌డే ఉంది. శాకుంత‌లం సినిమాను 3D టెక్నాల‌జీలోకి మార్చాల‌నే ఆలోచన దిల్‌రాజుగారిదే. అందుకు ఆయ‌న‌కు స్పెష‌ల్ థాంక్స్‌. ఇప్పుడు త్రీడీ ట్రైల‌ర్ చూస్తుంటే ఆయ‌న ఆలోచ‌న ఎంత గొప్ప‌దో అర్థ‌మ‌వుతుంది. మ‌న మైథాల‌జీని ఇలా త్రీడీలో సినిమా చేయ‌టం ఇదే తొలిసారి అనుకుంటా. మ‌న సంస్కృతిని సెల‌బ్రేట్ చేసుకుంటున్నాం. 3Dలో శాకుంతలం సినిమాను ఎంజాయ్ చేస్తార‌ని ఆశిస్తున్నాను. ఏప్రిల్ 14 కోసం ఎగ్జ‌యిట్‌మెంట్‌తో వెయిట్ చేస్తున్నాను’’ అన్నారు.

ఎడిట‌ర్ ప్ర‌వీణ్ పూడి మాట్లాడుతూ ‘‘శాకుంత‌లం సినిమా 3Dలోనూ రాబోతుంది. ట్రైల‌ర్ అంద‌రికీ న‌చ్చి ఉంటుంద‌ని అనుకుంటున్నాను. సినిమా చాలా బాగా వ‌చ్చింది. అంద‌రూ మూవీని బాగా ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు.

రైటర్ సాయిమాధవ్ బుర్రా మాట్లాడుతూ ‘‘‘శాకుంతలం’ వంటి గొప్ప సినిమాకు ప‌ని చేసే అవ‌కాశం వ‌చ్చినందుకు చాలా గ‌ర్వంగా ఫీల్ అవుతున్నాను. ఈ క‌థేంటో మ‌న అంద‌రికీ తెలిసిందే. అయితే గుణ శేఖ‌ర్‌గారు ఈ సినిమాను ఎలా చెబుతారు. టేకాఫ్ ఎలా ఉంటుంది?  అనే క్యూరియాసిటీ క‌లిగింది. అయితే క‌థ విన్న త‌ర్వాత‌ ఆయ‌న టేకాఫ్‌కి థ్రిల్ అయిపోయాను. అంద‌రూ ఊహించిన దాని కంటే విభిన్నంగా ప్ర‌తీ నిమిషం సినిమా బావుంటుంది. ఈ సినిమా న‌వ్విస్తుంది. ఏడిపిస్తుంది. న‌వ్విస్తూ ఏడిస్తుంది. ఆలోచింప చేస్తుంది. ఒక అద్భుత‌మైన సినిమా చూశామ‌నే ఫీలింగ్‌ను మీకు ఇచ్చి థియేట‌ర్స్ నుంచి బ‌య‌ట‌కు తీసుకొస్తుంది. మ‌ళ్లీ మ‌ళ్లీ థియేట‌ర్‌కు వ‌చ్చేలా చేస్తుంది. శ‌కుంత‌లం పాత్ర‌లో స‌మంత అద్భుతంగా న‌టించింది. ఇక దేవ్ మోహ‌న్ కూడా చాలా గొప్ప‌గా న‌టించాడు. మ‌ణిశ‌ర్మ అద్భుత‌మైన సంగీతాన్ని అందించారు. ప్ర‌తీ డిపార్ట్‌మెంట్ నుంచి గుణ శేఖ‌ర్‌గారు మంచి ఔట్‌పుట్ తీసుకున్నారు. నా ఫ‌స్ట్ సినిమాకే నేను దిల్ రాజుగారి ద‌గ్గ‌ర ప‌ని చేయాల్సింది. ఇప్ప‌టికీ కుదిరింది. గేమ్ చేంజర్‌కి కూడా నేను వ‌ర్క్ చేస్తున్నాను. ఇంత మంచి అవ‌కాశం ఇచ్చిన గుణ శేఖ‌ర్‌గారికి, దిల్ రాజుగారికి థాంక్స్‌’’ అన్నారు.

నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ ‘‘సినిమా చరిత్రలో మన తెలుగు సినిమా ఇంతింతై వ‌టుడింతై అనే స్టైల్లో ప్ర‌పంచ వ్యాప్తంగా తెలుగు సినిమా రేంజ్‌ను పెంచుకుంటూ వ‌చ్చేశాం. నేను కూడా నిర్మాత‌గా 50 సినిమాలు చేసేశాను. త‌మిళంలో ఈ ఏడాది వారిసు చేశాను. అలాగే ఇక్క‌డ కూడా బ‌ల‌గం సినిమాతో స‌క్సెస్ కొట్టాం. నెక్ట్స్ గేమ్ చేంజ‌ర్ కూడా రాబోతుంది. ఈ మ‌ధ్య‌లో శాకుంత‌లం సినిమా వ‌స్తుంది. నిజానికి గుణ శేఖ‌ర్‌గారు స‌మంత‌తో ఈ ప్రాజెక్ట్ అనుకున్న‌ప్పుడు నేను లేను. అయితే స‌మంత మేనేజర్ మ‌హేంద్ వ‌చ్చి ఇలా సినిమా అనుకుంటున్నారు సార్‌.. మీరు క‌థ వింటే బావుంటుందన్నారు. స‌రేన‌ని క‌థ విన్నాను. అంద‌రూ నేను గుణ శేఖ‌ర్‌గారికి హెల్ప్ చేయ‌టానికి ఈ సినిమాలో జాయిన్ అయ్యాన‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ నేను సెల్ఫిష్‌గా ఈ సినిమాలో జాయిన్ అయ్యాను. ఎందుకంటే ఇప్పుడు తెలుగు సినిమా గ్లోబల్ రేంజ్‌కు చేరుకుంది. అలాంటి గ్లోబ‌ల్ సినిమా గురించి నేర్చుకోవ‌టానికే నేను శాకుంత‌లంలో జాయిన్ అయ్యాను. వి.ఎఫ్‌.ఎక్స్ గురించి నేర్చుకోవాల‌నే ఉద్దేశంతోనే నేను ఇందులో పార్ట్ అయ్యాను. సాధార‌ణంగా ఇలాంటి సినిమాల్లో నిర్మాత‌ల‌కు పెద్ద‌గా ప‌ని ఉండ‌దు. కానీ నేను మాత్రం గుణ శేఖ‌ర్‌గారికి హెల్ప్ కావాలి. నేను కూడా నేర్చుకోవాల‌ని జాయిన్ అయ్యాను. బాహుబ‌లితో తెలుగు సినిమాను పాన్ ఇండియా రేంజ్‌కు తీసుకెళ్లిన రాజ‌మౌళి ఆర్ఆర్ఆర్‌తో దాన్ని ప్ర‌పంచ స్థాయికి తీసుకెళ్లాడు. అలాగే తెలుగు సినిమాల‌ను ఇంకా ప్ర‌పంచానికి చూపిస్తూ ఉండాల‌నే ఉద్దేశంతో నేను వేసిన మొద‌టి అడుగు శాకుంత‌లం.బ్యూటీఫుల్ ఫ్యామిలీ డ్రామా.. విజువ‌ల్ వండ‌ర్‌గా సినిమా తెరెక్కింది. ఓ థియేట‌ర్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చే సినిమా. ఏప్రిల్ 14న ఫ్యామిలీస్ అంతా క‌లిసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది. మ‌న నెక్ట్స్ జ‌న‌రేష‌న్‌కు మ‌న క‌థ తెలియాలి. అందుక‌నే ఈ స‌మ్మ‌ర్‌లో ఏప్రిల్ 14న మా శాకుంత‌లం సినిమాను మీ ముందుకు తీసుకొస్తున్నాం. సినిమా చూసి బ‌య‌ట‌కొచ్చేట‌ప్పుడు అల్లు అర్హ రూపంలో ఓ స‌ర్‌ప్రైజ్ ఉంటుంది. నాకు సినిమా గురించి ఇంకా నేర్పించినందుకు గుణ శేఖ‌ర్‌గారికి థాంక్స్‌. ఈ మూవీ వ్య‌వ‌థి 2 గంట‌ల 19 నిమిషాలు. ఈ టైమ్‌లో ప్రేక్ష‌కుడికి ఎక్క‌డా బోర్ కొట్టించ‌కూడ‌దు. అదే పెద్ద చాలెంజ్‌. దాన్ని మనం ఎచీవ్ చేశాం’’ అన్నారు.

ద‌ర్శ‌కుడు గుణ శేఖ‌ర్ మాట్లాడుతూ ‘‘ఇది స‌మంత‌గారి శాకుంత‌లం. ఆమె ప్రాణం పెట్టి శకుంత‌ల పాత్ర‌కు ప్రాణ ప్ర‌తిష్ట చేశారు. రేపు ఫ‌స్ట్ ఫ్రేమ్ నుంచి చివ‌రి ఫ్రేమ్ వ‌ర‌కు చూస్తారు. ఏప్రిల్ 14న మీరు సినిమా చూసి ఏం మాట్లాడాల‌నుకుంటున్నారో వినాల‌ని ఎదురు చూస్తున్నారు. మ‌హాభారతంలో దుష్యంతుడు, శ‌కుంత‌ల పాత్ర‌లను ఆధారంగా చేసుకుని కాళిదాసుగారు అభిజ్ఞాన శాకుంత‌లం రాశారు. దాన్ని విజువ‌ల్‌గా మీ ముందుకు తీసుకొచ్చే క్ర‌మంలో లింకుల కోసం చిన్న చిన్న ఇంప్ర‌వైజేష‌న్ చేశాం త‌ప్ప‌.. దాదాపు 90 ఒరిజిన‌ల్ క‌థ‌నే సినిమాగా తీశాం. ఇప్పుడు ఆడియెన్స్ అభిరుచులు మామూలుగా లేవు. కంటెంట ప‌రంగా ఆడియెన్స్ మ‌న కంటే చాలా ముందున్నారు. ఆడియెన్స్‌ను ఇంప్రెజ్ చేయ‌ట‌మే నా చాలెంజ్‌. ఏప్రిల్ 14న వ‌స్తున్న ఈ మూవీ త‌న మార్క్ క్రియేట్ చేసుకుంటుంది. \

దిల్‌రాజుగారు నిత్య విద్యార్థి. ప్ర‌తి రోజూ ఆయ‌న కొత్త విష‌యాల‌ను నేర్చుకుంటుంటారు. ఆయ‌న నా ద‌గ్గ‌ర నుంచి ఏం నేర్చుకున్నారో నేను కూడా ఆయ‌న ద‌గ్గ‌ర చాలా విష‌యాలు నేర్చుకున్నాను. ఎందుకంటే ఆయ‌న బ‌లగం సినిమాను నిల‌బెట్ట‌డానికి ట్రాక్ట‌ర్ ఎక్కి ట్రావెల్ అయ్యారు. అలాగే గేమ్ చేంజ‌ర్ సినిమాలో శంక‌ర్‌గారికి ద‌న్నుగా నిల‌బ‌డ్డారు. తెలుగు సినిమా ఈరోజు ఇలాగా వెలిగిపోతుందంటే దిల్‌రాజుగారిలాంటి నిర్మాత‌లే కారణం. స‌మంత‌గారితో ఈ సినిమా చేయాల‌న‌కున్న‌ప్పుడు ఆ ప్రాజెక్ట్‌లో పార్ట్ కావ‌టానికి చాలా మంది నిర్మాత‌లు ఆస‌క్తి చూపించారు. అయితే దిల్ రాజుగారు పార్ట్ అవుతార‌న‌గానే నేను ఆస‌క్తి చూపించాను. అందుకు కార‌ణం మేక‌ర్‌గా ఓ సినిమాను చూసి ఆయ‌న చెప్పేయ‌గ‌ల‌రు. ఆయ‌న‌లాంటి మేక‌ర్‌ను వాడుకోక‌పోతే మా మూర్ఖ‌త్వ‌మే అవుతుంది ఇది. ఆయ‌న ఎగ్జిబిట‌ర్‌, డిస్ట్రిబ్యూట‌ర్‌, నిర్మాత‌. ఆడియెన్స్ ప‌ల్స్ తెలిసిన నిర్మాత‌. ఆయ‌న్ని వాడుకోవాల్సిన అవ‌స‌రం మాకు ఉంది’’ అన్నారు.

Tfja Team

Recent Posts

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

1 day ago

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

1 week ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

1 week ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

1 week ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

1 week ago

సెప్టెంబర్ 4న విడుదలకు సిద్దంగా ‘మా రాముడు అందరివాడు’

ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…

1 week ago