‘మ్యూజిక్ స్కూల్’ మూవీ మే 12న రిలీజ్ అవుతుంది..దిల్ రాజు

షర్మన్‌ జోషి, శ్రియా శరణ్‌, షాన్‌, సుహాసిని మూలే, ప్రకాష్‌ రాజ్ త‌దిత‌రులు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తోన్న చిత్రం ‘మ్యూజిక్ స్కూల్’. మ్యాస్ట్రో ఇళ‌య‌రాజా సంగీతంసంగీత సార‌థ్యం వ‌హిస్తోన్న‌ మ‌ల్టీ లింగ్వువ‌ల్ మ్యూజికల్ మూవీ మే 12న రిలీజ్ అవుతుంది. ఈ సంద‌ర్భంగా మంగ‌ళ‌వారం హైద‌రాబాద్‌లో మేక‌ర్స్ పాత్రికేయుల స‌మావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్ర‌ముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూట‌ర్ దిల్ రాజు ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఆయ‌న చేతుల మీదుగా మ్యూజిక్ స్కూట్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను గ‌మ‌నిస్తే శ్రియా శ‌ర‌న్ కొంత మంది పిల్ల‌ల‌తో క‌లిసి గోవా సముద్ర తీరంలో కారు డ్రైవింగ్ చేస్తూ అల్ల‌రి చేస్తుంది. ఈ సందర్భంగా…

దిల్ రాజు మాట్లాడుతూ ‘‘ సినిమాపై ప్యాష‌న్ ఎలా ఉంటుంద‌న‌టానికి ఈ సినిమా ఒక ఉదాహ‌ర‌ణ‌. ఎందుకంటే ఈ సినిమా డైరెక్ట‌ర్ పాపారావుగారు. ఆయ‌న అపాయింట్‌మెంట్ కోసం అంద‌రూ తిరుగుతుంటారు. అలాంటి వ్య‌క్తి సినిమాపై ప్యాష‌న్‌తో త‌న జాబ్‌కి రిజైన్ చేసి సినిమా రంగంలోకి అడుగు పెట్టారు. ఇప్పుడు ఎడ్యుకేష‌న్ సిస్ట‌మ్‌లో చాలా ప్రెజ‌ర్ ఉంటోంది. అందుకు మ‌రో ఎగ్జాంపుల్ నా మన‌వ‌డే. త‌న‌కు ఆరేళ్లు. త‌ను ఉద‌యం ఆరేడు గంట‌ల‌కే స్కూల్‌కి బ‌య‌లుదేరితే సాయంత్రం ఐదు గంట‌ల‌కు ఇంటికొస్తాడు. అంటే తెలియ‌కుండా అంత ఒత్తిడి పిల్ల‌ల‌పై ఉంది. ఇది అన్ని ఫ్యామిలీస్‌లోఉండే సమ‌స్య‌. ఇప్పుడు పిల్ల‌ల‌పై ఎడ్యుకేష‌న్ వ‌ల్ల ఎంత ప్రెష‌ర్ ప‌డుతుంద‌నేది తెలియ‌జేసే చిత్ర‌మే మ్యూజిక్ స్కూల్‌. శ్రియా శ‌ర‌న్ మెయిన్ లీడ్‌గా, అంద‌రు చిన్న పిల్ల‌ల‌తో ఈ సినిమాను చేశారు. ఇదొక సీరియ‌స్ పాయింట్ కానీ దాన్ని వినోదాత్మ‌కంగా మ్యూజికల్ ఫిల్మ్‌గా చేశారు పాపారావుగారు. గ్రేట్ ఇళ‌య‌రాజాగారు సంగీతాన్ని అందించారు. మే 12న మూవీ రిలీజ్ అవుతుంది. చాలా రోజుల ముందు అభినంద‌న సినిమాలో ఎనిమిది పాట‌లు, ఇంకా ఎక్కువ పాట‌లతో హ‌మ్ ఆప్ కే హై కౌన్ సినిమాను ప్రేక్ష‌కులు చూశారు. అలా 11 పాట‌లతో మ్యూజిక్ స్కూల్ ఓ మ్యూజిక‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా వ‌స్తుంది. ఈ సినిమాను తెలుగులో మేం రిలీజ్ చేస్తున్నాం. మిగ‌తా నేష‌న‌ల్ వైడ్ పి.వి.ఆర్ వాళ్లు రిలీజ్ చేస్తున్నారు. డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో పాపారావుగారు చేసిన ఈ ప్ర‌య‌త్నాన్ని ప్రేక్ష‌కులు ఆద‌రించాల‌ని కోరుకుంటున్నాను. ఎంటైర్ టీమ్‌కు ఆల్ ది బెస్ట్.  ఈ సినిమా పాట‌ల‌ను ఆదిత్య వాళ్లు రిలీజ్ చేస్తున్నారు. అందుకు నిరంజ‌న్‌గారికి, ఉమేష్‌గారికి థాంక్స్’’ అన్నారు.

ఐఏఎస్ ఆఫీస‌ర్‌, సినిమా అంటే ప్యాష‌న్ ఉన్న పాపారావు బియ్యాల మ్యూజిక్ స్కూల్‌ చిత్రం ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఆయ‌న మాట్లాడుతూ ‘‘ప్రస్తుతం ఉన్న ప‌రిస్థితుల దృష్ట్యా త‌ల్లిదండ్రులు, టీచ‌ర్స్‌, స‌మాజం పిల్ల‌ల‌పై చ‌దువు పేరుతో ఒత్తిడిని పెంచేస్తున్నారు. ఇలాంటి వాటి వ‌ల్ల వారిలో అభివృద్ధి జ‌ర‌గ‌టం లేదు, స‌రి క‌దా అదే వారి ఎదుగుద‌ల‌కు స‌మ‌స్య‌గా మారుతుంది. నిజానికి ఇదొక సీరియ‌స్ పాయింట్, అయితే దాన్ని సంగీత రూపంలో వినోదాత్మ‌కంగా చెప్ప‌టానికి ప్ర‌య‌త్నించాం’’ అన్నారు.

కిరన్ డియోహన్స్ సినిమాటోగ్రాఫర్‌గా వ‌ర్క్ చేసిన ఈ చిత్రానికి అద్భుత‌మైన డాన్సుల‌ను కంపోజ్ చేశారు ఆడ‌మ్ ముర్రు, చిన్ని ప్ర‌కాష్‌, రాజు సుంద‌రం.

ఓజూ బారువా, గ్రేసీ గోస్వామి కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఇంకా బెంజిమిన్ జిలాని, సుహాసిని మౌలే, మోన‌, లీలా సామ్‌స‌న్స్‌, బ‌గ్స్ భార్గ‌వ‌, విన‌య్ వ‌ర్మ‌, శ్రీకాంత్ అయ్యంగార్‌, వ‌కార్ షేక్‌, ఫ‌ణి త‌దిత‌రులు ఇత‌ర పాత్ర‌ల్లో న‌టించారు.

యామిని ఫిల్మ్స్ బ్యాన‌ర్‌పై ఈ చిత్రానికి హిందీ, తెలుగు చిత్రీక‌రించి త‌మిళ‌లో అనువాదం చేసి మే 12న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్‌చేస్తున్నారు. హిందీలో పి.వి.ఆర్‌, తెలుగులో దిల్ రాజు ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు

Tfja Team

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

13 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

13 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

13 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago